- Telugu News Photo Gallery If you have these paintings in your home, there will be no shortage of money, check here is details
Spiritual: ఈ పెయింటింగ్స్ మీ ఇంట్లో ఉంటే డబ్బుకు లోటు ఉండదు..
ప్రస్తుతం కాలంలో డబ్బే ప్రపంచాన్ని ఏలుతుంది. డబ్బు ఉంటే ఏదన్నా.. ఏమన్నా చేయవచ్చు. డబ్బు ఉండటం వల్ల సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. అందుకే అందరూ డబ్బు వేటలో పడ్డారు. కొంత మందికి అదృష్టాన్ని బట్టి కష్ట పడకపోయినా.. లక్ష్మీ దేవి కలిసి వస్తుంది. మరికొందరు ఎంత కష్ట పడినా డబ్బు సంపాదించ లేకపోతారు. అయితే డబ్బును సంపాదించే కొన్ని రకాల వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా ధనాన్ని ఆకర్షించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. కొన్ని రకాల పెయింటింగ్స్ ఇంట్లో..
Updated on: Sep 21, 2024 | 5:25 PM

ప్రస్తుతం కాలంలో డబ్బే ప్రపంచాన్ని ఏలుతుంది. డబ్బు ఉంటే ఏదన్నా.. ఏమన్నా చేయవచ్చు. డబ్బు ఉండటం వల్ల సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. అందుకే అందరూ డబ్బు వేటలో పడ్డారు. కొంత మందికి అదృష్టాన్ని బట్టి కష్ట పడకపోయినా.. లక్ష్మీ దేవి కలిసి వస్తుంది. మరికొందరు ఎంత కష్ట పడినా డబ్బు సంపాదించ లేకపోతారు.

అయితే డబ్బును సంపాదించే కొన్ని రకాల వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా ధనాన్ని ఆకర్షించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. కొన్ని రకాల పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల డబ్బును ఆకర్షిస్తాయి. మరి అవేంటో ఏ దిక్కులో ఉంచుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం.

ఏడు గుర్రాల పెయింటింగ్‌ను ఇంట్లో ఉంచుకోవడం వల్ల కెరీర్‌లో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లోకి కూడా డబ్బు చేరుతుంది. సంపదను ఆకర్షించడానికి ఈ పెయింటింగ్ పెట్టుకోవడం చాలా మంచిది. ఈ పెయింటింగ్‌ను తూర్పు దిక్కులో ఉంచితే మంచిది.

ఉదయిస్తున్న సూర్యుడి ఫోటోను కూడా ఇంట్లో ఉంచుకోవడం వల్ల చాలా మంచిది. ఈ ఫొటో మీ ఇంట్లో తూర్పు దిశలో ఉంచితే.. మీరు కొత్త అవకాశాలను పొందేందుకు సహాయపడుతుంది. నెగిటివ్ ఎనర్జీని తగ్గించి.. పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది.

చాలా మంది ఇంట్లో వాటర్ పెయింటింగ్స్ ఉంటాయి. వీలిని చాలా మంది ఇష్ట పడుతూ ఉంటారు. ఇలా జలపాతం ఉండే పెయింటింగ్స్‌ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల డబ్బుకు కొరత ఉండదు. ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




