Viral Video: ట్రైన్ ఢీకొని గాయపడిన ఏనుగు.. పట్టాల పక్కన నొప్పితో విలవిలా..
అనేక అటవీ ప్రాంతాల మధ్య నుంచి రైళ్లు ప్రయాణిస్తూ ఉంటాయి. ఇలాంటి ట్రాక్స్ మీద నుంచి జంతువులు వెళ్తుంటే.. అదే సమయంలో ఏదైనా హై స్పీడ్ ట్రైన్ వస్తే.. ఘోర ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏనుగుల గుంపు లేదా ఒకే ఏనుగు ప్రయాణిస్తున్నప్పుడు.. హైస్పీడ్ రైళ్లు తగిలి తరచుగా ప్రమాదాలకు కారణమవుతాయి. ప్రస్తుతం ఒక వీడియో ఏనుగుకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అది చూడడానికి హృదయ విదారకంగా ఉంది.

అడవిలో నివసించే జంతువుల జీవితాలు ఎల్లప్పుడూ సవాళ్లతో నిండి ఉంటాయి. అవి అడవిలో ఉంటే… అవి ఇతర జంతువులకు ఆహారంగా మారతాయని భయపడతాయి. అవి అనుకోకుండా మానవ నివాసాలలోకి వెళితే.. దారుణమైన ఇబ్బందుల్లో పడతాయి. ప్రస్తుతం మానవ అవసరాల కోసం అడవిని వేగంగా నిర్మూలన చేస్తున్నారు. దీంతో అడవి జంతువులు మానవ నివాసాలలోకి అడుగు పెడుతున్నాయి. దీంతో వాటి జీవితాలను మరింత ప్రమాదంలో పడిపోతున్నాయి. తాజాగా ఏనుగు వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇది దిగ్భ్రాంతి కలిగించడమే కాదు తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తుంది. ఈ వీడియోలో, ఒక పెద్ద ఏనుగు రైలు ప్రమాదంలో చిక్కుకున్న తర్వాత పట్టాల పక్కన నొప్పితో కొట్టుమిట్టాడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ దృశ్యం పూర్తిగా హృదయ విదారకంగా ఉంది.
ఏనుగులు రైళ్లను ఢీకొన్న సంఘటనలు తరచుగా జరుగుతాయి. కొన్నిసార్లు అవి తీవ్రంగా గాయపడతాయి. కొన్నిసార్లు అవి అక్కడికక్కడే చనిపోతాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో రైలును ఢీకొన్న తర్వాత ఏనుగు బాధతో విలవిలలాడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ వీడియోలో ఏనుగు తీవ్ర గాయాలతో బాధపడుతోంది. అయినా సరే ట్రైన్ ట్రాక్ మీద నుంచి లేచి వెళ్లడానికి ప్రయత్నించింది. కానీ అడుగు ముందుకు వెయ్యలేక దాని ప్రయత్నం విఫలమై.. పట్టాలపై కూలిపోయింది. ఏనుగు నిస్సహాయ స్థితిలో తీవ్రంగా బాధపడుతోంది. దీనిని చూసిన ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి.
ఈ వీడియో చాలా బాధాకరం..
ఈ హృదయ విదారక వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్)లో @Jimmyy__02 అనే యూజర్ షేర్ చేశారు. “మానవులు భూమిని మార్చారు, యంత్రాలను తీసుకువచ్చారు. ఏనుగులు వాటిని మార్చలేకపోయాయి. ఇప్పుడు ఆ పరిణామాలను అనుభవిస్తున్నది అవే” అనే క్యాప్షన్‌తో.
ఈ 32 సెకన్ల వీడియోను వేలాది మందని వీక్షించారు. వందలాది మంది దీనిని లైక్ చేసి వివిధ రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మనం వాటిని రక్షించడానికి ఎల్లప్పుడూ కృషి చేయాలని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు ఈ మూగ జంతువులు మన కారణంగా బాధపడుతున్నాయి. చూడడానికి చాలా బాధాకరంగా ఉంది. ఇది చాలా విషాదకరమైన సంఘటనగా అభివర్ణించారు. మనం ప్రకృతిని మరియు జంతువులను జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు.
వీడియోను ఇక్కడ చూడండి
मानव ने ज़मीन बदली मशीनें ले आया… हाथी बदल न सके और अब वही इसकी सज़ा भुगत रहे हैं। pic.twitter.com/YrhJeLyPZN
— JIMMY (@Jimmyy__02) October 2, 2025
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




