AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Friday Puja Tips: లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుక్రవారం రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు..

లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు కనుక అమ్మవారి అనుగ్రహం కోసం శుక్రవారం రోజున ఉదయాన్నే నిద్రలేవాలి. ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేయాలి. అనంతరం అభ్యంగ స్నానం చేసి పూజా గదిని శుభ్రం చేయాలి. శుక్రవారం రోజున ఇంట్లో కుటుంబ సభ్యులతో వివాదాల జోలికి వెళ్ళవద్దు. గొడవలకు దూరంగా ఉండాలి. అందరితోనూ మంచితనంగా మెలగాలి. ప్రతి ఒక్కరినీ గౌరవించాలి. శుక్రవారం రోజున జుట్టుని కట్ చేసుకోవద్దు. గోర్లు కట్ చేయడం వంటి పనులకు దూరంగా ఉండాలి. 

Friday Puja Tips: లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుక్రవారం రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు..
Lakshmi Devi Puja Tips
Surya Kala
|

Updated on: May 03, 2024 | 6:55 AM

Share

శ్రీ మహా విష్ణువు అర్ధాంగి సంపదలకు అధిదేవత లక్ష్మీదేవి శుక్రవారం అంకితం చేయబడింది. అందుకనే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం రోజున చేసే పనుల విషయంలో నియమ నిబంధనలు పెట్టారు. అంతేకాదు చేసే పనులు కూడా ఎంతో పవిత్రంగా ఉండాలని సూచించారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు కనుక అమ్మవారి అనుగ్రహం కోసం శుక్రవారం రోజున ఉదయాన్నే నిద్రలేవాలి. ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేయాలి. అనంతరం అభ్యంగ స్నానం చేసి పూజా గదిని శుభ్రం చేయాలి.

శుక్రవారం రోజున ఇంట్లో కుటుంబ సభ్యులతో వివాదాల జోలికి వెళ్ళవద్దు. గొడవలకు దూరంగా ఉండాలి. అందరితోనూ మంచితనంగా మెలగాలి. ప్రతి ఒక్కరినీ గౌరవించాలి.

శుక్రవారం రోజున జుట్టుని కట్ చేసుకోవద్దు. గోర్లు కట్ చేయడం వంటి పనులకు దూరంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

శుక్రవారం రోజున ఇంట్లోని డబ్బులు, ఉప్పును అప్పుగా లేదా దానంగా కూడా ఇవ్వొద్దు. జీవనంలో అనేక సమస్యలు వస్తాయి.

వంట గదిలో ఉప్పు, బెల్లం వంటి పదార్ధాలకు లోటు లేకుండా చూసుకోవాలి. అంతేకాదు వీటిని శుక్రవారం రోజున వీటిని ఇంటికి తీసుకుని రావాలి. ఇలా చేస్తే ఇంట్లో ఎన్నడూ డబ్బులకు లోటు ఉండదు.

శుక్రవారం రోజున ఇంటి ఇల్లాలి మనసును నొప్పించే విధంగా మాట్లాడవద్దు. కంట కన్నీరు పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.

అంతేకాదు ఇంటి కోడలిని ఊరుకి గానీ లేదా మరొక చోటకు పంపకూడదు. ఎందుకంటే కోడలు ఇంటికి లక్ష్మీదేవి స్వరూపం అని నమ్మకం. కనుక శుక్రవారం రోజున ఇంటి కోడలిని ఉసురుపెట్టవద్దు.

శుక్రవారం రోజున లక్ష్మీదేవి ని పూజిస్తూ.. అష్టలక్ష్మీ వ్రతం చేసేవారి ఇంట ఎల్లప్పుడూ ధనధాన్యాలకు, సుఖ సంపదలకు లోటు ఉండదని, అఖండ ధనయోగం ఉంటుందని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు