Kitchen Hacks: ఫ్రిడ్జ్ లో పెట్టినా అల్లం ఎండిపోతుందా..! ఈ వంటింటి చిట్కాలు పాటించి చూడండి
భారతీయ వంటగదిలో అల్లం ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. కూరలు, టీ, చిన్న చిన్న శారీరక ఇబ్బందులు ఎదురైనా అల్లం రసం లేదా దాహార్తిని తీర్చడానికి మజ్జిగలో అల్లం కలపడం వంటివి చేస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో అల్లాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచడం అవసరం. ఎందుకంటే ఎండిన అల్లం ఉపయోగించడం వల్ల ఆహారానికి రుచి ఉండదు. ఈ రోజు అల్లాన్ని రిఫ్రిజిరేటర్‌లో ఉంచకుండా ఎక్కువ కాలం తాజాగా ఎలా ఉంచవచ్చో తెలుసుకుందాం..
వేసవి కాలంలో కూరగాయలు త్వరగా పాడవుతాయి. ఈ సీజన్‌లో కూరగాయలు చెడిపోకుండా ఉండటానికి, వీటిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేస్తారు. అయితే అల్లం విషయానికి వస్తే పరిస్థితి తలకిందులవుంటుంది. ఎండుటాక్టునే అల్లం ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుదామని అనుకుంటే అల్లం త్వరగా ఎండిపోతుంది. అంతేకాదు ఈ అల్లాన్ని ఏదైనా పదార్ధాల్లో కానీ టీలో కానీ ఉపయోగిస్తే రుచి ఉండదు. మరోవైపు అల్లం ధరకూడా ఎక్కువగా ఉండడంతో అల్లం రుచిగా తాజాగా ఉండేలా నిల్వ చేయడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు.
భారతీయ వంటగదిలో అల్లం ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. కూరలు, టీ, చిన్న చిన్న శారీరక ఇబ్బందులు ఎదురైనా అల్లం రసం లేదా దాహార్తిని తీర్చడానికి మజ్జిగలో అల్లం కలపడం వంటివి చేస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో అల్లాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచడం అవసరం. ఎందుకంటే ఎండిన అల్లం ఉపయోగించడం వల్ల ఆహారానికి రుచి ఉండదు. ఈ రోజు అల్లాన్ని రిఫ్రిజిరేటర్‌లో ఉంచకుండా ఎక్కువ కాలం తాజాగా ఎలా ఉంచవచ్చో తెలుసుకుందాం..
మార్కెట్ నుంచి అల్లం కొనుగోలు చేసినప్పుడు.. ప్లాస్టిక్ కవర్ లో పెట్టి ఇస్తారు. అయితే కొంతమంది బద్దకంతో ఆ ప్లాస్టిక్ సంచిలోనే అల్లాన్ని చుట్టి ఉంచేస్తారు. ఇలా చేయడం వలన అల్లం త్వరగా పాడైపోతుంది. అందుకు బదులుగా అల్లంను టిష్యూతో తుడిచి, కాటన్ క్లాత్‌లో చుట్టండి.
అల్లం ధర తక్కువగా ఉంటె.. అప్పుడు ఎక్కువ మొత్తంలో అల్లం కొనుగోలు చేస్తారు, అది క్రమంగా పాడవడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అనంతరం ఒక గాజు సీసా తీసుకుని వెనిగర్‌ను ఆ సీసాలో ఉంచి వేసి అందులో అల్లం వేయాలి. ఇలా చేస్తే నెల రోజుల పాటు అల్లం చెడిపోదు.
అల్లం కంటే అల్లం పేస్ట్ ను నిల్వ చేసుకోవడం ఈజీ.. రిఫ్రిజిరేటర్‌లో ఒక నెలపాటు అల్లం పేస్ట్ నిల్వ ఉంటుంది. ఈ పేస్ట్ ను కూరల్లో లేదా ఇతర ఆహార పదార్ధాల తయారీలో కూడా రోజూ ఉపయోగించవచ్చు.
అల్లం ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ముందుగా ఎండలో ఆరబెట్టాలి. అల్లం బాగా ఆరిపోయాక మెత్తగా పొడి చేసి నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన అల్లం పొడి చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది.
అల్లం ముక్క కట్ చేసి జిప్ లాక్ బ్యాగ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే కనీసం మూడు వారాల వరకు పాడవకుండా అల్లం తాజాగా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..