AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Utlosavam: ఉట్లోత్సవం ఎందుకు జరుపుకుంటారు? ఎలా ప్రారంభమైంది? తేదీ, ప్రాముఖ్యత ఏమిటంటే?

హిందూ మత విశ్వాసాల ప్రకారం ద్వాపరయుగం నుండి ఈ ఉట్లోత్సవం జరుపుకుంటున్నారు. శ్రీ కృష్ణ భగవానుడికి పెరుగు, పాలు. వెన్న అంటే చాలా ఇష్టం. స్నేహితులతో కలిసి ఇరుగుపొరుగు ఇళ్లలో వెన్న దొంగిలించి తినేవాడు. అందుకే అతన్ని వెన్న దొంగ అని కూడా అంటారు. అంతే కాదు గోపికలు తీసుకుని వెళ్ళే పాలు, పెరుగు కుండలను కూడా పగలగొట్టేవాడు. దీంతో విసుగు చెందిన గోపికలు వెన్న, పెరుగు కుండలను తమ ఇంట్లో ఎత్తులో వేలాడదీయడం ప్రారంభించారు.

Utlosavam: ఉట్లోత్సవం ఎందుకు జరుపుకుంటారు? ఎలా ప్రారంభమైంది? తేదీ, ప్రాముఖ్యత ఏమిటంటే?
Utlotsavam
Surya Kala
|

Updated on: Aug 26, 2024 | 4:48 PM

Share

శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలోని అష్టమి తిథి రోజున శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినోత్సవం జరుపుకుంటారు. ఈ సంవత్సరం జన్మాష్టమి 26 ఆగస్టు 2024 సోమవారం రోజున జరుపుకుంటున్నారు. ఎప్పటిలాగే జన్మాష్టమి మర్నాడు అంటే రేపు దేశవ్యాప్తంగా దహీ హండి అంటే ఉట్టి కొట్టే (ఉట్లోత్సవం) పండుగను కూడా జరుపుకుంటారు. దహీ హండి పండుగను మహారాష్ట్ర, గుజరాత్‌లతో పాటు కన్నయ్య ఆలయాలలో చాలా వైభవంగా జరుపుకుంటారు. ఉట్లోత్సవంలో ఒకరిపై ఒకరు ఎక్కి గోపురంగా తయారు అయ్యి ఎత్తులో వేలాడుతున్న పెరుగు, పాలు, వెన్న మొదలైన వాటితో ఉన్న కుండను పగలగొడతారు.

దహీ హండి పండుగ ఎప్పుడంటే

ఈ ఏడాది జన్మాష్టమి ఆగస్టు 26వ తేదీ సోమవారం జరుపుకోగా.. మర్నాడు అంటే ఆగస్టు 27వ తేదీ మంగళవారం ఉట్లోత్సవం పండుగను జరుపుకోనున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, యూపీలోని మధుర, బృందావనం, గోకుల్‌లో ఈ ఉత్సవం విభిన్నంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఉట్లోత్సవం ఎలా ప్రారంభమైందంటే

హిందూ మత విశ్వాసాల ప్రకారం ద్వాపరయుగం నుండి ఈ ఉట్లోత్సవం జరుపుకుంటున్నారు. శ్రీ కృష్ణ భగవానుడికి పెరుగు, పాలు. వెన్న అంటే చాలా ఇష్టం. స్నేహితులతో కలిసి ఇరుగుపొరుగు ఇళ్లలో వెన్న దొంగిలించి తినేవాడు. అందుకే అతన్ని వెన్న దొంగ అని కూడా అంటారు. అంతే కాదు గోపికలు తీసుకుని వెళ్ళే పాలు, పెరుగు కుండలను కూడా పగలగొట్టేవాడు. దీంతో విసుగు చెందిన గోపికలు వెన్న, పెరుగు కుండలను తమ ఇంట్లో ఎత్తులో వేలాడదీయడం ప్రారంభించారు. అయితే గోపికల ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. కొంటె కన్నయ్య తన స్నేహితుల సహాయంతో కుండ పగలగొట్టి వెన్న, పెరుగు తినేవాడు. శ్రీకృష్ణుని ఈ చిన్ననాటి చిలిపి చేష్టలను గుర్తుచేసుకుంటూ ఉట్లోత్సవంను జరుపుకోవడం అప్పుడే మొదలు పెట్టారు. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.

ఉట్లోత్సవంను ఎలా జరుపుకుంటారంటే

ఉట్లోత్సవం కోసం ఒక మట్టి కుండలో పెరుగు, వెన్న , పాలు మొదలైనవి నింపుతారు. ఆ తర్వాత కుండను ఎత్తైన ప్రదేశంలో వేలాడదీస్తారు. గోపాలురుగా మారి ఈ ఆటలో అబ్బాయిలు, అమ్మాయిలు పాల్గొంటారు. ఇందులో గోవిందుడు పిరమిడ్ గా ఏర్పడిన యువకుల మీదకు ఎక్కి.. కుండను అందుకుని కొబ్బరికాయతో ఆ కుండను పగలగొడతాడు. ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో పోటీగా కూడా నిర్వహిస్తారు. విజేతకు బహుమతి కూడా ఇస్తారు.

ఉట్లోత్సవ పండుగ ప్రాముఖ్యత

జన్మాష్టమి రోజున ఉట్లోత్సవానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శ్రీకృష్ణుని చిన్ననాటి ఆటపాటలను జ్ఞాపకాలుగా మార్చుకుని ఈ పండగను జరుపుకుంటారు. ఇంట్లో వెన్న దొంగిలించిన పాత్రను పగలగొట్టడం ద్వారా జీవితంలోని అన్ని దుఃఖాలు పోయి సుఖం, ఐశ్వర్యం, ఐశ్వర్యం, కీర్తి లభిస్తాయని హిందూ మతంలో ఒక నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు
శ్రీపెరుంబూదూర్ ప్రతిరూపం: 240 ఏళ్ల నాటి ‘అభినవ భూతపురి’ విశేషాలు
శ్రీపెరుంబూదూర్ ప్రతిరూపం: 240 ఏళ్ల నాటి ‘అభినవ భూతపురి’ విశేషాలు
వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే తోపు మ్యాచ్.. చివరి బంతి వరకు ఉత్కంఠే
వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే తోపు మ్యాచ్.. చివరి బంతి వరకు ఉత్కంఠే
అమెరికా కొత్త దాడులకు దిగితే తీవ్ర ప్రతిదాడి చేస్తాం..
అమెరికా కొత్త దాడులకు దిగితే తీవ్ర ప్రతిదాడి చేస్తాం..
అభిషేక్, వైభవ్‌లకు ఇచ్చిపడేసిన మాజీ స్టార్ ప్లేయర్..!
అభిషేక్, వైభవ్‌లకు ఇచ్చిపడేసిన మాజీ స్టార్ ప్లేయర్..!