AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Niyam: పొరపాటున కూడా దీపాన్ని ఇలా వెలిగించకండి.. చేసిన పూజ ఫలితం దక్కదు

ఇంట్లో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్‌ ఎనర్జీ తరిమికొట్టొచ్చని, వాస్తు దోషాలను సైతం దీపం దూరం చేస్తుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీపం వెలిగించడం వల్ల ఎన్నో రకాలుగా లాభం జరుగుతుంది. అయితే దీపం వెలిగించే సమయంలో కచ్చితంగా కొన్ని రకాల నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలా కాకుండా నియమాలను పాటించకుండా దీపాన్ని వెలిగిస్తే...

Pooja Niyam: పొరపాటున కూడా దీపాన్ని ఇలా వెలిగించకండి.. చేసిన పూజ ఫలితం దక్కదు
Deepam
Narender Vaitla
|

Updated on: Sep 17, 2023 | 3:19 PM

Share

హిందూ మతంలో దేవుళ్లను పూజించడంలో ఎన్ని విధానాలు అందుబాటులో ఉన్నా దీపం వెలిగించడం మాత్రం సాధారణం. దేవలయాలు మొదలు ఇంట్లో ప్రతీరోజు రెండుసార్లు దీపాన్ని వెలిగిస్తున్నారు. ధూపం, దీపం లేకుండా ఏ పూజ కూడా సంపూర్ణంగా ముగిసిందని చెప్పరు. ఇక హిందూ సంప్రదాయం శతాబ్దాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది.

ఇంట్లో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్‌ ఎనర్జీ తరిమికొట్టొచ్చని, వాస్తు దోషాలను సైతం దీపం దూరం చేస్తుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీపం వెలిగించడం వల్ల ఎన్నో రకాలుగా లాభం జరుగుతుంది. అయితే దీపం వెలిగించే సమయంలో కచ్చితంగా కొన్ని రకాల నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలా కాకుండా నియమాలను పాటించకుండా దీపాన్ని వెలిగిస్తే మంచి కంటే చెడు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఇంతకీ దీపం వెలిగించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఎలాంటి నియమాలు పాటించాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నెయ్యి లేదా నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. ఒక్కో దేవతార్చనకు ఒక్కో విధంగా దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. ఒకవేళ నెయ్యి దీపాన్ని వెలిగిస్తే దీపం మీ ఎడమ చేతి వైపు ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ నూనె దీపం వెలిగిస్తే మీ కుడి చేతి వైపు ఉండేలా చూసుకోవాలి. దీపాన్ని దేవునికి దూరంగా ఉంచకూడదు. దీపం మధ్యలో ఆరిపోకుండా తగినంత నూనె ఉండేలా చూసుకోవాలి.

కోరికలు నెరవేరాలని భగవంతుడిని ప్రార్థిస్తే నూనె దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే దుర్గమాత ముందు నెయ్యి దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని అంటున్నారు. శనిదేవుడిని ఆరాధించేందుకు ఆవనూనె లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిచాలి. ఏలిననాటి శని ప్రభావం ఉన్న వారు ఇలా చేస్తే సమస్యలు తగ్గుతాయి. శనివారం ఆవనూనె దీపం వెలిగించడం ద్వారా శని దోష ప్రభావం తగ్గుతుంది. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మల్లెపూ నూనెతో దీపాన్ని వెలిగించాలి.

ఒకవేళ జాతకంలో రాహు-కేతు దోషాలు ఉన్నట్లయితే అవిసె నూనెతో దీపం వెలిగించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయి.

నోట్‌: పైన తెలిపిన అంశాలు కేవలం హిందూ శాస్త్రాల్లో పేర్కొన్న కొన్ని అంశాల ఆధారంగా పేర్కొనడమైంది. ఈ అంశాల్లో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. వ్యక్తిగత నమ్మకాలపై ఇది ఆధారపడి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..