Valuble Word: జీవితంలో అత్యంత విలువైన మాట ఏమిటో తెలుసా.. దీనికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

ధన్యవాదాలు లేదా థాంక్స్ అనే మాట ఎంతో అద్భుతమైనది, అపురూపమైనది అని చెప్పాల్సి ఉంటుంది. ఈ ఒక్క మాట ఎంతటి శత్రువులోనైనా, ఎ టువంటి ప్రత్యర్థిలోనైనా ఒక సెకనులో మంచి పరివర్తన తీసుకొస్తుంది. ఈ మాట అమృతం కన్నా..

Valuble Word: జీవితంలో అత్యంత విలువైన మాట ఏమిటో తెలుసా.. దీనికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
Thankyou (representative Image)
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Amarnadh Daneti

Updated on: Jan 05, 2023 | 7:00 AM

Valuble Word: ధన్యవాదాలు లేదా థాంక్స్ అనే మాట ఎంతో అద్భుతమైనది, అపురూపమైనది అని చెప్పాల్సి ఉంటుంది. ఈ ఒక్క మాట ఎంతటి శత్రువులోనైనా, ఎ టువంటి ప్రత్యర్థిలోనైనా ఒక సెకనులో మంచి పరివర్తన తీసుకొస్తుంది. ఈ మాట అమృతం కన్నా రుచికరమైన మాట. థాంక్స్ చెప్పడం కంటే అత్యుత్తమ సంస్కారవంతమైన విషయం మరొకటి ఈ భూమి మీద ఉండదని ప్రసిద్ధ ఆంగ్ల రచయిత ఆస్కార్ వైల్డ్ అంటూ ఉండేవారు. ఎవరికైనా ఏదైనా మంచి జరుగుతే, దేవుడికి థాంక్స్ చెప్పావా అని తప్పనిసరిగా అడిగేవారు పరమహంస యోగానంద. లౌకిక వ్యవహారాల్లో అయినా, ఆధ్యాత్మిక విషయాల్లో అయినా థాంక్స్ అనే మాటకి తిరుగులేని విలువ ఉంది. ఈ విషయంలో ఏ మనిషి ఏ చిన్న సహాయం చేసినా థాంక్స్ చెప్పడం అనేది చాలా మంచి అలవాటు.  మన జీవితంలో మనం ఆశించకుండానే, కోరకుండానే అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలా జరిగినప్పుడు తప్పనిసరిగా మనసులోనైనా దేవుడికి వెంటనే ధన్యవాదాలు తెలియజేయాలి అని పరమహంస యోగానంద తన దగ్గరకు వచ్చే వారికి మరీ మరీ చెబుతుంటారు. అలా ధన్యవాదాలు తెలియజేస్తే దేవుడు మనకు సహాయం కొనసాగిస్తూనే ఉంటాడని, ధన్యవాదాలు తెలియజేసినందుకు ఎంతో ఆనందిస్తాడని ఆయన చెప్పేవారు. దేవుడిని మనం ప్రార్థన రూపంలో ఏదైనా కోరినా, కోరకపోయినా మంచి జరిగినప్పుడు వెంటనే పూజా మందిరంలోకి వెళ్లి దేవుడికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పాలని ఆయన సూచించేవారు. “ఇది మొక్కుబడి చెల్లించడం కంటే ఎక్కువ” అని ఆయన అంటుంటారు. “మనం దేవుడిని సహాయం కోరుతాం. ఏదో ఒక కోరిక కోరుతూనే ఉంటాం. ఏదో ఒక విధంగా దేవుడు మన ప్రార్థనను మన్నిస్తూ ఉంటాడు. అది వ్యక్తి రూపంలో కావచ్చు. ఆలోచన రూపంలో కావచ్చు. రూపంలో కావచ్చు. చివరికి ఒక మాట రూపంలో కూడా కావచ్చు. మన కోరిక తీరిన వెంటనే దేవుడికి ధన్యవాదాలు తెలియజేయడం మన ప్రధాన కర్తవ్యం” అని ఆయన ‘డివైన్ రొమాన్స్’ అనే తన గ్రంథంలో తెలియజేశారు.

