AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Richest Ganesha: దేశంలోనే రిచెస్ట్ గణేష.. 66కిలోల గోల్డ్, 295 కిలోల వెండి నగల అలంకారం.. భీమా ఎన్ని కోట్లకు చేయించారో తెలుసా..

అత్యంత ధనవంతుడైన గణపతి బప్పాను ప్రతి రోజూ 2 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా. 40 వేల మందికి పైగా భక్తులు భోజనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు  ఆలయంలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో కూడిన ఆధునిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిని భక్తులు, ఆలయ భద్రత కోసం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  మండపంలో వినాయకుడి విగ్రహానికి ఈ ఏడాది రూ.360.40 కోట్లకు బీమా చేశారు.

Richest Ganesha: దేశంలోనే రిచెస్ట్ గణేష.. 66కిలోల గోల్డ్, 295 కిలోల వెండి నగల అలంకారం.. భీమా ఎన్ని కోట్లకు చేయించారో తెలుసా..
Richest Ganesh
Surya Kala
|

Updated on: Sep 19, 2023 | 10:34 AM

Share

దేశ విదేశాల్లో ఉన్న హిందువులు వినాయక చవితి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటుంన్నారు. అనేక మండపాల్లో వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ముంబైలో  GSB సేవా మండల్‌లోని ‘మహాగణపతి’ విగ్రహం దేశంలోనే అత్యంత సంపన్న విగ్రహంగా ప్రసిద్ధిచెందింది. ఇక్కడ మండపంలో ఏర్పాటు చేసే వినాయక విగ్రహం అలంకరణతో ఎల్లప్పుడూ దేశంలోనే చర్చనీయాంశంగా నిలుస్తుంది. ఈ సంవత్సరం 66.5 కిలోగ్రాముల బంగారు ఆభరణాలు, 295 కిలోగ్రాముల వెండితో అలంకరించిన వినాయక విగ్రహం శోభాయమానంగా వెలిగిపోతుంది. అలంకారం కోసం ఉపయోగించిన ఇతర వస్తువులు కూడా చాలా విలువైనవి.

ముంబై నగరంలోని తూర్పు ప్రాంతంలోని కింగ్స్ సర్కిల్ వద్ద మండలం 69వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన వినాయకుడు బంగారం, వెండి నగలతో వెలిగిపోతుండడంతో  జిఎస్‌బి సేవా మండల్ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇందులో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుల ప్రతినిధి తెలిపారు.

అంతేకాదు దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేశారు. అంతేకాదు డిజిటల్‌ లైవ్‌ మెకానిజమ్‌లను ఈ ఏడాది  నిర్వాహకులు ప్రవేశపెట్టారు. అంతేకాదు ఇక్కడ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయి.. ప్రారంభోత్సవం సక్సెస్ ఫుల్ గా జరిగేలా హవనం నిర్వహించనున్నట్లు అధికార ప్రతినిధి తెలిపారు.

ఇవి కూడా చదవండి

అత్యంత ధనవంతుడైన గణపతి బప్పాను ప్రతి రోజూ 2 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా. 40 వేల మందికి పైగా భక్తులు భోజనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు  ఆలయంలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో కూడిన ఆధునిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిని భక్తులు, ఆలయ భద్రత కోసం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

మండపంలో వినాయకుడి విగ్రహానికి ఈ ఏడాది రూ.360.40 కోట్లకు బీమా చేశారు. ఈ బీమా ప్లాన్‌లో రూ. 38.47 కోట్ల విలువైన ఆల్-రిస్క్ కవరేజీ ఉంది. ఇది బంగారం, వెండి వస్తువులకు సంబంధించిన వివిధ రకాల రిస్క్‌లను కవర్ చేస్తుంది. రూ. 30 కోట్ల పబ్లిక్ లయబిలిటీ కవరేజీ పండల్, ఆరాధకుల భద్రతకు హామీ ఇస్తుంది. అయితే రూ. 2 కోట్ల అదనపు ప్రత్యేక రిస్క్ కవరేజీ సాధారణ అగ్ని, భూకంప ప్రమాదాలను కవర్ చేస్తుంది. భీమాలో అత్యధిక మొత్తంలో రూ. 289.50 కోట్లు.. మండపంలో కష్టపడి పనిచేసే కార్మికులకు,  వాలంటీర్లకు వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ కోసం కేటాయించబడింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..