Fire Accident: కదులుతున్న కారులో మంటలు.. అందులో ప్రయాణికులు ఏం చేశారంటే.. వీడియో వైరల్!
Fire Accident: ఈ రోజుల్లో వాహనాల్లో మంటలు చెలరేగుతున్నాయి. ముందు ఎండా కాలం. ఈ సీజన్‌లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. వారు వెంటనే కారులోంచి బయటకు దూకి తమ ప్రాణాలను రక్షించుకున్నారు. ఈ ఘటన ఆగ్రా ఇన్నర్ రింగ్ రోడ్‌లోని..

ఈ రోజుల్లో వాహనాల్లో మంటలు చెలరేగుతున్నాయి. ముందు ఎండా కాలం. ఈ సీజన్‌లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎండా వేడి కారణంగా ఇంజిన్‌లో మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో నడుస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగుతుండగా, వారు వెంటనే కారులోంచి బయటకు దూకి తమ ప్రాణాలను రక్షించుకున్నారు. ఈ ఘటన ఆగ్రా ఇన్నర్ రింగ్ రోడ్‌లోని రమదా హోటల్ సమీపంలో చోటు చేసుకుంది. కారు మంటల్లో చిక్కుకుపోయింది.
आगरा में चलती कार में शॉर्ट शर्किट से लगी आग, कार सवार लोगों ने कूद कर बचाई जान, आगरा इनर रिंग रोड रमाडा होटल के पास की घटना। pic.twitter.com/ngxgcKITg8
— Ajit Singh Rathi (@AjitSinghRathi) April 14, 2025
అయితే ముందుగా ప్రమాదం చోటు చేసుకోగానే దట్టమైన నల్లటి పొగలతో మంటలు చెలరేగగానే అందులో ఉన్న ప్రయాణికులు బయటకు దూకి పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి