Chanakya Niti: ఈ ఏడుగురిని కాలితో తాకరాదు.. తాకితే వచ్చే పాపాలకు పరిహారం లేదంటున్న చాణక్య

Chanakya Niti:మన పురాణాల్లో, వేమన,సుమతి వంటి పద్యాలలోనే కాదు.. గొప్ప పండితుడు.. చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి అయిన చాణుక్యుడు రచించిన నీతిశాస్త్రంలో కూడా నేటి మానవుడు తన జీవితం..

Chanakya Niti: ఈ ఏడుగురిని కాలితో తాకరాదు.. తాకితే వచ్చే పాపాలకు పరిహారం లేదంటున్న చాణక్య
Chanakya
Follow us
Surya Kala

|

Updated on: Aug 10, 2021 | 6:15 AM

Chanakya Niti:మన పురాణాల్లో, వేమన,సుమతి వంటి పద్యాలలోనే కాదు.. గొప్ప పండితుడు.. చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి అయిన చాణుక్యుడు రచించిన నీతిశాస్త్రంలో కూడా నేటి మానవుడు తన జీవితం సుఖమయం చేసుకోవడానికి.. ఏ పనులు చేయాలి.. ఏ పనులు చేస్తే… కష్టనష్టాలను ఎదుర్కొంటామని ఆయన అనుభవంతో చెప్పినవి ఎన్నో ఉన్నాయి. అందుకనే చాణుక్యుడి చెప్పిన మాటలను, నీటి సూత్రాలను ఆచరిస్తే.. జీవితంలో ఎదురయ్యే ఎటువంటి కష్టనష్టాలనైనా ఎదుర్కోవచ్చు. అందుకనే చిన్నతనం నుంచే పిల్లలకు పెద్దలు.. మన ధర్మంలోని సూక్ష్మాలను మంచి విషయాలను నేర్పిస్తూ ఉండాలి. పెద్దలను గౌరవించడం దగ్గర నుంచి జీవితంలో ఎలా మసలుకోవాలనే విషయం వరకూ ఎన్నో విషయాల్లో పిల్లలకు మార్గదర్శంగా వ్యవహరిస్తారు.

పిల్లలే కాదు.. పెద్దలైనా సరే కొన్ని విషయాల జోలికి ఎట్టి పరిస్థితిలోనూ పోవద్దని .. అలా చేస్తే మహా పాపం చుట్టుకుంటుందని పిల్లలకు మంచిని నేర్పించడమే దాని ఉద్దేశ్యం. ఎందుకంటే కొన్ని విషయాల జోలికి పిల్లలు వెళితే వారి జీవితం తప్పుడు మార్గంలో పయనించేందుకు కారణం అవుతుంది. అందుకనే చిన్నతనంలో పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించే ప్రతి విషయమూ మన వ్యక్తిత్వానికి పునాది అవుతుంది.

చాణక్యుడు తన చాణక్య నీతి గ్రంథంలోని ఏడవ అధ్యాయంలోని ఆరవ పద్యంలో కూడా అలాంటి ఏడుగురు వ్యక్తుల గురించి చెప్పాడు. ఎవరూ పొరపాటున కూడా ఈ ఏడుగురి విషయంలో కాలితో తాకరాదని తెలిపాడు.. అలా తాకితే.. మహా పాపంగా మారిపోతుందని ఆయన తెలిపారు. చాణుక్యుడు చెప్పిన విషయాలను ,మనిషి అర్ధం చేసుకుని నడుకుంటే.. ఇవి అతని జీవితాన్ని మెరుగుపరుస్థాయి.

అగ్ని, గురు, బ్రాహ్మణ, ఆవు, కుమారి, వృద్ధాప్యం, శిశువులను ఎప్పుడూ పాదాలతో తాకవద్దని చెప్పారు

పాదాభ్యాం న స్పృశే దగ్నిం గురుం బ్రాహ్మణమేవ చ.. నైవగాం న కుమారీం చ న వృద్ధం న శిశుం తథా

అగ్నిని గురువును, బ్రాహ్మణుని, ఆవును, కన్యను, వృద్ధుని, శిశువును పాదములతో తాకరాదు, (తన్నకూడదు).. అగ్నిని కాళ్లతో తాకిన కాలుతుంది. గురువు, బ్రాహ్మణుడు, వృద్ధుడు పూజ్యులగుటచే తన్నరాదు. కుమారి, శిశువు చిన్నవారైనను వీరు భావి రాష్ట్ర నిర్మాతలు కనుక కాలితో తన్నరాదు. ఆపును తన్నిన వారికి దండన విధింపబడుతుందని వేదాల్లో ఉంది.

Also Read: చాణక్య నీతి: కష్ట సమయాల్లో ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి..! ఎంతటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది..