AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎడారిలో ఒయాసిస్‌ ఎప్పుడైనా చూశారా..?ఎక్కడో తెలిస్తే.. ఎగురుకుంటూ ఇప్పుడే వెళ్తారు..!

ఎడారి మధ్యలో గులాబీ రంగు రిఫ్రిజిరేటర్‌ను చూడటం ఎండమావిలా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. ఇది కేవలం షోపీస్ కాదు. మీరు రిఫ్రిజిరేటర్ తెరిస్తే, మీకు చల్లని నీరు, కూల్‌డ్రింక్స్‌, జ్యూస్‌లు కనిపిస్తాయి. ఈ రిఫ్రిజిరేటర్‌ను నిర్జన ఎడారిలో ఎందుకు ఉంచారోనంటూ ఇది చూసిన చాలా మంది ప్రజలు ఆశ్చర్యపోతుంటారు. నిజానికి, దీని వెనుక ఒక ప్రత్యేకమైన ప్రభుత్వ చొరవ ఉందని తెలిసింది. ఆ పూర్తి వివరాలేంటో ఇక్కడ చూద్దాం..

ఎడారిలో ఒయాసిస్‌ ఎప్పుడైనా చూశారా..?ఎక్కడో తెలిస్తే.. ఎగురుకుంటూ ఇప్పుడే వెళ్తారు..!
Namib Desert Surprise
Jyothi Gadda
|

Updated on: Nov 17, 2025 | 4:56 PM

Share

ఆఫ్రికాలోని నమీబ్ ఎడారి భూమిపై అత్యంత పురాతనమైనది. ఇక్కడ సూర్యుడు నిరంతరాయంగా మండిపోతూ ఉంటాడు. వేడి గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఎటు చూసినా అంతులేకుండా ఇసుక మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడి పరిసరాలు కూడా కొండలు, బండరాళ్లు, పాడుబడిన బంజరు భూమిని కలిగి ఉంటుంది. సమీపంలో కూడా ఎక్కడా జీవం ఉన్నట్లు కనిపించడం లేదు. కానీ ఈ ఎడారిలో ప్రయాణికులను ఆశ్చర్యపరిచే ఒక ప్రదేశం ఉంది. ఎడారి మధ్యలో రోడ్డు పక్కన, మీరు ఒక మెటల్ టేబుల్, రెండు చిన్న కుర్చీలు, మధ్యలో మెరుస్తూ ఒక గులాబీ రంగు రిఫ్రిజిరేటర్‌ కనిపించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.

నమీబియా ప్రభుత్వ పర్యాటక బోర్డు ఈ ప్రత్యేకమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. ఇది ఇప్పుడు దేశంలోని అత్యంత ప్రసిద్ధ ఆకర్షణలలో ఒకటిగా మారింది. నమీబియాలో ఉన్న నమీబ్ ఎడారి అట్లాంటిక్ మహాసముద్రం వెంబడి 80,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది 55 మిలియన్ సంవత్సరాల పురాతనమైనది. ఇది ఏటా 2 అంగుళాల వర్షపాతం మాత్రమే పొందుతుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చు. రాత్రిపూట అది సున్నాకి పడిపోవచ్చు. ప్రయాణికులు సాలిటైర్ టౌన్ సమీపంలోని నార్త్-సౌత్ రోడ్ (C34) ద్వారా ప్రయాణించవచ్చు. ఈ రూట్ ఆఫ్-రోడ్ ట్రాక్‌కు 20 నిమిషాల డ్రైవ్ దూరంలో ఉంటుంది.. ఇది అధికారికం కాదు..కానీ GPS, స్థానిక గైడ్‌లు దీని గురించి వివరిస్తారు. ఈ ప్రాంతం రాతి కొండలతో చుట్టుముట్టబడి ఉంటుంది. కానీ ఇసుక దిబ్బల మధ్య, మీరు గులాబీ రంగు ఫ్రిజ్‌ను చూస్తారు.

ఈ ఫ్రిజ్ ఎలా పనిచేస్తుంది అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది. బార్బీ పింక్ రంగులో ఈ ఫ్రిజ్ ఉంటుంది. ఇది సౌరశక్తితో నడుస్తుంది. దీని ప్యానెల్లు పైన అమర్చబడి ఉంటాయి. కూర్చోవడానికి టేబుళ్లు, కుర్చీలు ఉన్నాయి. కానీ నీడ లేదు. ఈ ఆలోచన నమీబియా టూరిజం బోర్డు నుండి వచ్చింది. ఎడారిలో ప్రయాణికులు అలసిపోయి దాహం వేసినప్పుడు పూర్వం రోజుల్లో ఇక్కడ ఒక ఒయాసిస్ ఉండేదట. కానీ, ఇప్పుడు దాని ఆధునిక వెర్షన్ ఫ్రిజ్ ఒయాసిస్‌గా మారింది. దీనిని 2010లో ఏర్పాటు చేశారు. స్థానిక సిబ్బంది దీనిని ప్రతిరోజూ చెక్‌ చేస్తారు. లోపల నిండుగా ఉండే వాటర్‌ బాటిల్స్‌, కోకా-కోలా, స్ప్రైట్, అక్కడి లోకల్‌ జ్యూస్‌లతో ఫ్రిజ్‌ ను నిండుగా ఉంచుతారు. అవన్నీ చల్లగా ఉంటాయి. అలాగే, ఈ ఫ్రిజ్‌ ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. అన్నింటికంటే బెటర్‌ ఏంటంటే…ఇది పూర్తిగా ఫ్రీ సర్వీస్‌. అవును, ఇది ఉచిత సేవ. ఫ్రిజ్ దగ్గర ఒక డొనేషన్ బాక్స్ ఉంటుంది. కానీ, ఇది కూడా పూర్తిగా ఇక్కడకు వచ్చే పర్యాటకుల ఇష్టానుసారం మాత్రమే విరాళంగా ఇవ్వొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..