Garuda Puranam: ఇలాంటి వ్యక్తులతో పొరపాటున కూడా భోజనం చేయవద్దు.. పాప కర్మగా పరిగనింపబడుతోంది.

మనిషి అలవాట్లు మంచి చెడుల గురించి ప్రస్తావించింది గరుడ పురాణం. ఈ రోజు గరుడ పురాణంలో ఆహారం తినే విషయంలో కొన్ని నియమాలు ఉన్నట్లు పేర్కొంది. కొన్ని ప్రాంతల్లో, కొందరి వ్యక్తులతో కలిసి ఆహరం తినడం నిషేధం అని.. ఈ చర్య అత్యంత పాపమని చెప్పింది. పొరపాటున కూడా ఈ ఇళ్ళల్లో తినే ఆహారం వారి పాపంలో పాలుపంచుకోవడమే. గరుడ పురాణం ప్రకారం ఏ ఏ వ్యక్తుల ఇంట ఆహారాన్ని తినకూడదో వివరంగా తెలుసుకుందాం.

Garuda Puranam: ఇలాంటి వ్యక్తులతో పొరపాటున కూడా భోజనం చేయవద్దు.. పాప కర్మగా పరిగనింపబడుతోంది.
Garuda Puranam
Follow us
Surya Kala

|

Updated on: May 29, 2024 | 8:14 AM

హిందూ మతంలో గరుడ పురాణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది జీవి జనన, మరణం, పునర్జన్మల వరకు ప్రతిదీ వివరంగా వివరిస్తుంది. హిందూ సనాతన ధర్మంలో 18 పురాణాలలో ఒకటైన గరుడ పురాణం చాలా ముఖ్యమైన పురాణాలలో ఒకటి. శ్రీ మహా విష్ణువు ఈ పురాణానికి అధినేత. గరుడ పురాణంలో ఒక వ్యక్తికి జీవితంలో ఏది సరైనది.. ఏది నిషేధించబడిందో వివరంగా వివరించబడింది. మనిషి అలవాట్లు మంచి చెడుల గురించి ప్రస్తావించింది గరుడ పురాణం. ఈ రోజు గరుడ పురాణంలో ఆహారం తినే విషయంలో కొన్ని నియమాలు ఉన్నట్లు పేర్కొంది. కొన్ని ప్రాంతల్లో, కొందరి వ్యక్తులతో కలిసి ఆహరం తినడం నిషేధం అని.. ఈ చర్య అత్యంత పాపమని చెప్పింది. పొరపాటున కూడా ఈ ఇళ్ళల్లో తినే ఆహారం వారి పాపంలో పాలుపంచుకోవడమే. గరుడ పురాణం ప్రకారం ఏ ఏ వ్యక్తుల ఇంట ఆహారాన్ని తినకూడదో వివరంగా తెలుసుకుందాం.

గరుడ పురాణం ప్రకారం ఎవరైనా నేరస్థుడు అని తేలితే.. అతని ఇంట్లో అతనితో కలిసి భోజనం చేయడం ఎప్పుడైనా తప్పే అని పేర్కొంది. ఇలా ఆహారం కలిసి తినడం వలన వారి పాపాన్ని పంచుకున్నట్లు అని వెల్లడించింది. వాస్తవానికి గరుడ పురాణం ప్రకారం ఈ వ్యక్తులతో ఆహారం తినడం శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంతే కాదు ఆ వ్యక్తి చేసిన పాపంలో కూడా భాగస్వామి కావాల్సి ఉంటుంది. దీనితో పాటు జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా మొదలవుతాయి.

దేవుణ్ణి దూషించే వారితో భోజనం చేయవద్దు

ఇవి కూడా చదవండి

గరుడ పురాణం ప్రకారం దేవుడిని విమర్శించే వారితో పొరపాటున కూడా భోజనం చేయకూడదు. అంతే కాదు అలాంటి వారితో కూర్చోవడం కూడా పాప కర్మ అని.. ఇది అష్టకష్టలను కలిగిస్తూ నానా ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుందని పేర్కొంది. గరుడ పురాణం ప్రకారం దేవుడిని విమర్శించే వారు మంచివారు కాదు. అలాంటి వారితో సంబంధాలు కొనసాగించడం తప్పు. ఈ వ్యక్తులు స్వభావరీత్యా మతోన్మాదులని చెబుతారు. అలాంటి వారి ఇంట్లో భోజనం చేయడం మహాపాపం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు