Maa Deori Temple: ధోని ఇష్టంగా దర్శించే ఈ అమ్మవారిని కొలిస్తే.. ఆర్థిక సమస్యలు తీరడమే కాదు.. విజయం సొంతం చేసుకుంటారట..

Maa Deori Temple: మన దేశంలో అనేక ఆలయాలు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారాలుగా విలసిల్లే దేవతలు. ఆలాంటి అమ్మవారు దేవోరి మాత.. ఈ ఆలయం ఝార్ఖండ్ లో ఉంది. రాంచీ టాటా హైవే పై ఉన్న ఈ ఆలయంలో దుర్గామాతను కొలుస్తారు. సుమారు 700 ఏళ్ల చరిత్రకల్గిన ఈ అమ్మవారి ఆలయాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ ధోని తరచుగా దర్శించుకుని అమ్మవారి ఆశీర్వాదం కూడా తీసుకుంటాడు..

TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 19, 2021 | 9:02 PM

దేవోరి ఆలయంలోని అమ్మవారి విగ్రహం ఎంతో ప్రత్యేకమైంది. ఇక్కడ అమ్మవారు దుర్గామాతగా పూజలను అందుకుంటున్నారు. విగ్రహం  మూడున్నర అడుగుల ఎత్తుండి 16 చేతులతో దర్శనమిస్తుంది. అంతేకాదు ఈ విగ్రహం ఒడిశా నిర్మాణ శైలిని గుర్తు చేస్తుంది.

1 / 6
దేవోరి ఆలయం క్రీ.శ 1300 సంవత్సరంలో నిర్మించినట్లు తెలుస్తోంది. సింహభూమికి చెందిన ముండా రాజు కేరా ఓ యుద్ధంలో ఓడిపోయి తిరిగి వస్తున్న సమయంలో ఇక్కడ ఆలయం నిర్మించినట్లు స్థానికుల కథనం. ఇక్కడ అమ్మవారిని ప్రతిష్టించిన అనంతరం కేరా రాజు తిరిగి తన రాజ్యాన్ని దక్కించుకున్నాడని కథనం

2 / 6
అమ్మవారియూ ఆలయంలో పూజ విధానం అన్ని దేవాలయ కంటే భిన్నంగా ఉంటుంది. ఝార్ఖండ్ లో గిరిజన సంస్కృతి సంప్రదాయాలు అనుసరిస్తూ పూజలను చేస్తారు. ఆదివాసీలు అమ్మవారిని 6 రోజులు పూజించగా.. మిగిలిన ఒక్కరోజు బ్రాహ్మణలు పూజను చేస్తారు. ఇక్కడ అమ్మవారిని పూజిస్తే.. ఆర్థిక సమస్యలు తీరి.. తలపెట్టిన పనిలో విజయాన్ని సొంతం చేసుకుంటారని భక్తుల నమ్మకం.

3 / 6
ఈ ఆలయ నిర్మాణం వెనుక అనేక కథలున్నాయి. ఒడిశాకు చెందిన చమ్రు పాండాల రాజు ఏడాది లో రెండు సార్లు ఇక్కడ వచ్చి పూజను నిర్వహించేవాడు. అప్పుడు పాండాలు ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకోమని రాజు కోరగా.. రాజు మాటను మన్నించి అక్కడే వారు స్థిర నివాసం ఏర్పరచుకున్నారట. ఒక రోజు పాండాలకు దేవోరి మాత కనిపించి తాను ఎక్కడ ఉన్నది చెప్పిందట. ఈ విషయం పాండాలు రాజు కి చెప్పగా.. రాజు అడవిని శుభ్రం చేయడం ప్రారంభించాడు.. అప్పుడు ఒక నల్లని రాయి కనిపించిందట.. అయితే వారు దానిని పట్టించుకోకుండా మరికొంత సేపు వెదకి.. తిరిగి ఇంటికి వచ్చారు..అయితే మర్నాడు ఆ నల్లని రాయి కనిపించిన ప్రాంతంలో ఓ ఆలయం ఉందట.. ఇది చూసిన అందరూ షాక్ తిన్నారట.

4 / 6
ఈ ఆలయ నిర్మాణం గురించి కేరా రాజు, పాండాల రాజు తో పాటు మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. కళింగ యుద్ధం సమయంలో అశోకుడు అమ్మవారి మందిరాన్ని నిర్మించాడని ఓ కథనం

5 / 6
గర్భ గుడిలో దేవోరి మాత విగ్రహం మూడున్నర అడుగుల ఎత్తు ఉండగా.. చేతులు 16 ఉంటాయి. ఎడమవైపున ఉన్న నాలుగు చేతుల్లో విల్లు, కవచం, పువ్వు, పారామ్ ఉన్నాయి. కుడి వైపున ఉన్న చేతుల్లో ఇతర అస్త్రాలు ఉన్నాయి. ఇక్కడ అమ్మరికి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.. భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు.

6 / 6
Follow us