Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toli Ekadasi 2021: హిందువుల మొదటి పండగ.. తొలి ఏకాదశి.. ఈ రోజున పాటించాల్సిన పూజ నియమాలను తెలుసుకుందాం

Devshayani Ekadashi 2021: హిందూ క్యాలెండర్ లోని నాలగవ నెలను ఆషాడ మాసం అంటారు. ఈ మాసంపూజాదికార్యక్రమాలకు ప్రసిద్ధి. ఈ నెలలో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశిగా ...

Toli Ekadasi 2021: హిందువుల మొదటి పండగ.. తొలి ఏకాదశి.. ఈ రోజున పాటించాల్సిన పూజ నియమాలను తెలుసుకుందాం
Toli Ekadashi
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 19, 2021 | 9:36 PM

Devshayani Ekadashi 2021: హిందూ క్యాలెండర్ లోని నాలగవ నెలను ఆషాడ మాసం అంటారు. ఈ మాసంపూజాదికార్యక్రమాలకు ప్రసిద్ధి. ఈ నెలలో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశిగా .. ఆషాఢ శుద్ధ ఏకాదశిగా హిందువులు జరుపుకుంటారు. ఈ ఏకాదశిని “శయన ఏకాదశి , ప్రధమ ఏకాదశి”, “హరివాసరం” అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు శేషపాన్పు పై శయనిస్తాడని అందుకనే ఈ ఏకాదశిని “శయన ఏకాదశి” అంటారని పురాణాల కథనం. తొలి ఏకాదశ నుంచి సూర్యుడు ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా కొంతమంది ప్రారంభిస్తారు. తొలి ఏకాదశిని చేసేవారు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

*ఏకాదశిని చేసేవారు పండ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్, కంద మూలాలు, సగ్గు బియ్యం, సామల తో చేసిన వంటలు తినవచ్చు. *ఏకాదశి ఉపవాసం చేసేవారు ధాన్యాలు, పప్పులు, శనగలు, మొక్క జొన్న, గోకరకాయ, చిక్కుడుకాయ, బఠాణిలను ఆహారపదార్ధాలుగా తీసుకోకూడదు. *ఏకాదశి రోజున తులసి ఆకులను తెంపకూడదు. *ఏకాదశి రోజున శ్రవణం, కీర్తనం, హరి నామ స్మరణం ఎక్కువ చేయాలి. . *ఈరోజున కృష్ణుడిని పూజిస్తే శుభఫలితాలు పొందుతారు. *ఏకాదశి రోజు కృష్ణుడు పూజించాలి అనుకునేవారు ముందు రోజు తులసి దళాన్ని సిద్ధం చేసుకుని ఏకాదశి రోజున కృష్ణుడిని ధూపం, దీపం, తులసి పత్రాలతో పూజిస్తే శుభఫలితాలు సొంతమవుతాయి.

హరే కృష్ణ హరే కృష్ణ | కృష్ణ కృష్ణ హరే హరే || హరే రామ హరే రామ| రామ రామ హరే హరే || అనే ఈ మహా మంత్రాన్నిఎన్ని సార్లు జపిస్తే అంత మంచిది.

ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి , శుచిగా స్నానమాచరించి , శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు , కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి. ముఖ్యంగా ఏకాదశి రోజున పూజ చేసినా చెయ్యకపోయినా మాంసము, చేపలు, గుడ్లు, పుట్ట గొడుగులు, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి, మత్తుపదార్ధాలకు దూరంగా ఉండడం మంచిది. ఏకాదశిని చేసిన వారు మర్నాడు ద్వాదశి రోజు ఉదయమే స్నానం చేసి, విష్ణు మూర్తికి పూజ చేసి ఉపవాస నియమాన్ని విడిచి పెట్టాలి.

Also Read: Maa Deori Temple: ధోని ఇష్టంగా దర్శించే ఈ అమ్మవారిని కొలిస్తే.. ఆర్థిక సమస్యలు తీరడమే కాదు.. విజయం సొంతం చేసుకుంటారట.. (photo gallery)