జనవరిలో ఈ రోజుల్లో భద్ర నీడ.. పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. ఎందుకంటే

మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టనున్నాం.. కొత్త ఏడాదిలో అనేక గ్రహాలు తమ రాశిని మార్చుకోనున్నాయి. సంతోషానికి కారకుడైన శుక్రుడు జనవరిలో తన రాశిని మార్చబోతున్నాడు. ఈ నెలలోనే బుధుడు, సూర్యుడు కూడా తమ రాశిని మార్చుకానున్నాయి. అదే సమయంలో కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే జనవరిలో చాలా తేదీల్లో భద్ర విష్టి కరణం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2025 జనవరిలో భద్రుని నీడ ఎప్పుడు ఏ తేదీల్లో ఉంది.. ఈ భద్ర నీడ సమయంలో ఏమి చేయకూడదో ఈ రోజు తెలుసుకుందాం..

జనవరిలో ఈ రోజుల్లో భద్ర నీడ.. పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. ఎందుకంటే
Bhadra Vishti Karana 2025
Follow us
Surya Kala

|

Updated on: Dec 31, 2024 | 7:09 AM

కొత్త సంవత్సరం 2025 మరికొన్ని గంటల్లో అడుగు పెట్టనున్నాం. 2025 సంవత్సరంలో జనవరి నెలలో కొన్ని రాశులకు శుభప్రదంగా ఉండబోతోంది. ఈ మాసంలో అనేక శుభ గ్రహాలు రాశిని కూడా మార్చుకోనున్నాయి. ఈ శుభ గ్రహాల రాశుల మార్పు వల్ల అనేక రాశుల వారు లాభపడతారు. అలాగే జనవరి నెలలో వచ్చే మకర సంక్రాంతితో ఖర్మలు ముగుస్తాయి. ఖర్మలు ముగియగానే అన్ని రకాల శుభ కార్యాలు ప్రారంభమవుతాయి. జనవరి 14న సూర్య భగవానుడు రాశిని మార్చుకోనున్నాడు. ఈ రోజున మకర సంక్రాంతి పండగను జరుపుకుంటారు.

ఖర్మలు ముగిశాక జనవరిలో కొన్ని తేదీల్లో భద్ర నీడ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ తేదీలలో ఎటువంటి శుభ కార్యాలు చేయకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భద్ర నీడ ప్రత్యేకమైన సమయం. ఈ సమయంలో ఎటువంటి శుభం లేదా శుభ కార్యాలు జరగవు. భద్ర కాలాన్ని విష్టి కరణం అంటారు. భద్ర విష్టి కరణం అశుభమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో చేసే పనులు అశుభ ఫలితాలను ఇస్తాయని నమ్మకం. కనుక ఈ సమయంలో శుభ కార్యాలు చేయకూడదని నమ్మకం. జనవరి నెలలో భద్రుని నీడ ఏయే రోజుల్లో ఉండబోతుందో తెలుసుకుందాం.

జనవరిలో భద్ర ఎప్పుడు ఉంటుంది? (జనవరి భద్ర 2025 తేదీలు)

  1. జనవరి 3, 6, 9, 13, 16, 20, 25, 27 తేదీల్లో భద్రుని ప్రభావం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ సమయంలో ఎటువంటి శుభ కార్యాలు చేయరు.
  2. జనవరి 3, 2025 – మధ్యాహ్నం 12:29 నుంచి 11:40 వరకు భద్ర నీడ ఉంటుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. 6 జనవరి 2025 – 6:20 సాయంత్రం నుంచి 7 జనవరి 05:31 ఉదయం వరకు భద్ర నీడ ఉంటుంది.
  5. 9 జనవరి 2025 – 11:28 సాయంత్రం నుంచి 10 జనవరి 10:25 ఉదయం వరకు భద్ర నీడ ఉంటుంది.
  6. 13 జనవరి 2025 – ఉదయం 5:01 నుంచి సాయంత్రం 4:32 వరకు ఉదయం వరకు భద్ర నీడ ఉంటుంది.
  7. 16 జనవరి 2025 – 3:46 సాయంత్రం నుంచి 17 జనవరి 4:13 ఉదయం వరకు భద్ర నీడ ఉంటుంది.
  8. 20 జనవరి 2025 – ఉదయం 10:05 నుంచి 11:23 ఉదయం వరకు భద్ర నీడ ఉంటుంది.
  9. 24 జనవరి 2025 – ఉదయం 6:42 నుంచి 7:36 ఉదయం వరకు భద్ర నీడ ఉంటుంది.
  10. 27 జనవరి 2025 – అర్థరాత్రి 8.39 నుంచి జనవరి 28 ఉదయం 08.15 ఉదయం వరకు భద్ర నీడ ఉంటుంది.
  11. భద్ర నీడ సమయంలో ఏమి చేయకూడదంటే
  12. భద్ర కాల సమయంలో ప్రయాణం చేయకూడదు.
  13. ఈ సమయంలో శుభ, శుభ కార్యాలు చేయరాదు.
  14. వివాహం, గృహప్రవేశం, శుభకార్యాలు మొదలైన వాటిని నిర్వహించకూడదు.
  15. భద్ర కాల సమయంలో కొత్త పనులను ప్రారంభించకూడదు.
  16. భద్ర కాల సమయంలో ఆస్తిని కొనకూడదు, అమ్మకూడదు.
  17. భద్ర కాలంలో పూజాధి కార్యక్రమాలు నిర్వహించకూడదు.
  18. భద్ర కాలంలో చేసే పనుల్లో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది. కనుక ఈ భద్ర నీడ సమయంలో ఈ పనులు చేయకుండా ఉండాలి. భద్ర అశుభ ప్రభావాలను నివారించడానికి, ఉదయం నిద్రలేచిన తర్వాత భద్రకి సంబందించిన పన్నెండు నామాలను స్మరించుకోవాలి.
  19. భద్ర కాలంలో ఏదైనా ముఖ్యమైన పని కోసం ప్రయాణించవలసి వస్తే.. ఇంటి నుంచి బయలుదేరే ముందు భద్ర నివసించే దిశలో ప్రయాణించవద్దని గుర్తుంచుకోండి. భద్రలో ప్రయాణించడం వల్ల పనిలో విజయం లభించదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!