AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మృత్యువులా దూసుకొచ్చిన కారు.. గాల్లోకి ఎగిరిన యువకులు.. అయినా ఆపకుండా..

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన కారు స్కూటర్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటన సిసిటివిలో రికార్డ్ అయి వైరల్ కావడంతో డ్రైవర్‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రంగంలోకి దిగి.. కారు కోసం గాలిస్తున్నారు. వీడియో చూడండి..

Viral Video: మృత్యువులా దూసుకొచ్చిన కారు.. గాల్లోకి ఎగిరిన యువకులు.. అయినా ఆపకుండా..
Jhansi Road Accident
Krishna S
|

Updated on: Nov 17, 2025 | 3:48 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన ఓ కారు స్కూటర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ షాకింగ్ ప్రమాదం నవాబాద్ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సిసిటివి ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కారు డ్రైవర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నవాబాద్ ప్రాంతంలోని అటవీ శాఖ కార్యాలయం సమీపంలో గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై ప్రధాన రహదారిపై వెళుతుండగా, వారి వైపు వేగంగా దూసుకొచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. కారు ఢీకొట్టడంతో స్కూటర్ గాల్లోకి ఎగిరిపోయింది. స్కూటర్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎగిరి దూరంలో పడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ వ్యవహరించిన తీరు చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. బాధితులు రోడ్డుపై విలవిలలాడుతున్నప్పటికీ, డ్రైవర్ కనీసం వేగాన్ని తగ్గించకుండా అలాగే వెళ్లిపోయాడు. స్థానికులు గాయపడ్డ యువకులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యలు తెలిపారు. నిర్లక్ష్యంగా కారు నడిపిన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నవాబాద్ పోలీసులు ఈ సంఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని ఆధారంగా డ్రైవర్‌ను గుర్తించే పనిలో ఉన్నారు. నిందితుడిని వదిలిపెట్టేది లేదని.. తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్