AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rudraksha Remedies: రుద్రాక్షను ధరించాలనుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పని సరి..

రుద్రాక్ష ధరించడం వల్ల ఆనందం, అదృష్టాన్ని కలిగిస్తుంది. అన్ని రకాల ఇబ్బందుల నుండి మనల్ని రక్షిస్తుంది. కానీ, ఈ రుద్రాక్షను కొనుగోలు చేసి ధరించే ముందు, కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. రుద్రాక్ష నిజమైనదా..? లేదా నకిలీదా అని చెక్‌ చేసుకోవడం తప్పనిసరి. అంతేకాదు.. రుద్రాక్షను ధరించడానికి ముఖ్యమైన నియమాలు కూడా ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

Rudraksha Remedies: రుద్రాక్షను ధరించాలనుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పని సరి..
Rudraksha Remedies
Jyothi Gadda
|

Updated on: Nov 17, 2025 | 5:58 PM

Share

సనాతన సంప్రదాయంలో రుద్రాక్ష చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఇది దేవతలకు దేవుడైన మహాదేవుడు ధరిస్తాడు. హిందూ మతంలో రుద్రాక్షను రుద్రుని ప్రసాదంగా అని పిలుస్తారు. ఈ అద్భుత రుద్రాక్ష మాల, కంకణం మరే రూపంలోనైనా ధరించడం వల్ల ఎల్లప్పుడూ శివుని ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. రుద్రాక్ష ధరించడం వల్ల ఆనందం, అదృష్టాన్ని కలిగిస్తుంది. అన్ని రకాల ఇబ్బందుల నుండి మనల్ని రక్షిస్తుంది. కానీ, ఈ రుద్రాక్షను కొనుగోలు చేసి ధరించే ముందు, కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. రుద్రాక్ష నిజమైనదా..? లేదా నకిలీదా అని చెక్‌ చేసుకోవడం తప్పనిసరి. అంతేకాదు.. రుద్రాక్షను ధరించడానికి ముఖ్యమైన నియమాలు కూడా ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

నిజమైన రుద్రాక్షను, నకిలీ రుద్రాక్షను ఎలా గుర్తించాలి?:

నకిలీ రుద్రాక్షలను సులభంగా గుర్తించవచ్చు. రుద్రాక్ష ప్రామాణికతను నిర్ధారించడానికి మీరు దానిని పరీక్షించాలనుకుంటే మీరు దానిని నీటిలో ముంచాలి. ఒక గ్లాసు నీటిని తీసుకొని అందులో రుద్రాక్షను ఉంచాలి. అప్పుడు అది నీటిలో మునిగితే అసలైన రుద్రాక్ష, నీటిపై తేలితే అది నకిలీ రుద్రాక్షగా గుర్తించాలి. అదేవిధంగా రెండు రాగి రేఖల మధ్య రుద్రాక్షను ఉంచినప్పుడు ఆ రుద్రాక్ష తానంతట తానే సవ్య దిశలో తిరుగుతుందట. ఈ విధంగా సవ్య దిశలో తిరిగే రుద్రాక్ష స్వచ్ఛమైనది గానూ, అపసవ్యలో తిరిగే రుద్రాక్షను నకలిగానూ గుర్తిస్తారు. అయితే, మీకు ఇంకా సందేహాలు ఉంటే, మీరు దానిని వేడి నీటిలో వేసి కూడా టెస్ట్‌ చేయవచ్చు. నకిలీ రుద్రాక్ష అయితే, అది వేడి నీటిలో విడిపోతుంది. లేదంటే, అనుభవజ్ఞుడైన నిపుణుల ద్వారా లేదంటే, ల్యాబ్‌లో పరీక్షించడం ద్వారా కూడా మీరు దాని ప్రామాణికతను ధృవీకరించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎన్ని రుద్రాక్షలు ధరించాలి?:

హిందూ విశ్వాసం ప్రకారం, మీరు శివుని గొప్ప నైవేద్యం అయిన రుద్రాక్ష జపమాల ధరించాలనుకుంటే దానిని 108 పూసలలో కట్టాలి. హిందూ మతంలో, 108 సంఖ్యను పరిపూర్ణ పూర్ణాంకంగా పరిగణిస్తారు. దాని శుభ ప్రభావంతో భక్తుడు నిరంతరం ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదాలను పొందుతాడని భావిస్తారు. అయితే, మీరు కావాలనుకుంటే 54 లేదా 27 పూసలతో జపమాల ధరించవచ్చు.

రుద్రాక్ష ధరించే విధానం:

శివుని ఆశీస్సులను అందించే పవిత్ర రుద్రాక్షను జపమాల రూపంలో లేదా మరేదైనా విధంగా ధరించాలనుకుంటే దానిని ఎల్లప్పుడూ ఎరుపు, పసుపు లేదా తెలుపు దారంతో కట్టిన తర్వాత ధరించండి. అది రుద్రాక్ష జపమాల అయినా, బ్రాస్లెట్ అయినా, మెడలో లాకెట్ అయినా, దానిని ఎప్పుడూ నల్ల దారంతో ధరించరాదని గుర్తుంచుకోండి. వేరొకరు ధరించిన రుద్రాక్షను మీ మెడలో లేదా చేతిపై ఎప్పుడూ ధరించవద్దు. రుద్రాక్షను ధరించే ముందు దానిని గంగా జలంతో కడిగి, శివుడికి అర్పించిన తర్వాత, ఆయన మంత్రాలలో కనీసం ఒక జపమాలనైనా ప్రసాదంగా భావించి జపించిన తర్వాత మాత్రమే దానిని ధరించండి.

ఏ రుద్రాక్ష ఏ రాశికి శుభప్రదం?:

మేషం – 05 ముఖి రుద్రాక్ష

వృషభం – 06, 10 ముఖి రుద్రాక్ష

మిథునం – 04 లేదా 11 ముఖి రుద్రాక్ష

కర్కాటకం – 04 లేదా గౌరీ శంకర్ రుద్రాక్ష

సింహం – 05 ముఖి రుద్రాక్ష

కన్య – గౌరీ శంకర్ రుద్రాక్ష

తులారాశి – 07 ముఖి, గణేశ రుద్రాక్ష

08 ముఖి, గణేష్ రుద్రాక్ష 03

ధనుస్సు – 09 ముఖి లేదా 01 ముఖి

మకరం – 10 ముఖి, 13 ముఖి రుద్రాక్ష

కుంభం – 07 ముఖి రుద్రాక్ష

మీనం – 1 ముఖి రుద్రాక్ష

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..