AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బార్లీ నీళ్లు తాగితే బంపర్‌ బెనిఫిట్స్.. ! తెలిస్తే ఇప్పుడే మొదలుపెట్టేస్తారు..

చాలామంది ఉదయాన్నేటీ, కాఫీ వంటివి తాగుతూ ఉంటారు. మరికొందరు గ్రీన్ టీ, లెమన్‌ టీ వంటివి తీసుకుంటారు. కొంతమంది కొన్ని రకాల జ్యూస్‌లను తాగుతారు. నిజానికి కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా గ్రీన్ టీ తో పాటు బార్లీ వాటర్ తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉదయాన్నే బార్లీ వాటర్‌ తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బార్లీ నీళ్లు తాగితే బంపర్‌ బెనిఫిట్స్.. ! తెలిస్తే ఇప్పుడే మొదలుపెట్టేస్తారు..
Barley Water
Jyothi Gadda
|

Updated on: Nov 16, 2025 | 8:53 PM

Share

ఆరోగ్యకరమైన జీవనశైలికి మీరు తీసుకునే ఆహారం,మీ దినచర్యలో చిన్న చిన్న మార్పులు చాలా అవసరం. అలాంటి ఒక పద్ధతి ఉదయం ఖాళీ కడుపుతో బార్లీ వాటర్ తాగడం. బార్లీ అనేది పోషకమైన ధాన్యం. దీనిని పురాతన కాలం నుండి దాని ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. బార్లీ నీరు శరీరాన్ని డీటాక్సిఫై చేయడమే కాకుండా అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. 30 రోజుల పాటు ఉదయం ఖాళీ కడుపుతో బార్లీ నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు.

సాధారణంగా కొలెస్ట్రాల్ సమస్యల కారణంగా చాలామంది ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొలెస్ట్రాల్ విపరీతంగా పెరగడం కారణంగా ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. ఈ సమస్యలు రాకుండా ఉండడానికి బార్లీ వాటర్ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. రోజు ఉదయాన్నే బార్లీ వాటర్ తాగితే అందులో లభించే బీటా-గ్లూకాన్ ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించేందుకు సహాయపడుతుంది. బార్లీ నీరు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, గట్ బ్యాక్టీరియా సమతుల్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇంకా, బార్లీ నీరు మూత్రపిండాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. నిర్విషీకరణ ఏజెంట్‌గా పనిచేస్తుంది.

ముఖ్యంగా రోజు ఉదయం 30 రోజులపాటు బార్లీ వాటర్ తాగితే.. కొలెస్ట్రాల్ పరిమాణాలు ఎంతో సులభంగా తగ్గిపోతాయి. ఇలా బార్లీ వాటర్ రోజు తాగితే గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం వ్యాధిగ్రస్తులు రోజు ఉదయం లేచిన వెంటనే బార్లీ వాటర్ తప్పకుండా తాగాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్