భారతీయ సినిమాలపై మనసు పడుతున్న రష్యన్లు.. 24 గంటలూ మన సినిమాలు ప్రసారం చేసేందుకు ఏకంగా ఓ చానల్ కూడా..
భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల రష్యన్లకు రోజు రోజుకీ అమితాసక్తి పెరుగుతోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న సాంస్కృతిక వారధిని ప్రతిబింబిస్తున్నాయి. సోవియట్ కాలం నుంచి భారతీయ చిత్రాలకు ఆ దేశంలో ప్రజాదరణ ఉంది. భారతీయ సినిమాలపై రష్యన్లు అమితమైన ఆసక్తిని చూపిస్తున్నారని.. అందుకనే రోజంతా ఇండియాన్ సినిమాలను ప్రసారం చేసే స్పెషల్ టీవీ చానల్ కూడా తమ దేశంలో ఉందని చెప్పారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత దేశం పట్ల తన ప్రేమని మరోసారి చాటుకున్నారు. నల్ల సముద్రంలోని రిసార్ట్ నగరం సోచిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పుతిన్ భారతీయ సినిమాలంటే తనకు చాలా అభిమానం అని చెబుతూ.. రష్యాలో ఇండియన్ మూవీస్ కు ఉన్న ప్రజాదరణ గురించి చెప్పారు. మేము భారతీయ సినిమాలను ప్రేమిస్తున్నాము” అని పుతిన్ అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు రాజకీయాలకు, దౌత్యానికి మించి విస్తరించాయని.. సాంస్కృతిక, మానవతా సంబంధాలతో ముడిపడ్డాయని.. రష్యాలో అనేక మంది భారతీయులు చదువుకుంటున్నారని చెప్పారు. అంతేకాదు భారతదేశం కాకుండా, భారతీయ సినిమాలను24 ప్రసారం చేస్తున్న దేశం రష్యా అని.. ఇలా భారతీయ సినిమాలు రాత్రి, పగలు ప్రసారం చేసేందుకు ఒక స్పెషల్ టెలివిజన్ ఛానల్ ఉన్న ఏకైక దేశం రష్యా అని చెప్పారు.
బాలీవుడ్ సినిమాలకు రష్యాలో ప్రజాదరణ
పుతిన్ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న సాంస్కృతిక వంతెనను ప్రతిబింబిస్తున్నాయి. సోవియట్ కాలం నాటి నుంచి భారతీయ చిత్రాలకు ప్రజాదరణ ఉంది. రాజ్ కపూర్, మిథున్ చక్రవర్తి వంటి తారలు పేర్లు ఇప్పటికీ ప్రతి రష్యన్ ఇంట్లో వినిపిస్తాయి. 1982లో మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన డిస్కో డ్యాన్సర్ సినిమా సోవియట్ యునియన్ కాలంలో రష్యాలో రిలీజైంది. బ్లాక్‌బస్టర్ గా నిలిచి అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. రాజ్ కపూర్ 1951 చిత్రం ఆవారా కూడా ఆదేశంలో రిలీజైంది. విదేశాలలో 100 మిలియన్లకు పైగా టిక్కెట్లు అమ్ముడైన రెండు భారతీయ చిత్రాలలో అవారా ఒకటి.
❗️Putin: ‘We Love Indian Cinema’ – 🇷🇺 President Reveals How Popular 🇮🇳 Films Are In Russia pic.twitter.com/GSFPS454h8
— RT_India (@RT_India_news) October 2, 2025
భారతీయ సినిమా పట్ల పుతిన్ గత అభిమానం
గతంలో కూడా పుతిన్ భారతీయ చిత్రాల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తూ.. ప్రశంసలను వ్యక్తం చేశారు. 2024లో బ్రిక్స్ సమ్మిట్ కు ముందు జరిగిన మీడియా సమావేశంలో బాలీవుడ్‌ను ప్రశంసించాడు, భారతీయ సినిమాను రష్యాలో అత్యంత ప్రజాదరణ పొందినదిగా పేర్కొన్నాడు. భారతీయ సంస్కృతి, ముఖ్యంగా సినిమాలపై రష్యన్లు విపరీతమైన ఆసక్తి కనబరుస్తారని అన్నారు.
రష్యాలో సినిమాలు చిత్రీకరించడానికి బ్రిక్స్ దేశాలకు మాస్కో ప్రోత్సాహకాలను అందిస్తుందా అని అడిగినప్పుడు.. పుతిన్ భారతదేశం బలమైన సాంస్కృతిక ప్రభావం గురించి చెప్పారు. “బ్రిక్స్ సభ్య దేశాలను పరిశీలిస్తే,.. ఆ దేశాల్లో భారతీయ సినిమాలు అత్యంత ప్రజాదరణ పొందుతాయని నేను భావిస్తున్నానని చెప్పారు. రష్యాలో ఒక ప్రత్యేక టీవీ ఛానల్ ఉంది. అందులో భారతీయ సినిమాలు 24/7 ప్రసారం అవుతాయి. భారతీయ చిత్రాలపై మాకు చాలా ఆసక్తి ఉంది,” అని ఆయన ఆ సమయంలో అన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి ఇప్పటికే బాగా స్థిరపడిందని.. దీనికి సినిమాలు ఒక ప్రధాన వేదిక అని పేర్కొన్నారు పుతిన్. భారత చలనచిత్ర పరిశ్రమకు తాము మరింత సహకారం అందిస్తామని అప్పుడే బహిరంగంగా చెప్పారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








