Viral Video: సింహాల గుంపును ఉరికించిన దున్నపోతు… బిడ్డను కాపాడుకోవడం కోసం సాహసం
బిడ్డ ప్రాణం మీదికి వస్తే ఏ తల్లైనా చూస్తూ ఊరుకోదు . శత్రువులన్నీ ఏకమై దాడికి ప్రయత్నించినప్పటికీ ఎంతో ధైర్యంతో ఎదుర్కొని బిడ్డ ప్రాణాలు కాపాడుకుంటుంది. అదే చేసింది ఓ దున్నపోతు. కెన్యా దేశం మసై మారా అడవిలో ఓ దున్నపోతు పక్కనే ఉన్న దూడపై దాడి చేసేందుకు దాదాపు ఏడు సింహాలు...

బిడ్డ ప్రాణం మీదికి వస్తే ఏ తల్లైనా చూస్తూ ఊరుకోదు . శత్రువులన్నీ ఏకమై దాడికి ప్రయత్నించినప్పటికీ ఎంతో ధైర్యంతో ఎదుర్కొని బిడ్డ ప్రాణాలు కాపాడుకుంటుంది. అదే చేసింది ఓ దున్నపోతు. కెన్యా దేశం మసై మారా అడవిలో ఓ దున్నపోతు పక్కనే ఉన్న దూడపై దాడి చేసేందుకు దాదాపు ఏడు సింహాలు చుట్టుముట్టాయి. ఆగ్రహించిన తల్లి దున్నపోతు మొదట దాడికి యత్నించిన ఓ సింహాన్ని తన కొమ్ములతో ఎత్తేసింది. మరో సింహాన్ని కూడా తన కొమ్ములతో కుమ్మేసింది. దీంతో మిగితా సింహాలు జడుసుకున్నట్లే కనిపించాయి. పక్కకు వెళ్లినట్లే వెళ్లి మరోసారి దూడపై దాడికి యత్నించాయి. వాటిని తరిమి తరిమి అలసిపోయింది తల్లి దున్నపోతు.
అంతలో సింహాలు వెనకడుగేసాయి. ముందుకెళితే ప్రాణాలు దక్కుతాయో లేదోనని భయపడ్డాయి. కారణం తల్లి దున్నపోతుకు సహాయంగా మరికొన్ని దున్నపోతులు రావడమే. నాలుగైదు దున్నపోతులు దాడి చేయడంతో అక్కడి సింహాలు ఏమి చేయలేకపోయాయి. దూడను వదిలి బతుకు జీవుడా అంటూ అక్కడ్నుంచి పరారయ్యాయి. ఈ దృశ్యాలను ఓ ఫొటోగ్రాఫర్ ఎంతో సాహసోపేతంగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది.
వీడియో చూడండి:
View this post on Instagram