ఒక్క ఆధ్యాత్మిక వ్యవహారాల్లోనే కాదు, ప్రాపంచిక వ్యవహారాల్లో కూడా ఎవరైనా, ఈ రూపంలో నైనా మనకు సహాయం చేసినప్పుడు వెంటనే ధన్యవాదాలు తెలియజేయడం మంచి సంస్కారం అవుతుంది. ఇది మానవ సంబంధాలను మరింత సన్నిహితం చేస్తుంది. ఒకరి మీద ఒకరికి అభిమానాన్ని పెంచుతుంది. మనసులోని కఠినత్వాన్ని తగ్గిస్తుంది. ధన్యవాదాలు తెలియజేయడాన్ని పొరపాటున కూడా వాయిదా వేయవద్దని, వెను వెంటనే చెప్పేయడం మంచిదని ఒక సందర్భంలో కంచి పరమాచార్య కూడా బోధించారు. “ధన్యవాదాలకు, కృతజ్ఞతలకు ఉన్న విలువ అమూల్యమైనది. దీనివల్ల ఒ న గూడే ప్రయోజనాన్ని అంచనా వేయలేం” అని ఆయన చెప్పేవారు. అటు ప్రాపంచిక వ్యవహారాలు కైనా, ఇటు ఆధ్యాత్మిక వ్యవహారాలకైనా ధన్యవాదాలు అనే మాట ఒక పటిష్టమైన వారధి లాంటిదని ఆస్కార్ వైల్డ్ చెబుతుండేవారు.

ఎయిర్ కమాడోర్ విశాల్ ఒక జె ట్ పైలట్. ఒక వైమానిక పోరాటంలో ఆయన ఉన్న యుద్ధ విమానాన్ని శత్రువులు కూల్ చేయడం జరిగింది. చివరి క్షణంలో ఆయన ఒక పారాచూట్ సహాయంతో విమానం నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇది జరిగిన కొంతకాలం తర్వాత ఆయన తన భార్యతో కలిసి ఒక రెస్టారెంట్ కు వెళ్లారు. అక్కడ భోజనం చేస్తుండగా ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి, “మీరు పైలెట్ విశాల్ గారే కదా?” అని పలకరించాడు. అవునన్నాడు విశాల్. “మీరు యుద్ధానికి వెళ్ళిన రోజున మీ ప్యారాచూట్ను ప్యాక్ చేసింది నేనే” అని అతను పరిచయం చేసుకున్నాడు. విశాల్ నిర్ధాంత పోయాడు. ఆ రోజున ప్యారాచూట్ తెరచుకోక పోయి ఉంటే తన పరిస్థితి ఏమై ఉండేది?

ఇవి కూడా చదవండి

నిజానికి ఆ సేఫ్టీ వర్కర్ విశాల్ కు రోజు కనిపిస్తూనే ఉంటాడు. అయితే ఆయన అతన్ని ఏనాడూ పలకరించిన పాపాన పోలేదు. గుడ్ మార్నింగ్ అని కూడా అనలేదు. ఎందుకంటే అతను ఒక మామూలు సేఫ్టీ వర్కర్. విశాల్ నిజంగా చాలా బాధపడ్డాడు. ఒకరి సహాయం మరొకరికి తప్పకుండా అవసరం అవుతుంది. ఎవరో ఒకరు సహాయం చేయనిదే ఈ జీవితంలో ముందుకు వెళ్ళటం జరిగే పని కాదు. ప్రతి విషయంలోనూ మనకు ఎవరిదో ఒకరిది సహాయం అవసరం అవుతూనే ఉంటుంది. మనం సురక్షితంగా మన గమ్యస్థానానికి చేరాలంటే ఎందరిదో చేయూత తప్పనిసరి అవుతుంది. మనకు సహాయం చేసిన వారిని గుర్తుంచుకొని వారికి ధన్యవాదాలు తెలియజేయడం చాలా ముఖ్యం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం చూడండి..

వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన