AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yama Deepam: దీపావళికి ముందు యమ దీపాన్ని ఎప్పుడు? ఏ దిశలో పెట్టాలి? యమ దీపం విశిష్టత ఏమిటంటే

దసరా పండగ అయిపొయింది.. మరికొన్ని రోజుల్లో దీపావళి పండగ రానుంది. ఈ దీపావళి పండగను కొన్ని ప్రాంతాల వారు ఐదు రోజులు జరుపుకుంటారు. ఈ పండగలో భాగంగా మొదటి రోజుని ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం త్రయోదశి రోజున యమ దీపం వెలిగిస్తారు. ఇలా చేయడం వలన యముడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. ఈ ఏడాది ఎప్పుడు యమ దీపం వెలిగించాలి? నియమాలు తెలుసుకుందాం..

Yama Deepam: దీపావళికి ముందు యమ దీపాన్ని ఎప్పుడు? ఏ దిశలో పెట్టాలి? యమ దీపం విశిష్టత ఏమిటంటే
Yama Deepam
Surya Kala
|

Updated on: Oct 03, 2025 | 3:26 PM

Share

ఐదు రోజుల దీపావళి పండుగలో మొదటి రోజున ధన త్రయోదశి గా జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసంలోని చీకటి పక్షంలో అంటే కృష్ణ పక్షంలోని పదమూడవ రోజున యమ దీపం వెలిగిస్తారు. మరణానికి అధిపతి అయిన యమ ధర్మ రాజు పేరుతో దీపం వెలిగించడం వల్ల యముడి ఆశీస్సులు లభించి ఆరోగ్యం గా ఉంటారని చెబుతారు. ఈ రోజు యమ దీపం ఎప్పుడు వెలిగించాలి? నియమాలు ఏమిటి తెలుసుకుందాం..

ధన త్రయోదశి తిథి ఎప్పుడంటే హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష (చీకటి పక్షం) త్రయోదశి తిథి అక్టోబర్ 18న మధ్యాహ్నం 12:18 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 19న మధ్యాహ్నం 1:51 గంటలకు ముగుస్తుంది. నమ్మకం ప్రకారం.. అక్టోబర్ 18వ తేదీ శనివారం ధన త్రయోదశిని జరుపుకుంటారు.

యమ దీపం వెలిగించడానికి సరైన తేదీ ఏది?  హిందూ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 18వ తేదీ శనివారం 2025.. అంటే ఆశ్వయుజ మాసం కృష్ణ పక్ష త్రయోదశి తిథి నాడు యమ దీపం వెలిగిస్తారు.

దీపం వెలిగించడానికి దిశ యమ దీపాన్ని ఎల్లప్పుడూ దక్షిణం వైపు చూస్తూ వెలిగించాలి. దక్షిణ దిశను యమ ధర్మరాజు దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల యముడు సంతోషిస్తాడు. అన్ని భయాల నుంచి ఉపశమనం కలిగిస్తాడు.

యమ దీపం వెలిగించడానికి నియమాలు

  1. యమ దీపం నాలుగు వైపులా ఉండాలి.. నాలుగు వత్తులతో వెలిగించాలి.
  2. యమ దీపం వెలిగించేందుకు నువ్వుల నూనె లేదా ఆవ నూనెను ఉపయోగించాలి.
  3. దీపం వెలిగించిన తర్వాత.. దానిని ఇంటి బయట దక్షిణం వైపు పెట్టాలి
  4. దీపం వెలిగించేటప్పుడు కుటుంబ సభ్యులందరూ దీర్ఘాయుష్షుతో జీవించాలని..అన్ని కష్టాల నుంచి విముక్తి పొందాలని ప్రార్థించాలి.
  5. యమ దీపాన్ని ఇంటి బయట దక్షిణ దిశలో పెట్టాలి
  6. ఈ దీపాన్ని దానం చేయడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు ఉంటాయని, అకాల మరణ భయం ఉండదని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.