- Telugu News Photo Gallery Spiritual photos According to garuda purana do not eat with these five persons
గరుడ పురాణం ప్రకారం ఈ ఐదుగురితో కలిసి ఎన్నడూ భోజనం చేయవద్దు.. అలా తినడం వలన శరీరానికి తగిన ఫలం ఉండదట..
భోజనం అంటే సంపూర్ణ ఆహారం. జీవితంలో ముఖ్యమైన భాగం. రోజూతినే ఆహారంతో శరీరానికి కావలసిన విటమిన్స్, మినిరల్స్, కాలరీస్, కొవ్వు పదార్ధాలు ఇలా అన్నింటిని అందించే భోజనం. రోజు మన కుటుంబ సభ్యులతో, ఆఫీసులో కొలీగ్స్ మధ్య లేదా స్నేహితులతో కలిసి సంతోషంగా భోజనం తింటారు. అయితే మన శాస్త్ర పురాణాల ప్రకారం ఐదు మంది వ్యక్తులతో కలిసి కూర్చుని ఆహారాన్ని తినకూదట. ఇలా తినడం వలన తిన్న ఆహారం శరీరానికి మనసుకు తగిన ఫలాన్ని ఇవ్వదట. ఈ రోజు భోజనం చేయకూడని ఆ ఐదు మంది ఎవరో తెలుసుకుందాం..
Updated on: May 01, 2024 | 7:04 AM

మన పురాణాల ప్రకారం భోజనం చేసే సమయంలో మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. సంతోషంగా ఆహారాన్ని తినాలి. అయితే అబద్ధం చెప్పే వ్యక్తులతో కూర్చుని ఎన్నడూ భోజనం చేయరాదు. ఎందుకంటే ఇలా అబద్ధాలు చేప్పే వ్యక్తులు ఎప్పటికీ విషపూరితమైన ఆలోచనలు కలవారుగానే ఉంటారు. వీరికి నైతికత అన్న మాటకు అర్ధం తెలియదు కనుక అబద్దాలు చెప్పే వారితో కలిసి భోజనం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి.

ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వారితో కలిసి భోజనం చేయరాదని పురాణాలు పేర్కొన్నాయి. అనారోగ్యంతో బాధపడే వ్యక్తీ శరీరంలో కొన్ని రకాల బ్యాక్టీరియా ఉంటుంది. అప్పుడు వారితో కలిసి భోజనం చేయడం వలన ఆ ప్రభావం ఆరోగ్యంగా ఉన్నవారిపై కూడా చూపిస్తుంది. కనుక అనారోగ్యంతో బాధపడే వ్యక్తులతో కలిసి కూర్చుని భోజనం చేయరాదు.

పురాణాల ప్రకారం నేర ప్రవృత్తి ఉన్నవారితో కలిసి భోజనం చేయవద్దు. ఎందుకంటే ఆలోచనలలో ప్రతికూలత ఉన్నవారితో భోజనం చేయరాదు. వీరి ఉన్న ప్రదేశంలో నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కనుక నేర ప్రవృత్తి ఆలోచనలు ఉన్నవారితో భోజనం తినడం కాదు.. దగ్గరగా కూడా ఉండొద్దని చెబుతారు. భోజనం చేసే సమయంలో ప్రశాంత చిత్తంతో ఉండే మనసులతో కలిసి భోజనం చేయడం వలన మేలు జరుగుతుంది.

పురాణాల ప్రకారం నాస్తికులతో కలిసి కూర్చుని భోజనం చేయరాదు. దైవంపై నమ్మకం లేని వ్యక్తులతో కలిసి భోజనం చేయడం వలన మీ మనసుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆపదలు చుట్టుముడతాయి. అంతేకాదు గరుడ పురాణం ప్రకారం కూడా భోజనం నాస్తికుడితో కలిపి భోజనం చేయరాదు.

భోజనం చేసే సమయంలో ప్రశాంత చిత్తంతో ఉండే మనసులతో కలిసి భోజనం చేయడం వలన మేలు జరుగుతుంది.




