నేడు కాలాష్టమి.. ఈ యోగంలో కాలభైరవుడిని పూజించండి.. శివపార్వతుల అనుగ్రహం దంపతుల సొంతం..

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం చైత్ర మాసంలో కృష్ణ పక్ష అష్టమి మే 1వ తేదీ ఉదయం 05:45 గంటలకు ప్రారంభమై మే 2వ తేదీ తెల్లవారుజామున 04:01 గంటలకు ముగుస్తుంది. మే 1వ తేదీన కాలాష్టమి వ్రతాన్ని ఆచరిస్తారు. అంతే కాకుండా కాలాష్టమి నాడు ఎన్నో శుభ, అద్భుత యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగం రాత్రి 08:02 వరకు ఉంటుంది. దీని తర్వాత శుక్ల యోగం ఏర్పడుతోంది. ఈ యోగా చాలా పవిత్రమైనది. ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది.

నేడు కాలాష్టమి.. ఈ యోగంలో కాలభైరవుడిని పూజించండి.. శివపార్వతుల అనుగ్రహం దంపతుల సొంతం..
Kalashtami 2024
Follow us
Surya Kala

|

Updated on: May 01, 2024 | 9:06 AM

హిందూ మతంలో ప్రతి నెలా కృష్ణ పక్షంలోని అష్టమి తేదీన కాలాష్టమి పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ పండుగ బుధవారం, మే 01, 2024 చైత్ర మాసంలో అంటే ఈ రోజు జరుపుకోనున్నారు. కాలాష్టమి నాడు శివుని ఉగ్ర రూపమైన కాల భైరవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజున కాలభైరవుడిని పూజించడం, ఉపవాసం ఉండటం అత్యంత విశిష్టమైనదని భక్తులు పుణ్యఫలాలను పొందుతారని నమ్ముతారు. అంతే కాకుండా ఈసారి వైశాఖ మాసం కాలాష్టమి  రోజున శుభ యోగం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఈ యోగాలలో కాలభైరవుడిని పూజించిన ప్రతి భక్తుడి కోరిక నెరవేరుతుంది.

శాస్త్రాల ప్రకారం కాలాష్టమిని కాల భైరవుడికి అంకితం చేసినందున భైరవష్టమి అని కూడా పిలుస్తారు. శివుని ఉగ్ర రూపమైన కాల భైరవుడి అనుగ్రహం పొందడానికి ఈ రోజున శివుని, కాలభైరవునికి ప్రత్యేక పూజలు చేస్తారు.

కాలాష్టమి శుభ సమయం, యోగం

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం చైత్ర మాసంలో కృష్ణ పక్ష అష్టమి మే 1వ తేదీ ఉదయం 05:45 గంటలకు ప్రారంభమై మే 2వ తేదీ తెల్లవారుజామున 04:01 గంటలకు ముగుస్తుంది. మే 1వ తేదీన కాలాష్టమి వ్రతాన్ని ఆచరిస్తారు. అంతే కాకుండా కాలాష్టమి నాడు ఎన్నో శుభ, అద్భుత యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగం రాత్రి 08:02 వరకు ఉంటుంది. దీని తర్వాత శుక్ల యోగం ఏర్పడుతోంది. ఈ యోగా చాలా పవిత్రమైనది. ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

కాలాష్టమి పూజా విధానం

కాల భైరవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కాలాష్టమి ఉపవాసం  చేస్తారు. ఈ రోజు సాయంత్రం శుభ సమయంలో పూజించాలి.

సాయంత్రం వేళ ఉపవాసం ఉండేవారు తమ ఇంటిని, పూజా గదిని శుభ్రంగా శుభ్రం చేసుకోవాలి. భైరవుడి విగ్రహాన్ని ఒకపీఠం మీద ప్రతిష్టించండి.

పంచామృతంతో అభిషేకం చేసిన తరువాత, కాలభైరవుడికి సుగంధద్రవ్యాలు పూయండి, పూల మాల సమర్పించండి.

దేవుని ముందు ఆవనూనె దీపం వెలిగించి, భక్తితో కాలభైరవ అష్టకం పఠించండి.

పూజను హారతి ఇచ్చి ముగించి.. పూజ సమయంలో తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని అడగండి.

మర్నాడు అంటే రేపు ప్రసాదం పంచి ఆ ప్రసాదాన్ని తీసుకుని ఉపవాసం విరమించండి. పేదలకు అన్నదానం చేసి వస్త్రాలు, ధాన్యాలు తదితర దానం చేస్తారు.

కాలాష్టమి రోజున శివుడు తన భార్య పార్వతితో కలిసి ఈ యోగంలో కూర్చుంటాడని నమ్ముతారు. ఈ యోగంలో శివ పార్వతీదేవిని పూజించడం వల్ల భక్తులు అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతారు. అంతేకాకుండా, కుటుంబంలో ఏమైనా కష్టాలు ఉంటే వాటి నుంచి విముక్తి లభించడమే కాదు.. సుఖ సంతోషాలు నెలకొంటాయి.

జపించాల్సిన మంత్రాలు

ఓం కాల భైరవాయ నమః ఓం భయహరణం చ భైరవ:

అనే మంత్రాలను పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు