Diwali Puja: చీకటిలో వెలుగులు పంచే దీపావళి.. ఈరోజు లక్ష్మీ పూజా ముహర్తం.. విధానం, వ్రత నియమాలు

దీపావళి రోజు లక్ష్మీదేవిని విధిగా పూజించాలి. సంపద , శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. సాయంత్రం వేళలో పూజ ప్రారంభించాలి.

Diwali Puja: చీకటిలో వెలుగులు పంచే దీపావళి.. ఈరోజు లక్ష్మీ పూజా ముహర్తం.. విధానం, వ్రత నియమాలు
Diwali Lakshmi Puja
Follow us
Surya Kala

|

Updated on: Oct 24, 2022 | 1:42 PM

దీపావళి రోజు లక్ష్మీదేవిని విధిగా పూజించాలి. సంపద , శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. సాయంత్రం వేళలో పూజ ప్రారంభించాలి. దీపావళి ప్రతి పూజలోనూ వినాయకుడిని ఆరాధించడం సంప్రదాయం. లక్ష్మీదేవిని వినాయకుడిని కలిపి పూజిస్తారు. లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుడిని పూజిస్తారు.

లక్ష్మీ పూజకు తేదీ, సమయం, ముహూర్తం

సోమవారం సాయంత్రం 5.39 గంటలకు లక్ష్మీపూజ ప్రారంభం

ఇవి కూడా చదవండి

సాయంత్రం 6.51 గంటలకు లక్ష్మీపూజ ముగింపు

ప్రాణ ప్రతిష్ట చేసి.. కలశ స్థాపన చేస్తారు. శ్రీలక్ష్మీదేవ్యై నమః అంటూ దూప దీప నైవేద్యాలతో పూజిస్తారు. సంధ్యా సమయంలో ఆవు నెయ్యితో దీపాలను ఇంటి ముందు దీపాలను వెలిగిస్తారు.

లక్ష్మీదేవి ప్రాశస్యం:

త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు దేవేరి , భృగుమహర్షి కుమార్తె అయిన లక్ష్మీ దుర్వాసుని శాపంతో క్షీరసాగర మథనంలో ఉద్భవించింది. ఋగ్వేద కాలంలో అదితి, రాకా, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా ఆరాధించారు. అధర్వణ వేదం ‘సినీవాలి’ అనే దేవతను ‘విష్ణుపత్ని’గా నుతించింది. విష్ణువు శక్తికి, మాయకు కారణం లక్ష్మీ పక్కనుండటమే అంటారు. భూదేవి కూడా ఆమె మరో అంశమని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మీగా చెప్పబడింది. ఆమెను అష్ట భుజ మహాలక్ష్మిగా వర్ణించారు. జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్టాల నుంచి కాపాడి వారికి సిరిసంపదలను కలుగజేస్తుందని నమ్ముతారు.

లక్ష్మీ దేవి గురించి జననం గురించి పురాణాల్లోనూ, ఇతిహాసాలలోను అనేక గాధలున్నాయి.  శ్రీ మహా విష్ణువునకు సృష్టి మొదలు నుంచి లక్ష్మి తోడుగానే ఉన్నదని.. ఆమె నిత్యానపాయిని ఎన్నడూ విడివడనిది అని అర్థం. లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు.

పురాణాలు , ఇతిహాసాలలో లక్ష్మీ దేవి గురించి వివిధ రకాలుగా పేర్కొన్నారు. సృష్టి ఆరంభం నుంచే శ్రీమహావిష్ణువునకు లక్ష్మీదేవి తోడుగానే ఉందని , ‘నిత్యానపాయిని’ లక్ష్మీనారాయణులు వేరు వేరు కాదని కొందరు అంటారు. సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని జగన్మాత ప్రసాదించిందని దేవీ భాగవతంలో పేర్కొన్నారు.

లక్ష్మీదేవి ఓసారి విష్ణువు నుంచి వేరు కావడంతో ఆయన శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆదేశాలతో భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి ఆయనకు కుమార్తెగా జన్మించింది. అనంతరం విష్ణువుతో వివాహం చేశాడు. కాబట్టి లక్ష్మీదేవిని ‘భార్గవి’ అని కూడా పిలుస్తారు.

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. వరాహస్వామికి , భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. లోకకంటకుడైన నరకుడు విష్ణువు చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా భూదేవి వరం పొందుతుంది. నరకాసురుడు మరణించిన రోజు నరక చతుర్దశిగా .. లోకాల్లో రాక్షసుడి బాధలు తప్పినందుకు అమావాస్య రోజున  ప్రజలు దీపాలను వెలిగించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

(సేకరణ)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)