అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు, మన యాదాద్రి కలశంలకు సారుప్యత ఉందా ? అంటే ఉందని ఒప్పుకోక తప్పదు. ఏ విధంగా అంటే నానో టెక్ గోల్డ్ డిపోజిషన్ (ఎన్‌టీజీడీ) టెక్నాలజీ పరంగా అనే సమాధానం వస్తుంది. అటు నాసా, ఇటు యాదాద్రి కలశాలకు ఉపయోగించినది ఈ సాంకేతికతనే ! నాసా లేదంటే మన ఇస్రోలో రక్షణ వ్యవస్ధలు లేదంటే యంత్రసామాగ్రి పరిరక్షణకు ఈ గోల్డ్ కోటింగ్ సాంకేతికతనే వినియోగిస్తుంటారు. అదే తరహా సాంకేతికతను హైదరాబాద్ సమీపంలోని యాదాద్రి దేవాలయ బంగారు కలశాలపై కూడా ఉపయోగించారు. దాదాపు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని పూర్తిగా పునరుద్ధరించి మార్చి 28వ తేదీన భక్తుల కోసం తెరువబోతున్నారు.