AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు.. సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

Suryaprabha Vahanam: ఏడో రోజైన సోమ‌వారం ఉదయం గోవిందరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ నిర్వ‌హించారు.

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు.. సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు
Govindaraja Temple, Tirupat
Sanjay Kasula
|

Updated on: May 24, 2021 | 3:18 PM

Share

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. ఇందులో భాగంగా ఏడో రోజైన సోమ‌వారం ఉదయం గోవిందరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ నిర్వ‌హించారు.

సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారకుడు, ప్రకృతికి చైతన్యప్రధాత.వర్షాలు, వాటివల్ల పెరిగే వృక్ష‌లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఔషధాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి.అట్టి సూర్యప్రభను అధిష్టించిన స్వామిని ద‌ర్శించ‌డం వ‌ల‌న ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

అనంతరం ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారికి స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, ప‌సుపు, చందనంతో అభిషేకం చేశారు.కాగా సాయంత్రం 5 నుండి 5.30 గంటల వరకు చంద్ర‌ప్ర‌భ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.

ఇవి కూడా చదవండి: Anandaiah Medicine: ఆనందయ్య మందుపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఇవాళ ఐసీఎంఆర్‌ బృందం రావడంలేదుః జిల్లా కలెక్టర్