AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanteras 2025: ధన్‌తేరాస్‌ రోజున బంగారం, వెండి మాత్రమే కాదు.. ఈ వస్తువులు కొనడం కూడా శుభప్రదమే

ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలోని 13వ రోజు త్రయోదశిని ధనత్రయోదశి పండగగా జరుపుకుంటారు. దీనినే ధన్ తేరాస్ అని కూడా అంటారు. ఈ రోజు లక్ష్మీదేవి, కుబేరుల ఆశీస్సులు పొందే రోజుగా పరిగణించబడుతుంది. దీంతో ఈ రోజున షాపింగ్ చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. జ్యోతిష్యం , సంప్రదాయాల ప్రకారం.. ఈ రోజున బంగారం, వెండిని మాత్రమే కాదు కొన్ని ఇతర వస్తువులను కూడా కొనడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

Dhanteras 2025: ధన్‌తేరాస్‌ రోజున బంగారం, వెండి మాత్రమే కాదు.. ఈ వస్తువులు కొనడం కూడా శుభప్రదమే
Dhanteras 2025
Surya Kala
|

Updated on: Oct 03, 2025 | 2:33 PM

Share

దీపావళి పండుగ ధన్ తేరాస్ తో ప్రారంభమవుతుంది. ఈ రోజున షాపింగ్ కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పురాణాల నమ్మకాల ప్రకారం ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం (చీకటి పక్షం) పదమూడవ రోజున సముద్రం నుంచి ధన్వంతరి అమృత కలశంతో దర్శనమిచ్చాడు. అందుకే ఈ రోజున పాత్రలు , లోహ వస్తువులను కొనడం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ప్రజలు సాధారణంగా ఈ రోజున బంగారం, వెండిని కొనడం శుభప్రదంగా భావిస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న ధరల దృష్ట్యా మీరు బంగారం లేదా వెండిని కొనలేకపోతే.. బాధపడకండి. జ్యోతిష్యం.. మత విశ్వాసాల ప్రకారం ధన్ తేరాస్ రోజున కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడే కొన్ని ఇతర వస్తువులు ఉన్నాయి. అవి ఇంటికి ఆనందం, శ్రేయస్సును తెస్తాయి.

2025 లో ధన్‌తేరాస్ ఎప్పుడు వస్తుంది ?

దృక్ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం త్రయోదశి తిథి అక్టోబర్ 18, శనివారం మధ్యాహ్నం 12:18 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 19, ఆదివారం మధ్యాహ్నం 1:51 గంటలకు ముగుస్తుంది. హిందూ మతంలో ఉదయతిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. కనుక ఈ ఏడాది ధన త్రయోదశి పండగను అక్టోబర్ 18, 2025 శనివారం జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

ధన్‌తేరాస్‌లో బంగారం, వెండితో పాటు వీటిని కొనడం కూడా శుభప్రదమే!

పాత్రలు: ధన్‌తేరాస్ రోజున కొత్త పాత్రలు కొనడం ఒక పురాతన, ముఖ్యమైన సంప్రదాయం. ఈ రోజు ధన్వంతరి అమృత కుండతో దర్శనమిచ్చాడని నమ్మకం. కనుక ఈ రోజున పాత్రలు కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

ఇత్తడి: ఇత్తడిని ధన్వంతరి దేవుడి లోహంగా భావిస్తారు. ఇత్తడి పాత్రలు కొనడం వల్ల ఇంటికి ఆరోగ్యం, అదృష్టంటి పాటు 13 రెట్లు సంపద లభిస్తుందని నమ్ముతారు.

రాగి లేదా కాంస్య: ఈ లోహాలతో చేసిన పాత్రలను కొనడం కూడా శుభప్రదం.

చీపురు: ధన త్రయోదశి రోజున చీపురు కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. కొత్త చీపురు ఇంటిలోని పేదరికాన్ని తొలగిస్తుందని.. ఆనందం, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. ఈ రోజున చీపురును కొని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత.. దానిని ఉపయోగించే ముందు చీపురుని పూజించండి.

ధనియాలు: ఈ రోజున ధనియాలను కొని లక్ష్మీ దేవికి సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. ధనియాలను సంపదకు చిహ్నంగా భావిస్తారు. పూజ తర్వాత ఈ ధనియాలను డబ్బులను భద్రపరిచే స్థలంలో లేదా మీ డబ్బు నిల్వ చేసే ప్రదేశంలో ఉంచడం వల్ల శ్రేయస్సు కలుగుతుంది.

లక్ష్మీ-గణేష్ విగ్రహం: దీపావళి పూజ కోసం ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవి, గణేశుడి కొత్త విగ్రహాలను కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ విగ్రహాలను ధన త్రయోదశి రోజున ఇంటికి తీసుకువచ్చి దీపావళి రోజున ఆచారాలతో పూజించడం వల్ల సంపద, శ్రేయస్సు వస్తుంది. అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.

శ్రీ యంత్రం, కుబేర యంత్రం: బంగారం లేదా వెండి కొనలేకపోతే.. ఈ రోజున శ్రీయంత్రం లేదా కుబేర యంత్రం కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ యంత్రాలను ఇంట్లో లేదా దుకాణంలో ఉంచడం వల్ల సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి, సంపదకు దేవుడు అయిన కుబేరుడి ఆశీస్సులు లభిస్తాయి.

గోమతి చక్రం: గోమతి చక్రాలను చాలా పవిత్రమైనవి , అద్భుతంగా భావిస్తారు. ధన త్రయోదశి రోజున 11 గోమతి చక్రాలను కొనుగోలు చేసి, వాటిని ఎర్రటి గుడ్డలో చుట్టి మీ సేఫ్‌లో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది.

గవ్వలు: పసుపు గవ్వలకు లక్ష్మీదేవికి అవినావ భావ సంబంధం ఉందని నమ్ముతారు. ధన త్రయోదశి రోజున గవ్వలను కొనండి. ఈ పసుపు రంగు గవ్వలకు దీపావళి రోజు రాత్రి పూజ చేసి.. వాటిని సేఫ్‌లో ఉంచండి. ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులే ఉండవని.. డబ్బు నిరంతరం ప్రవహించేలా చేస్తుందని నమ్మకం.

కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి నల్లటి వస్తువులు: ధన్‌తేరాస్ నాడు నల్లటి వస్తువులు లేదా దుస్తులు కొనవద్దు. ఇది అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఇనుము: ఈ రోజున కత్తెర లేదా కత్తులు వంటి ఇనుముతో చేసిన పదునైన వస్తువులను కూడా కొనుగోలు చేయవద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..