AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Neeti: ఈ నాలుగు వ్యక్తిత్వాలు గల వారికి మీ సంపాదన గురించి అస్సలు చెప్పొద్దు.. పొరపాటున చెప్పారో అంతే సంగతులు..!

Chanakya Neeti: డబ్బు సంపాదన మనిషి జీవితంలో ఎంతో కీలకం అనే విషయం తెలిసిందే. భూమిపై మనిషి మనుగడ సాగించాలనే డబ్బు చాలా

Chanakya Neeti: ఈ నాలుగు వ్యక్తిత్వాలు గల వారికి మీ సంపాదన గురించి అస్సలు చెప్పొద్దు.. పొరపాటున చెప్పారో అంతే సంగతులు..!
Chanakya
Shiva Prajapati
| Edited By: Sanjay Kasula|

Updated on: Jul 09, 2021 | 7:20 PM

Share

Chanakya Neeti: డబ్బు సంపాదన మనిషి జీవితంలో ఎంతో కీలకం అనే విషయం తెలిసిందే. భూమిపై మనిషి మనుగడ సాగించాలంటే డబ్బు చాలా ముఖ్యం. ఈ సంగతిని ఆచార్య చాణక్య ఎప్పుడో చెప్పారు. సంపద జీవితానికి అత్యంత కీలకమని, దానిని నిజమైన స్నేహితుడిగా కాపాడుకోవాలని సూచించారు. డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చునని చెప్పారు. అయితే, సంపద గల వ్యక్తులు తమ సంపాదన గురించి గోప్యత పాటించాలని సూచించారు.  ఎవరితో పడితే వారితో డబ్బు గురించి మాట్లాడొద్దన్నారు. ముఖ్యంగా కొన్ని వ్యక్తిత్వాలు కలిగిన వారితో సంపద గురించి షేర్ చేసుకోవద్దని చాణక్యుడు హితవు చెప్పారు. ఇదే విషయాన్ని ఆచార్య చాణక్య తన గ్రంథంలో తెలిపారు. మరి డబ్బు గురించి ఎవరితో పంచుకోవద్దో ఇప్పుడు తెలుసుకుందాం.

అత్యాశ కలిగినవారితో.. అత్యాశగల వ్యక్తులను నమ్మడానికి వీలు లేదు. ఇలాంటి బుద్ధి కలిగిన వారు ఎక్కడికి వెళ్లిన అదే దృక్పథంలో ఉంటారు. ఇలాంటి వారితో మీ సంపాదన గురించి అస్సలు చెప్పొద్దు. ఎందుకంటే అలాంటి బుద్ది కలిగిన వారు.. మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. తద్వారా మీరు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే అత్యాశ కలిగిన ప్రజల ముందు డబ్బు, వ్యాపార విషయాల గురించి ఎప్పుడూ చెప్పొద్దని కౌటిల్యుడు పేర్కొన్నారు.

ఈర్ష్య కలిగిన ప్రజలకు.. మీపై అసూయపడే ఎవరైనా సరే మిమ్మల్ని కిందకు లాగాలనే ప్రయత్నిస్తారు. ఎందుకంటే, వారు మిమ్మల్ని సంతోషంగా చూడలేరు. ఇలాంటి ఈర్ష్య కలిగిన వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. ఈ గుణం కలిగిన వారితో డబ్బు, వ్యాపారం గురించి మాట్లాడొద్దు. లేదంటే మీరే నష్టపోయే ప్రమాదం ఉంది.

మీ వ్యాపార పోటీదారు.. మీరు వ్యాపారంలో మీ పోటీదారుడి ముందు డబ్బు లేదా వ్యాపారం గురించి అస్సలు మాట్లాడొద్దు. అతను మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే ప్రమాదం ఉంది. మీ ప్లాన్స్‌ అన్నింటిని తెలుసుకుని, మీకు వ్యతిరేకంగా వ్యూహాలు పన్ని ఇబ్బందులకు గురిచేసే ఛాన్స్ ఉంది. అందుకని మీ వ్యాపార పోటీదారులకు మీ సంపాదన గురించి అస్సలు వెల్లడించొద్దని చాణక్య తన గ్రంథంలో పేర్కొన్నారు.

అమాయక ప్రజలు.. కొంతమంది చాలా అమాయకంగా ఉంటారు. వీరికి ఎవరి ముందు ఎలా మాట్లాడాలో తెలియదు. అలాంటి వ్యక్తులకు మీరు.. మీ సంపాదన గురించి చెబితే.. మీరే ఇబ్బందులపాలవుతారు. అమాయక వ్యక్తులకు మీ వ్యాపార రహస్యాలు, సంపాదన గురించి వారు వెళ్లి ఇతరులకు చెప్పే అవకాశం ఉంది. అందుకని అమాయక వ్యక్తులకు కూడా మీ వ్యాపార, సంపాదన గురించి చెప్పొద్దు.

Also read:

సర్వాంగ సుందరంగా హనుమంతుడి ఆలయ నిర్మాణం.. 17 ఏళ్ల కలను నెరవేర్చుకున్న అర్జున్

Revanth Reddy: అంతా అక్కడి నుంచి వచ్చినవారే.. మంత్రి హరీష్ రావుకు పీసీసీ చీఫ్ రేవంత్ కౌంటర్

Amazon Alexa: ‘అలెక్సా’ పేరు మార్చాలని డిమాండ్‌ చేస్తున్న తల్లిదండ్రులు.. ఒత్తిడికి గురై స్కూళ్లకు వెళ్లడం లేదంటూ.