Mangala Gauri Puja: నేడు శ్రావణ మంగళవారం.. ఈనెలలో మంగళగౌరీ వ్రతం చేసే విధానం.. విశిష్టత ఏమిటంటే..
Mangala Gauri Puja Vidhi: శ్రావణ మాసం అనగానే మహిళలు ఇష్టంగా జరుపుకునే పండగలు, శుభకార్యాలకు ప్రసిద్ధి. అయితే శ్రావణ మాసం అనగానే ముందుగా గుర్తుకొచ్ఛేది.. "వరలక్ష్మీ వ్రతం". అనంతరం.. ఈ మాసంలో మహిళలు..
Mangala Gauri Puja Vidhi: శ్రావణ మాసం అనగానే మహిళలు ఇష్టంగా జరుపుకునే పండగలు, శుభకార్యాలకు ప్రసిద్ధి. అయితే శ్రావణ మాసం అనగానే ముందుగా గుర్తుకొచ్ఛేది.. “వరలక్ష్మీ వ్రతం”. అనంతరం.. ఈ మాసంలో మహిళలు ఆచరించే మరో ప్రధాన వ్రతం “మంగళ గౌరీ వ్రతం”. దీనిని “శ్రావణ మంగళవార వ్రతం” అని,”మంగళ గౌరీ నోము” అని కూడా అంటారు. మంగళ గౌరీ వ్రతం ఆచరించడం వలన మహిళలు తమ “ఐదవతనం” కలకాలం నిలుస్తుందని కుటుంబ సుఖ సంతోషాలతో ఉంటుందని నమ్మకం. అందుకనే శ్రావణమాసమంలో మంగళవారములు వస్తాయో అన్ని మంగళవారాలు వ్రతం ఆచరిస్తూ.. మంగళగౌరిని పూజిస్తారు. ఈ మంగళ గౌరీ వ్రతాన్ని పెళ్లి అయిన స్త్రీలు ఐదు సంవత్సరాలు చేస్తారు. వివాహం ఐన మొదటి సంవత్సరము పుట్టినింతిలోనూ నెక్స్ట్.. నాలుగేళ్లు సంవత్సరాలు అత్తారింటిలోను ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.
వ్రత విధానం:
శ్రావణ మంగళవార వ్రతాచరించేవారు మొదటి సంవత్సరం అయిదుగురు ముత్తయిదువులనీ, రెండవ సంవత్సరం పదిమందినీ, మూడో యేడు పదిహేను మందినీ, నాలుగో ఏట ఇరవై మందినీ, అయిదవ సంవత్సరం ఇరవై అయిదు మంది ముత్తయిదువులనూ పిలిచి, పసుపు రాసి, బొట్టు పెట్టి, కాటుకిచ్చి, శనగలూ కొబ్బరీ. పండు, తాంబూలం తో వాయనాలివ్వాలి.
అయిదేళ్ళ తర్వాత ఉద్యాపన చేయాలి:
ఇలా మంగళ గౌరీ వ్రతం మొదలు పెట్టిన తర్వాత అయిదేళ్లు అయ్యాక.. ముప్ఫయి మూడు జతల అరిసెలను ఒక కొత్త కుండలో పెట్టి, ఆ పైన కొత్త రవికెల గుడ్డతో వాసెన గట్టి .. మట్టెలు, మంగళసూత్రాలు ..గాజులు, పసుపు, కుంకుమ .. తదితర మంగళకరమైన వస్తువులను పెట్టి.. పెళ్ళి కూతురుకు వాయనమియ్యాలి. పద్ధతి లోపించినా ఫలితం లోపించదు. ఈ శ్రావణ మంగళవార వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా జరుపుకుంటారు.
Also Read: Chanakya Niti: ఈ ఏడుగురిని కాలితో తాకరాదు.. తాకితే వచ్చే పాపాలకు పరిహారం లేదంటున్న చాణక్య