- Telugu News Photo Gallery Spiritual photos Lord shani dev effects these zodiac signs to relieve from many problems details in telugu
Lord Shani Dev: స్వతంత్ర శనితో ఆ రాశుల వారికి కష్టాల నుంచి విముక్తి..! అందులో మీ రాశి ఉందా..
ఈ నెల 24వ తేదీ నుంచి ఏడాది చివరి వరకూ శని పూర్తి స్థాయిలో స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభిస్తాడు. శని మీద ఏ గ్రహ ప్రభావమూ ఉండదు. తన స్వక్షేత్రంలో ఉండడం వల్ల, పైగా వక్రించి ఉండడం వల్ల శని ఫలితాలు కొద్దిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని రాశుల వారి జీవితాల మీద శని ప్రభావం చాలావరకు సానుకూలంగా, యోగదాయకంగా ఉండబోతోంది.
Updated on: Sep 20, 2024 | 5:27 PM

ఈ నెల 24వ తేదీ నుంచి ఏడాది చివరి వరకూ శని పూర్తి స్థాయిలో స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభిస్తాడు. శని మీద ఏ గ్రహ ప్రభావమూ ఉండదు. తన స్వక్షేత్రంలో ఉండడం వల్ల, పైగా వక్రించి ఉండడం వల్ల శని ఫలితాలు కొద్దిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది. వృషభం, మిథునం, సింహం, తుల, మకర, కుంభ రాశుల వారి జీవితాల మీద శని ప్రభావం చాలావరకు సానుకూలంగా, యోగదాయకంగా ఉండబోతోంది. కొన్ని ముఖ్యమైన సమస్యల నుంచి పూర్తిగా బయటపడడంతో పాటు, తమ తమ రంగాల్లో బాగా పురోగతి సాధించే అవకాశం ఉంటుంది.

వృషభం: ఈ రాశివారికి దశమ స్థానంలో శనీశ్వరుడు సంచారం సాగిస్తున్నందువల్ల ఉద్యోగంలో ఊహించని మార్పులు చోసుకునే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం విషయంలో నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు పెంపొందుతాయి. ప్రముఖులతో పరిచ యాలు విస్తరిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కష్టనష్టాలను అధిగమిస్తాయి. టెక్నాలజీ, టెక్నికల్, ఎల క్ట్రిక్ రంగాలకు చెందినవారు అత్యధికంగా పురోగతి చెందుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మిథునం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో శని సంచారం వల్ల విదేశీయాన సమస్యలు తొలగిపోతాయి. విదేశీ సొమ్ము అనుభవించే యోగం పడుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా విదేశీ అవకాశాలు లభిస్తాయి. తండ్రి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. తీర్థ యాత్రలు, విహార యాత్రలు పెరుగుతాయి. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పడతాయి. కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు.

సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న శని వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగు తుంది. ఉన్నత స్థానాలు లభిస్తాయి. నిరుద్యోగులకు విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి రాజ యోగాలు పడతాయి. వ్యాపారాల్లో కొద్ది కష్టంతో అధిక లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యక్తి గత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలపడతాయి.

తుల: ఈ రాశికి పంచమ స్థానంలో శని వక్రించడంతో పాటు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నందువల్ల ఏ రంగంలో ఉన్నా ప్రతిభా పాటవాలకు, సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు చేదోడు వాదోడుగా ఉంటారు. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ బాగా వృద్ధి లోకి వస్తారు. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. తోబుట్టువులతో వివాదాలు, విభేదాలు సమసిపోతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా అది తప్పకుండా విజయవంతం అవుతుంది.

మకరం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న ధనాధిపతి శని వల్ల అప్రయత్న ధనలాభం ఉంటుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఉద్యోగంలో ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి చాలావరకు విముక్తి పొంది, లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. కుటుం బంలో సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

కుంభం: ఈ రాశిలో శని సంచారం వల్ల సాధారణంగా ఏలిన్నాటి శని ఫలితాలు ఉండే అవకాశం ఉంది. అయితే, ఈ నెల 24 తర్వాత నుంచి ఏలిన్నాటి శని ప్రభావం చాలావరకు తగ్గిపోతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ప్రతి ప్రయత్నమూ సులువుగా నెరవేరుతుంది. అనేక లాభదాయక వ్యవహారాలు చేపడతారు. లాభదాయక పరిచయాలు కూడా వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది.



