Garuda Puranam: జీవితంలో సక్సెస్ అవ్వాలంటే వీటిని అస్సలు పట్టించుకోవద్దు.. అవేంటంటే..
Garuda Puranam: హిందూమత గ్రంథాలలో ఒకటైన గరుడ పురాణంలో జననం, మరణం, జీవితం, కర్మ, స్వర్గం, నరకం సహా అనేక అంశాలకు సంబంధించి వివరాలు పేర్కొన్నారు. గరుడ పురాణంలో మొత్తం 271 అధ్యాయాలు, 18 వేల శ్లోకాలు ఉన్నాయి. రెండు భాగాలుగా ఉన్న ఈ గరుడ పురాణంలో..

Garuda Puranam: హిందూమత గ్రంథాలలో ఒకటైన గరుడ పురాణంలో జననం, మరణం, జీవితం, కర్మ, స్వర్గం, నరకం సహా అనేక అంశాలకు సంబంధించి వివరాలు పేర్కొన్నారు. గరుడ పురాణంలో మొత్తం 271 అధ్యాయాలు, 18 వేల శ్లోకాలు ఉన్నాయి. రెండు భాగాలుగా ఉన్న ఈ గరుడ పురాణంలో మొదటి భాగాన్ని పూర్వఖండం అని, రెండవ భాగాన్ని ఉత్తరాఖండం అని అంటారు. మొదటి భాగంలో శ్రీవిష్ణువు.. గరుడకు పూజా నియమాలు, పద్ధతుల గురించి వివరిస్తారు. రెండవ భాగంలో జీవితానికి సంబంధించిన అనేక వివరాలను ప్రస్తావిస్తారు. సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి, విజయం సాధించడానికి.. గరుడ పురాణంలో అనేక రహస్య విషయాలు చెప్పడం జరిగింది. ఇందులో వ్యక్తి విజయపథంలో సాగే ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకుల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. మీరు మీ లక్ష్యాన్ని చేరాలనుకుంటే, సక్సెస్ సాధించాలంటే.. కొన్ని అంశాలకు దూరంగా ఉండాలని గరుడ పురాణం చెబుతోంది. మరి ఆ అంశాలేంటో ఇప్పుడు మనం తెులసుకుందాం..
విజయం కోసం వీటిని త్యజించాలి..
కోపం: కోపం, ఆక్రోశం నయం చేయలేని వ్యాధి అంటారు. ఒక వ్యక్తి కోపం కారణంగా మంచి సంబంధాలు, సంతోషకరమైన కుటుంబం సైతం నాశనం అవుతుంది. అందుకే వీలైనంత వరకు కోపాన్ని నియంత్రించుకోవాలి. ముఖ్యంగా జీవితం విజయంవైపు అడుగులు పడుతున్నప్పుడు.. కోపాన్ని తప్పక కంట్రోల్ చేసుకోవాలి. ప్రశాంతంగా ఉన్నవారు మాత్రమే జీవితంలో విజయాన్ని సాధిస్తారు.
సోమరితనం: బద్ధకం ఒక వ్యక్తి విజయంలో అతిపెద్ద అడ్డంకి. ఇది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. జీవితంలో పురోగతి సాధించాలంటే ముందుగా సోమరితనాన్ని వదిలేయాలి. అప్పుడే మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు.




చింత: దేని గురించీ అతిగా ఆలోచించడం మంచిది కాదు. కొన్ని అంశాల గురించి ఆలోచించొచ్చు కానీ, చింతించకూడదు. ఆందోళన, ఒత్తిడి వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తాయి. నిత్య చింతనతో ఉండేవారు.. తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ముఖ్యంగా చిన్న చిన్న విషయాలకే బాధపడేవారు.. తమ లక్ష్యంపై దృష్టి పెట్టలేరు. అందుకే, ఏ అంశం గురించి కూడా ఎక్కువగా ఆలోచించొద్దని, ఆవేదన చెందొద్దని గరుడ పురాణం చెబుతోంది.
గమనిక: ఇందులో పేర్కొన్న అంశాలు మతగ్రంథమైన గరుడపురాణం ప్రకారం ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..