- Telugu News Photo Gallery Spiritual photos Saturday remedies: lord shani worship remove problems in life
Lord Shani: శనివారం వీటిని దానం చేయడం వలన శని దోషం తొలగిపోతుంది.. శనిశ్వరుడి ఆశీస్సులు మీ సొంతం..
శనివారం శనిశ్వరుడికి అంకితమైన రోజుగా పరిగణించబడుతుంది. జీవితంలో శని దోషం ఉన్నవారు శనివారం నాడు హృదయపూర్వకంగా శని దేవుడిని పూజించాలని, దాన ధర్మాలు చేయాలని చెబుతారు. ఇలా చేయడం వల్ల శని దోషం తొలగిపోతుంది. శని దేవుడికి ఇష్టమైన వస్తువులు శనివారం రోజున దానం చేస్తే శనిదేవుడు సంతోషిస్తాడు. తన ఆశీస్సులను భక్తులపై కురిపిస్తాడు. అటువంటి పరిస్థితిలో శనివారం రోజున ఏ వస్తువులను దానం చేయడం వల్ల ప్రయోజనకరమో.. ఈ రోజు తెలుసుకుందాం.
Updated on: Sep 21, 2024 | 10:23 AM

శనిశ్వరుడికి నలుపు రంగు అంటే చాలా ఇష్టం. నలుపు రంగు వస్తువులు శని దోషాన్ని తొలగిస్తాయి. అలాగే ఈ రోజున నలుపు రంగుకు సంబంధించిన వస్తువులను దానం చేస్తే శనిదేవుని విశేష ఆశీస్సులు లభిస్తాయని ఒక నమ్మకం. అంతే కాదు ఏలి నాటి శనితో ఇబ్బంది పడేవారికి ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

నల్ల దుస్తులు : శని దేవుడికి నలుపు రంగు అంటే ఇష్టం కనుక ఈ రోజున ఎవరికైనా నలుపు రంగు బట్టలు దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది. అంతేకాదు ఈ రోజున నల్ల చెప్పులను దానం చేయడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.

మినప పప్పు, నల్ల నువ్వుల దానం: ఈ రోజున నల్ల నువ్వులు లేదా నల్ల మినప పప్పు దానం చేయడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు ఇలా చేయడం వల్ల డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల శని దోషంతో పాటు ఏలి నాటి శని నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ రోజున వీటిని తినకూడదని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.

ఇనుము: శనిశ్వరుడికి ఇనుము అంటే చాలా ఇష్టం. ఈ రోజున ఇనుమును దానం చేస్తే, అది కూడా చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఇనుముతో చేసిన ఉంగరాలను లేదా ఇనుముతో చేసిన ఇతర వస్తువులను దానం చేయవచ్చు.

నువ్వుల నూనే లేదా ఆవ నూనే: శని దేవ్‌కి నువ్వుల నూనే అంటే ఇష్టం. అటువంటి పరిస్థితిలో శనివారం నాడు శని దేవుడిని నువ్వుల నూనెతో పూజించి ఆవాల నూనెను దానం చేయడం వలన ప్రయోజనం పొందుతారు




