- Telugu News Photo Gallery Spiritual photos Dasara Navaratri 2024: Offer Shami leave To goddess durga devi With Red hibiscus Flower Every Day In Navratri
Dasara 2024: దుర్గమ్మకు ఇష్టమైన పువ్వులు, ఆకులతో నవరాత్రుల్లో పూజ చేస్తే కష్టాలు మాయం..
హిందూ ధర్మంలో జ్యోతిష్యశాస్త్రంలో చెట్లు, మొక్కలను చాలా అద్భుతంగా పరిగణిస్తారు. మతపరమైన దృక్కోణంలో చూస్తే కొన్ని చెట్లు, మొక్కలు చాలా ముఖ్యమైనవి. అవి జాతకంలోని గ్రహాలు, నక్షత్రాల దుష్ప్రభావాలను కూడా తగ్గిస్తాయి. ఈ మొక్కల్లో ఒకటి జమ్మి చెట్టు. శరన్నవరాత్రుల ఉత్సవాలల్లో దుర్గాదేవికి ఎర్రటి పువ్వులతో ఉన్న జమ్మి ఆకులను సమర్పించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. నవరాత్రులలో దుర్గదేవిని జమ్మి ఆకులతో పూజిస్తారు.
Updated on: Sep 21, 2024 | 12:27 PM

హిందూ ధర్మంలో జ్యోతిష్యశాస్త్రంలో చెట్లు, మొక్కలను చాలా అద్భుతంగా పరిగణిస్తారు. మతపరమైన దృక్కోణంలో చూస్తే కొన్ని చెట్లు, మొక్కలు చాలా ముఖ్యమైనవి. అవి జాతకంలోని గ్రహాలు, నక్షత్రాల దుష్ప్రభావాలను కూడా తగ్గిస్తాయి. ఈ మొక్కల్లో ఒకటి జమ్మి చెట్టు. శరన్నవరాత్రుల ఉత్సవాలల్లో దుర్గాదేవికి ఎర్రటి పువ్వులతో ఉన్న జమ్మి ఆకులను సమర్పించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. నవరాత్రులలో దుర్గదేవిని జమ్మి ఆకులతో పూజిస్తారు.

ఇంట్లో సంతోషం, శాంతి : నవరాత్రులలో ప్రతిరోజూ దుర్గాదేవికి ఎర్రటి మందారం పువ్వులతో పూజ చేస్తారు. వివిధ పురాణాలు, శాస్త్రాలలో ఎరుపు మందారం పువ్వులతో అమ్మవారిని పూజించడం గురించి వివరించబడింది. అయితే జమ్మి పువ్వులు,ఆకులు కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవని చాలా తక్కువ మందికి తెలుసు. నవరాత్రులలో ప్రతిరోజూ అమ్మవారికి ఒక్కటైనా మందారం పువ్వు, శమీ పువ్వులతో ఉన్న ఆకును సమర్పిస్తే భగవతి దేవి అపారమైన అనుగ్రహాన్ని పొందుతారు. అమ్మవారిని వీటితో పూజించడం వలన ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. అన్ని కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం.

పురాణశాస్త్రంలో జమ్మి విశిష్టత : జమ్మి ఆకులకు సంబంధించి ఒక పురాణం కూడా ఉంది. పురాణాల ప్రకారం దసరా రోజున దశరథ మహారాజు జమ్మి చెట్టు నుండి బంగారు నాణేలను అందుకున్నాడు.. అప్పటి నుంచి దసరా రోజున శమీ వృక్షాన్ని పూజించే సంప్రదాయం కొనసాగుతోంది. శ్రీరాముడు దుర్గామాత పూజతో పాటు శమీ వృక్షాన్ని కూడా పూజించాడని మరో కథనం. అంతేకాదు పాండవుల మధ్యముడు జమ్మి చెట్టు మీద నుంచి తన ధనస్సుని దసరా రోజున తీసుకున్నాడని విశ్వాసం. కనుక నవరాత్రి ఉత్సవాల ముగింపులో 10వ రోజుజైన దసరా రోజున శమీ వృక్షాన్ని పూజించడం వల్ల ఇంట్లో సిరి సంపదలు చేకూరుతాయని..భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం.

ఈ చెట్టు ఆకులను ఇంట్లో ఎక్కడ పాతిపెట్టాలి: జమ్మి చెట్టు చాలా అద్భుత వృక్షంగా పరిగణించబడుతుంది. ఈ చెట్టును ఇంటి ఆవరణలో నాటడం వల్ల దేవతల ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఇంటికి దక్షిణ దిక్కున లేదా తూర్పు దిక్కున జమ్మి చెట్టున ఉంచి నిత్యపూజలు చేసి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన ఇంట్లో గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుందని విశ్వాసం. జమ్మి చెట్టును నాటడం వల్ల శని దోషం కూడా తొలగిపోతుంది. జమ్మి ఆకులను ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవడం వలనా తంత్ర-మంత్రం, ప్రతికూల శక్తి ప్రభావం తగ్గుతుంది. విజయదశమి రోజున ప్రదోష సమయంలో జమ్మి చెట్టుని పూజించాలి.

దుఖం, ఆర్ధిక కష్టాల నుంచి ఉపశమనం : తంత్ర శాస్త్రంలో దుర్గాదేవికి క్రమం తప్పకుండా జమ్మి ఆకులను సమర్పించడం శుభప్రదం. అమ్మవారు సంతోషించి తన భక్తుల కుటుంబాన్ని ఆశీర్వదిస్తుందని నమ్మకం. దుర్గాదేవికి నిత్యం జమ్మి ఆకును నైవేద్యంగా పెట్టడం వల్ల దుఃఖంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

జమ్మి ఆకులతో ఎలా పూజ చేయాలంటే : అమ్మవారికి జమ్మి ఆకులతో పూజించే ముందు వాటికి చందనం, కుంకుమని దిద్దండి. ఆ తర్వాత అమ్మవారిని ధ్యానిస్తూ కోరికను అమ్మవారి ముందు తెలియజేస్తూ దుర్గమ్మకి జమ్మి పత్రాలు సమర్పించండి. శ్రీ మహా విష్ణువు తలపై తులసి దళాన్ని ఏ విధంగా ఉంచుతారో అదే విధంగా అమ్మవారి తలపై శమీ ఆకులను సమర్పించండి. దుర్గాదేవికి అలాగే గణేశునికి శమీ ఆకులను సమర్పించండి. తల్లి తనయుడిని శమీ ఆకులతో పూజించడం వల్ల జీవితంలో శుభం కలుగుతుంది.




