బాబోయ్ బంగాళదుంపలు అతిగా తిన్నారంటే అంతే సంగతి..! ఆస్పత్రిలో బెడ్ పక్కా..!!
బంగాళాదుంపలను చాలా మంది ఇష్టంగా తింటారు. కానీ, ఆలూ అతిగా తినడం వల్ల సైడ్‌ఎఫెక్ట్స్ కూడా చాలా తీవ్రంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ b6 వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. కానీ, వీటిని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

బంగాళదుంపలను ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ ఏర్పడి తీవ్రంగా ఇబ్బంది పడతారు. బంగాళదుంపలను అధికంగా తీసుకోవడం వల్ల పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది. బంగాళదుంపలను వేయించి తినడం, చిప్స్ తినడం ఏ మాత్రం మంచిది కాదు. ఇవి అధిక రక్తపోటుకు కారణం అవుతాయి. ఆలూని అతిగా తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
బంగాళదుంపలలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచుగా తినడం వల్ల బరువు పెరుగుతారు. ముఖ్యంగా వేయించిన, చీజ్ ఇతర పదార్థాలతో కలిపి తినటం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారు కూడా ఆలుగడ్డలకు దూరంగా ఉండడం ఉత్తమం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
డయాబెటిస్, బిపి వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు బంగాళదుంపలు పూర్తిగా తినకుండా ఉంటేనే మంచిది. బంగాళదుంపలు ఎక్కువగా తింటే ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు వేధిస్తాయని చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారు బంగాళాదుంపలు తినకుండా ఉంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
బంగాళదుంపల్లో ఉండే అధిక కార్బోహైడ్రేట్ల కారణంగా చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు బంగాళదుంపలను తినకుండా ఉంటేనే మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








