AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aquarius: కుంభరాశివారికి ఈ విషయాలు అస్సలు చెప్పొద్దు..! ఎందుకంటే..?

Aquarius People: కుంభరాశివారు స్వతంత్రులు చాలా ఆశావాదులు. ఏ విషయం గురించి అయినా ముందు వెనుక ఆలోచిస్తారు. అయినప్పటికీ కొన్నిసార్లు ఇతరులపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు.

Aquarius: కుంభరాశివారికి ఈ విషయాలు అస్సలు చెప్పొద్దు..! ఎందుకంటే..?
Aquarius
uppula Raju
|

Updated on: Nov 26, 2021 | 9:33 PM

Share

Aquarius People: కుంభరాశివారు స్వతంత్రులు చాలా ఆశావాదులు. ఏ విషయం గురించి అయినా ముందు వెనుక ఆలోచిస్తారు. అయినప్పటికీ కొన్నిసార్లు ఇతరులపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మీరు ఈ రాశికి చెందిన వారితో వ్యవహరిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితులలోను కొన్ని విషయాలను వారితో షేర్ చేసుకోకూడదు. ఆవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. హింసను ద్వేషిస్తారు కుంభ రాశి వారు హింసను ద్వేషిస్తారు. అతని మొదటి స్టెప్ శాంతియుత విధానం. మీరు హింసాత్మక వ్యక్తి అయితే ఈ రాశివారు మీకు అనుకూలంగా ఉండరు.

2. ఇవి చెప్పకూడదు కుంభ రాశి వారికి ఏమి చేయాలి లేదా ఏమి చేయకూడదు అని చెప్పకూడదు. వారు సృజనాత్మకత, స్వాతంత్ర్యానికి చాలా విలువ ఇస్తారు. వారి లోపాలను ఎత్తి చూపినట్లయితే వారు మళ్లీ మిమ్మల్ని కలవరు.

3. ఒంటరిగా ఎక్కువ సమయం గడపకండి కుంభ రాశి వారు కొంత సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఎందుకంటే రోజువారీ పని నుంచి విరామం తీసుకోవడానికి ఇష్టపడుతారు. ఈ విషయంపై వారిని ప్రశ్నించడం మంచిది కాదు.

4. లక్ష్యంపై నిర్ణయం ఈ రాశిచక్రం వారు తమ జీవితంలో ఏర్పరచుకున్న అనేక లక్ష్యాలపై ఫోకస్ చేస్తారు. అన్నింటిలో విజయం దగ్గరి వరకు వెళుతారు. చాలా సామర్థ్యులు కానీ ఎవ్వరి మాట వినరు. ఒక్కోసారి మూర్ఖంగా ప్రవర్తిస్తారు.

5. సామర్థ్యాన్ని ప్రశ్నించడం ప్రతి ఒక్కరికి వారి సొంత యోగ్యత గురించి బాగా తెలుసు. దీని కోసం ఒకరిని ప్రశ్నించడం లేదా అనుమానించడం తప్పు. కానీ కుంభరాశి వ్యక్తుల విషయంలో ఈ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎదుటివారి సామర్థ్యాలను చూసి అంచనా వేసి ప్రవర్తిస్తారు.

గమనిక- ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించండి.

క్యాచ్‌ మిస్సవ్వడంతో కోపంతో ఊగిపోయిన రవీంద్ర జడేజా.. అతడు వచ్చి మెడ పట్టుకున్నాడు.. గ్రౌండ్‌లో గొడవ..

Perfume: పెర్ఫ్యూమ్ ఎప్పుడూ చల్లగా ఉంటుంది..! ఎందుకో తెలుసా..?

దగ్గు, గొంతునొప్పి భరించలేకపోతున్నారా..! అయితే వీటి గురించి తెలుసుకోండి..