Diwali: ఆదివాసీ గూడాల్లో దండారి సంబురాలు.. కనుల పండువగా గోండ్‌ గూడాల గుస్సాడి నృత్యాలు

దీపావళి సందర్భంగా జరుపుకునే దండారి పండుగ ఆదివాసీలకు అత్యంత ప్రాధాన్యమైంది. ఆదిలాబాద్, ఉట్నూర్, ఇంద్రవెల్లి , నార్నూర్, జైనూర్ లో దండారి సంబురాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.

Diwali: ఆదివాసీ గూడాల్లో దండారి సంబురాలు.. కనుల పండువగా గోండ్‌ గూడాల గుస్సాడి నృత్యాలు
Gusadi Dance In Adilabad
Follow us
Surya Kala

|

Updated on: Oct 24, 2022 | 9:38 AM

దేశవ్యాప్తంగా దీపావళీ శోభ సంతరించుకుంది. ఆదివాసీ గూడాల్లో ఘనంగా కొనసాగుతోంది ఆదివాసీ దండారీ‌. దీపావళి పురస్కరించుకుని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయమే మొదలయ్యాయి దివాళి భోగి గుస్సాడి సంబురాలు. ఈ సందర్భంగా ఆదివాసీలు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివాసీల ఖిల్లా ఆదిలాబాద్‌లో దండారి సంబురాలు ఘనంగా సాగుతున్నాయి. గోండ్‌ గూడాలు గుస్సాడి నృత్యాలతో మారుమోగుతున్నాయి. గోండులకు ఆరాధ్యదైవమైన ఏత్మాసూర్‌ పద్మల్‌పురి కాకో ఆలయానికి గిరి భక్తజనం క్యూ కడుతోంది.

దీపావళి సందర్భంగా జరుపుకునే దండారి పండుగ ఆదివాసీలకు అత్యంత ప్రాధాన్యమైంది. ఆదిలాబాద్, ఉట్నూర్, ఇంద్రవెల్లి , నార్నూర్, జైనూర్ లో దండారి సంబురాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. దండారి పండుగ తమలో ఐక్యతను బలోపేతం చేస్తుందని ఆదివాసీ పెద్దలు చెప్తున్నారు. దీపావళి వేడుకల సందర్భంగా నిర్వహించే భోగి పూజలతో సంబరాలు ప్రారంభమై.. కొలబోడితో ముగుస్తాయి‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..