AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ మహా నగరవాసులకు గుడ్‌న్యూస్.. కాలుష్య రహితమే లక్ష్యం.. తెలంగాణ సర్కార్ కొత్త ప్లాన్..!

హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకునేందుకు ఇటీవల గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్ మహా నగరవాసులకు గుడ్‌న్యూస్.. కాలుష్య రహితమే లక్ష్యం.. తెలంగాణ సర్కార్ కొత్త ప్లాన్..!
Cm Revanth Reddy Plans To Make Greater Hyderabad Pollution Free
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Dec 31, 2025 | 10:18 AM

Share

హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకునేందుకు ఇటీవల గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి (CURE) ఏరియాను ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే క్యూర్( CURE) పరిధిలోని సిటీని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించామని, పరిపాలనను పట్టాలెక్కించాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. కోర్ అర్బన్ రీజియన్‌ను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని, హైదరాబాద్ నగరంలో అత్యంత సంక్లిష్టమైన చెత్త నిర్వహణ సమస్యను సమర్థవంతంగా అధిగమించాలని ముఖ్యమంత్రి సూచించారు. సిటీలో కాలుష్య నియంత్రణకు అవసరమైన పూర్తిస్థాయి ప్రక్షాళన తీసుకుంటున్నామని, సిటీలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించామన్నారు.

హైదరాబాద్ మహానగరం పరిధిలోని చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడుకోవాలని సూచించారు. క్యూర్ పరిధిలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఈవీ బస్సులు, ఆటోలను తీసుకురావాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఈ సందర్భంగా కొత్త జోనల్ కమిషనర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. జోనల్ కమిషనర్లు ప్రతీ రోజు ఫీల్డ్ లో ఉండాల్సిందేనని, జోన్ల వారీగా సంబంధిత సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత జోనల్ కమిషనర్లదేనని స్పష్టం చేశారు. చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. నెలకు మూడు రోజులు శానిటేషన్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించడా, రోడ్లపై గుంతలు కనిపించకుండా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించాలన్నారు.

గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్‌కు..

కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలను అందించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. జనన మరణ ధ్రువీకరణ, ట్రేడ్ లైసెన్సులు, ఇతర ధ్రువ పత్రాల జారీకి టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆన్‌లైన్ టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని తెలిపారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, అపార్ట్ మెంట్ అసోసియేషన్ లతో కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోవాలని తెలిపారు. సుపరిపాలనతో పాటు స్మార్ట్ గవర్నెన్స్ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలు నాలాల పూడికతీత పనులు జనవరి నుంచి మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. క్యూర్ ఏరియాలో విభాగాల అధికారులను బాధ్యత స్పెషల్ సీఎస్ సమన్వయం చేసుకుంటారని తెలిపారు. దోమల నివారణ, అంటువ్యాధులు ప్రబలకుండా జోనల్ కమిషనర్ చర్యలు చేపట్టాలని, ప్రతీ పది రోజులకోసారి గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించాలని జోనల్ కమిషనర్లకు సీఎం సూచించారు.

ప్రతీ నెలకు ఒకసారి స్వయంగా సమీక్ష

కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించుకుండా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. క్యూర్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు అందుబాటులో ఉన్న స్థలాన్ని కేటాయించి భవనాలు నిర్మించాలన్నారు. అద్దె భవనాల నుంచి సొంత భవనాలకు కార్యాలయాలను తరలించాలని అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలోని 12 జోన్లలో చెరువులు, కుంటలు, నాలాలను పూర్తిగా మ్యాపింగ్ చేయాలని సూచించారు. ఆక్రమణలను తొలగించి వర్షాకాలంలో వరదలతో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద చెరువులను గుర్తించి వాటిని పునరుద్దరించి యాక్టివిటీ జోన్స్‌గా అభివృద్ధి చేయాలని సూచించారు.

జనవరి నుంచి ప్రతీ ఒక్కరూ ఫీల్డ్ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే నగరం భవిష్యత్ మారుతుందన్నారు. ప్రతీ నెలకు ఒకసారి జోనల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రెటరీ మాణిక్ రాజ్, జీహెచ్ఎంసీ కర్ణన్, హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండీ అశోక్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎఫ్ సీ డీఏ కమిషనర్ శశాంక, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జోనల్ కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..