AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఈ 4 చోట్ల సిగ్గు పడొద్దు అంటున్న చాణక్య.. లేదంటే పశ్చాత్తాపం తప్పదట

కొన్నిసార్లు సిగ్గు కారణంగా కొంతమంది తమ జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలను సరిగ్గా చేయరు. సిగ్గుతో కొన్ని పనులు చేయక పోవడంతో అతని జీవితంలో ఎల్లప్పుడూ లోటు కనిపిస్తుంది. చాణక్యుడి ప్రకారం ఎవరైనా సరే కొన్ని ప్రదేశాల్లో పనులు చేయడానికి వెనుకంజ వేయరాదు. ముఖ్యంగా ఈ 4 ప్రదేశాల్లో సిగ్గు పడితే భవిష్యత్తులో కూడా అందుకు తగిన పర్యవసానాలను అనుభవించవలసి ఉంటుంది. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Chanakya Niti: ఈ 4 చోట్ల సిగ్గు పడొద్దు అంటున్న చాణక్య.. లేదంటే పశ్చాత్తాపం తప్పదట
Telugu Chanakya Niti
Surya Kala
|

Updated on: Sep 21, 2024 | 11:20 AM

Share

ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాని ప్రకారం అతను తన జీవితాన్ని గడుపుతాడు. జీవితంలో ప్రతి చిన్న ,పెద్ద నిర్ణయాన్ని స్వయంగా తీసుకుంటాడు. అయితే ఏమి తినాలి. ఏమి ధరించాలి, ఎలా జీవించాలి అనే విషయంపై పెద్దలు సలహాలు ఇస్తారు. మానవ జన్మ ఎత్తడం ఒక వరం.. దీనిని పరిపూర్ణంగా జీవించడంలోనే సరదా ఉంటుందని అంటారు. ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడూ వెనుకాడకూడదు. కొన్నిసార్లు సిగ్గు కారణంగా కొంతమంది తమ జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలను సరిగ్గా చేయరు. సిగ్గుతో కొన్ని పనులు చేయక పోవడంతో అతని జీవితంలో ఎల్లప్పుడూ లోటు కనిపిస్తుంది. చాణక్యుడి ప్రకారం ఎవరైనా సరే కొన్ని ప్రదేశాల్లో పనులు చేయడానికి వెనుకంజ వేయరాదు. ముఖ్యంగా ఈ 4 ప్రదేశాల్లో సిగ్గు పడితే భవిష్యత్తులో కూడా అందుకు తగిన పర్యవసానాలను అనుభవించవలసి ఉంటుంది. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

విద్య పొందడానికి సిగ్గుపడకూడదు

జీవితంలో విద్యను పొందడం చాలా ముఖ్యం. ఎక్కడ చదువుకుంటున్నా విద్యను  పొందడంలో సిగ్గుపడాల్సిన పనిలేదు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. అయితే ఎదుటి వ్యక్తితో పోల్చుకుంటూ మీ కంటే తక్కువ అనుకుంటే చదువుకు అవకాశం లేకుండా పోతుంది. చాణక్యుడు ఇలా చేయడం సమంజసమైన విషయంగా పరిగణించలేదు. విద్య ఎక్కడ నుంచి ఎలా అభ్యసించినా సరే దానిని అందుకోవాలి. అది మనిషి అయినా, జంతువు అయినా మరేదైనా సరే, విద్యను ఎల్లప్పుడూ అందుకోవాలి. దక్కిన విజ్ఞానంతో తృప్తి చెందరాదు. గుంపులో ఎంత మంది వ్యక్తులున్నా సరే.. అర్ధం కాని విషయాలను ఇతరులను అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ విస్మరిస్తే మూర్ఖత్వమే.. అభివృద్ధి కోసం అన్ని వైపుల నుంచి  జ్ఞానాన్ని పొందే అవకాశాలను అందుకోవడం చాలా ముఖ్యం.

తినడానికి సిగ్గుపడకూడదు

ఆహారం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. ఆహారం తినకుండా ఉంటే అది మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకున్నట్లే.. ఎందుకంటే ఆకలితో ఉన్న వ్యక్తి తనపై తాను తక్కువ నియంత్రణ కలిగి ఉంటాడు.  అలాంటి వ్యక్తులు జీవితంలో వెనుకబడి ఉంటారు. ఆకలితో ఉన్నవారిలో ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కనుక మనుషులు ఆహారం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదు.  ఆకలిని చంపుకోకూడదు. సంపూర్ణంగా భోజనం తినడం అనేది  జీవితంలో చాలా ముఖ్యమైంది.

అభిప్రాయాలను వ్యక్తపరచడంలో సిగ్గుపడకూడదు.

జీవితంలో చాలా సార్లు సిగ్గు వలన తాము చెప్పాలనుకున్న విషయాన్నీ చెప్పలేరు.  అందువల్ల తన మనసులో ఉన్న విషయాన్నీ ఎవరికైనా  చెప్పలనున్నా ఎప్పటికీ చెప్పలేరు. సరైన సమయంలో సరైన వ్యక్తికి సరైన విషయాన్ని ఎలా చెప్పాలో తెలుసుకోవడం కూడా ముఖ్యం. ఇలా చేయడం మనిషి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. జీవితంలో పురోగతిని కూడా అందిస్తుంది. తాము చెప్పాలనుకున్న మాటలను తామే మనసులో దాచుకునే వ్యక్తులు తరువాత పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. ఇతరులు ఇటువంటి వారి కంటే ముందుంటారు. కొన్నిసార్లు ఇలాంటి చర్యల వలన చాలా సంబంధాలు క్షీణిస్తాయి. అటువంటి పరిస్థితిలో, సంబంధాలు మెరుగు పడాలంటే తాము చెప్పాలన్నా విషయాలను ఎటువంటి సంకోచం లేకుండా ఇతరులకు చెప్పాలి.

అప్పు అడగడం లో సిగ్గు వద్దు.

డబ్బు విషయంలో కూడా ఎవరైనా సరే ఎప్పుడూ సిగ్గుపడకూడదు. డబ్బు ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ ఉపయోగపడే వస్తువు. కనుక ఎవరైనా మీ దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని ఎంత కాలమైనా తిరిగి ఇవ్కవపోతే  దీని వల్ల మీరు నష్టపోవాల్సి వస్తుంది. కనుక ఎవరికైనా డబ్బులు అప్పు ఇస్తే సంకోచాన్ని పక్కకు పెట్టి అప్పు తిరిగి ఇవ్వమని అడగాలని చాణక్యుడు చెప్పాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి