AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ప్రజలు సమిష్టిగా తప్పు చేస్తే ఆ బాధ్యత రాజుదే.. తప్పులు- బాధ్యతలపై ఆచార్య చాణక్య ఏమంటారంటే..

Chanakya Niti: రాజుగా ఉండటం కంటె.. ఆ రాజును చాకచక్యంగా మంచి పాలన అందించేవైపు నడిపించడం చాలా కష్టం. ఒక కింగ్ మేకర్ కావాలంటే దానికి ఎంతో స్థిత ప్రజ్ఞత కావాలి.

Chanakya Niti: ప్రజలు సమిష్టిగా తప్పు చేస్తే ఆ బాధ్యత రాజుదే.. తప్పులు- బాధ్యతలపై ఆచార్య చాణక్య ఏమంటారంటే..
Chanakya Niti
KVD Varma
|

Updated on: May 21, 2021 | 10:49 AM

Share

Chanakya Niti: రాజుగా ఉండటం కంటె.. ఆ రాజును చాకచక్యంగా మంచి పాలన అందించేవైపు నడిపించడం చాలా కష్టం. ఒక కింగ్ మేకర్ కావాలంటే దానికి ఎంతో స్థిత ప్రజ్ఞత కావాలి. అమోఘమైన తెలివితేటలూ అంతకు మించి ప్రతి విషయాన్ని నిశిత దృష్టితో గమనించి దానిని విశ్లేషించి నిర్ణయాలు తీసుకునే నిపుణత ఉండాలి. ఇవన్నీ పుష్కలంగా ఉన్న వారు ఆచార్య చాణక్య. తన పదునైన తెలివితేటలు, నైపుణ్యంతో కూడిన వ్యూహం.. రాజకీయాల ఆధారంగా చంద్రగుప్త మౌర్యను చక్రవర్తిగా చేశారు ఆచార్య చాణక్య. అందుకే ఆయనను గొప్ప రాజకీయ నాయకుడు, దౌత్యవేత్త, ఆర్థికవేత్త అదేవిధంగా అన్ని విషయాలలో నిపుణుడిగా భావిస్తారు. ఆచార్య చాణక్య జీవితకాలమంతా అన్ని విషయాలను అధ్యయనం చేయడమే కాకుండా, జీవిత పరిస్థితులను నిశితంగా పరిశీలించి, జీవితాంతం ఉపాధ్యాయుడిగా ప్రజలకు సరైన మార్గాన్ని చూపించారు. ఆచార్య చాణక్య మాటలు నేటికీ చాలా ఖచ్చితమైనవి. ఆచార్య చాణక్య విధానం ఏమి చెబుతుందో తెలుసుకుందాం..

ప్రజల తప్పులకు రాజు బాధ్యుడు..

సాధారణంగా ఎవరు తప్పు చేస్తే వారు దానికి బాధ్యులుగా భావిస్తాం కానీ.. ఆచార్య చాణక్య మాత్రం అలా కాదంటారు. ఎందుకంటే, ఆ తప్పు చేసే అవకాశం కల్పించిన వారే దానికి బాధ్యత వహించాలి అంటారు. తమ అనుచరులుగా ఉన్నవారు తప్పు చేస్తే అది నాయకుని చేతకానితనమే అనేది ఆచార్య చాణక్య ఇచ్చే సందేశం. తప్పు-బాధ్యత విషయంలో ఆచార్య చాణక్యుడు ఇలా చెబుతారు..

1. దేశ ప్రజలు సమిష్టిగా ఏదైనా తప్పు చేసినప్పుడు, దానికి ఆ ప్రజలను పాలించే రాజు బాధ్యత వహించాలి. ఎందుకంటే రాజు తన విధులను సక్రమంగా నిర్వర్తించలేక పోయినప్పుడు, ప్రజలు తప్పుడు మార్గంలో వెళ్లి తిరుగుబాటు చేసి తప్పు పని చేస్తారు. అటువంటి పరిస్థితిలో, ప్రజలు చేసే చర్యకు రాజు బాధ్యత వహించాలి. అందువల్ల, ప్రజలు తప్పు చేయకుండా ఉండేలా రాజు పాలన ఉండాలి.

2. రాజు తీసుకునే తప్పు నిర్ణయానికి లేదా అతని మతాన్ని సరిగ్గా పాటించకపోవడానికి పూజారులు, రాజు సలహాదారులు బాధ్యత వహిస్తారు. రాజుకు పూర్తి సమాచారం అదేవిధంగా సరైన సమాచారం ఇవ్వడం వారి విధి. తప్పుడు నిర్ణయం తీసుకోకుండా నిరోధించడం పూజారి పని.

3. ఒక స్త్రీ ఏదైనా తప్పు చేసినప్పుడు, ఆమె భర్త తన తప్పులను భరించాలి. అదే సమయంలో, భర్త ఒకవేళ తప్పు చేసినప్పుడు, భార్య ఆ తప్పులను అనుభవించాలి. అటువంటి పరిస్థితిలో, ఇద్దరూ ఒకరికొకరు జవాబుదారీగా ఉంటారు. కాబట్టి, భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు మంచి సలహాదారులుగా ఉండాలి.

4. గురువు తన పనిని సరిగ్గా చేయనప్పుడు, శిష్యుడు తప్పు పనులలో పాల్గొంటాడు. శిష్యుడి తప్పుడు చర్యలకు గురువునే నిందిస్తారు. అందువల్ల, ఒక గురువు ఎల్లప్పుడూ తన శిష్యుడికి సరైన మార్గాన్ని చూపించి, తప్పుడు మార్గంలో వెళ్ళకుండా నిరోధించాలి.

Also Read: Chanakya Niti: చాణక్య నీతి.. ఆ మూడు లక్షణాలు ఉన్న స్త్రీ కుటుంబంతో పాటు సమాజానికీ నాయకురాలు అవుతుంది!

Chanakya Niti: మనిషి ఏ విషయాల్లో అసంతృప్తి చెందకూడదు..వేటి విషయంలో ఇక చాలు అని అనుకోకూడదు..ఆచార్య చాణక్య ఏం చెప్పారు?