నోరు విరిచి.. గోళ్లు తొలగించి.. అత్యంత దారుణంగా ఎలుగుబంటిని హతమార్చిన దుండగులు!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యత్నారం అటవీ ప్రాంతంలో జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అడవుల్లో ఉచ్చులు అమర్చారు. ఆ ఉచ్చులో ఎలుగుబంటి చిక్కుకుంది. ఆ మూగజీవిని హతమార్చిన వేటగాళ్లు అత్యంత దారుణంగా ముక్కలుగా నరికారు. కాళ్లు నరికి గోర్లు ఎత్తుకు పోయారు. ముక్కలుగా నరికి కొంత మాంసం తీసుకెళ్లారు.

వన్యప్రాణుల సంరక్షణ కోసం ఎన్ని చర్యలు చేపడుతున్నా.. ఆ మూగజీవుల వేట మాత్రం ఆగడంలేదు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వేటగాళ్లు అమర్చిన ఉచ్చుల్లో చిక్కుకుని ఎలుగుబంటి మృతి చెందింది. ఆ ఎలుగుబంటిని ముక్కలుగా నరికి గోర్లు, ఇతర అవయవాలు ఎత్తుకుపోయారు దుర్మార్గులు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది వేటగాళ్ల కోసం గాలిస్తున్నారు.
ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యత్నారం అటవీ ప్రాంతంలో జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అడవుల్లో ఉచ్చులు అమర్చారు. ఆ ఉచ్చులో ఎలుగుబంటి చిక్కుకుంది. ఆ మూగజీవిని హతమార్చిన వేటగాళ్లు అత్యంత దారుణంగా ముక్కలుగా నరికారు. కాళ్లు నరికి గోర్లు ఎత్తుకు పోయారు. ముక్కలుగా నరికి కొంత మాంసం తీసుకెళ్లారు. ఈ మార్గంలో విధులు నిర్వహిస్తున్న అటవీశాఖ బీట్ ఆఫీసర్లు చూసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ఎలుగుబంటిని హతమార్చిన స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు. పరిసర గ్రామాల్లోని వేటగాళ్ల కోసం ప్రత్యేక బృందాలను రంగాల్లో దింపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..