Ganesh Chaturthi 2022: వినాయక చవితి ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పూలు, పండ్ల ధరలు..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Aug 30, 2022 | 5:42 PM

Ganesh Chaturthi 2022: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన గణేశ్‌ పండగ సందడి మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్ పూలమార్కెట్లు, పండ్ల మార్కెట్లలో సందడి..

Ganesh Chaturthi 2022: వినాయక చవితి ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పూలు, పండ్ల ధరలు..
Ganesh Chaturthi

Ganesh Chaturthi 2022: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన గణేశ్‌ పండగ సందడి మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్ పూలమార్కెట్లు, పండ్ల మార్కెట్లలో సందడి నెలకొంది. పూజా సామాగ్రి కొనుగోళ్లలో జనం బిజీబిజీ అయ్యారు. అయితే, పండుగ వేళ అన్ని వస్తువుల రేట్లు భారీగా పెరిగిపోయాయి. పూల రేట్లు, పూజాసామాగ్రి ధరలు భారీగా పెరిగాయి. డిమాండ్‌కు సరిపడా మార్కెట్‌లో పూలు లేకపోవడం వల్లే ధరలు పెరిగియాని అంటున్నారు వ్యాపారులు.

సాధారణంగానే పండగలు వచ్చాయంటే చాలు.. పూలు, పండ్లకు డిమాండ్‌ అమాంతం పెరిగిపోతోంది. డిమాండ్‌కు తగ్గట్టే ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయ్‌. ఇప్పుడు జనమంతా ఘనంగా జరుపుకొనే గణేషుడి పండగ వచ్చేసింది. పండ్లు, పూలు లేకుండా వినాయక పూజ చేయడం అసాధ్యం. అందుకే, ఈ ఫెస్టివల్‌కు పండ్లు, పూలకు డిమాండ్ మామూలుగా ఉండదు. గణనాయకుడికి పూజలంటే.. కనుల విందుగా ఉండాల్సిందే. అందుకే ఈ ఆది దేవుడి పండుగ సమ్‌థింగ్‌ స్పెషల్‌. అందుకే.. పూలూ పండ్లే కాదు.. పూజాసామాగ్రి కూడా ప్రత్యేకమే. ఇక డెకరేషన్‌ విషయంలో.. పోటాపోటీగా ఉంటారు మండపాల నిర్వహాకులు. నగర వ్యాప్తంగా పూలు, పండ్లు, పూజా సామాగ్రి, డెకరేషన్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. అంతే స్థాయిలో ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఏది ముట్టుకున్నా జేబులకు చిల్లు పడేలా ఉంది పరిస్థితి.

ఇదిలాఉంటే.. వినాయక చవితికి కొన్ని రోజుల ముందు నుంచే సిటీలో రోడ్డుకిరువైపులా భారీ గణేషుల నుంచి చిన్నచిన్న గణపయ్యల దాకా విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. విగ్రహాల అమ్మకానికి వ్యాపారులు సిద్ధంగా ఉంచారు. అయితే, చిన్న విగ్రహాల ధరలే వందలు, వేలల్లో ఉన్నాయి. ఇక పెద్ద పెద్ద విగ్రహాల ధరలు అయితే చెప్పనలవిగాని పరిస్థితి ఉంది. ఇక్కడ మరో శుభపరిణామం ఏంటంటే.. ఈ ఏడాది జనాల్లో మట్టి విగ్రహాల పట్ల కాస్త అవగాహన వచ్చినట్లు కనిపిస్తోంది. మట్టి విగ్రహాలు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే, మట్టి విగ్రహాలకు పీఓపీ విగ్రహాల కంటే రేట్లు అధికంగా ఉండటంతో కొనుగోలుదారులు కాస్త పునరాలోచనలో పడుతున్నారు. ====== సాయి ప్రియ ఎపిసోడ్ ను సీరియస్‌గా తీసుకున్నారు విశాఖ పోలీసులు. నేవీ, కోస్ట్ గార్డ్, పోలీస్ సిబ్బందిని ముప్పతిప్పలు పెట్టి.. అధికారుల విలువైన టైం, ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడంపై యాక్షన్ షురూ చేశారు. సాయిప్రియ, ఆమె ప్రియుడు రవితేజపై నిన్న కేసు నమోదు చేశారు విశాఖ త్రీటౌన్ పోలీసులు. ఇవాళ ఆమె తండ్రి అప్పలరాజుపై కూడా కేసు నమోదు చేసినట్లు చెప్పారు విశాఖ త్రీటౌన్ సీఐ రామారావు.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ ఉద్యోగి అయిన సాయి ప్రియ తండ్రి అప్పలరాజు ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడంపై సీరియస్ అయ్యారు పోలీసులు. కోర్టు అనుమతితో అప్పలరాజుపై 182 ఐపిసి సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు త్రిటౌన్ పోలీసులు. సాయి ప్రియ ప్రియుడి రవితేజతో వెళ్లిపోతున్నట్లు తండ్రికి ముందు తెలిసిందని సాయిప్రియ భర్త పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఘటనపై విచారించిన పోలీసులు కోర్టు అనుమతితో యాక్షన్ షూరు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu