Tirumala: తెలంగాణ నేతలకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ.. వీఐపీ బ్రేక్ దర్శనం సిఫార్స్ లేఖలకు అనుమతి..

తిరుమల తిరుపతిలో కొలువైన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శన విషయంలో తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. శ్రీవారి ఆలయంలో దర్శనాల విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు (ఎంపీ, ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే) సిఫారసు లేఖలను అనుమతించాలని కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ సిఫార్సు లేఖలపై స్పందించిన స్పీకర్‌ ప్రసాద్ చంద్రబాబు, టీటీడీ చైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Tirumala: తెలంగాణ నేతలకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ.. వీఐపీ బ్రేక్ దర్శనం సిఫార్స్ లేఖలకు అనుమతి..
Tirumala
Follow us
Surya Kala

|

Updated on: Dec 31, 2024 | 6:36 AM

తిరుమల వెంకన్న తెలుగువారి ఆరాధ్య దైవం. స్వామివారిని తెలంగాణ నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత స్వామివారి దర్శనం విషయంలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని తెలంగాణ ప్రజా ప్రతినిధులు గత కొంత కాలంగా నిరసన గళం వినిపిస్తున్నారు. అంతేకాదు తిరుమల వెంకటేశ్వర స్వామితో వందల సంవత్సరాలుగా విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉందని, తెలంగాణ నుంచి ప్రతి రోజూ వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని, ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉందని కనుక ఏపీ సర్కార్ ఈ విషయంలో స్పందించి తమకు ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు.

సీఎం చంద్రబాబును కలిసిన TTD చైర్మన్‌ బీఆర్‌ నాయుడు

గత కొంత కాలంగా తిరుమల కొండపై శ్రీవారి దర్శనాల్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని.. తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. సోమవారం సీఎం చంద్రబాబుతో సమావేశం అయిన బీఆర్‌ నాయుడు.. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై చర్చించారు.

ఇవి కూడా చదవండి

వారానికి 4 సిఫార్సు లేఖలకు ఏపీ సీఎం అంగీకారం

ఈ నేపథ్యంలోనే సిఫార్సు లేఖలు తీసుకునేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు బీఆర్ నాయుడు వెల్లడించారు. వారానికి 4 సిఫార్సు లేఖలను అనుమతించాలని చెప్పినట్లు తెలిపారు. వారానికి 2 బ్రేక్‌ దర్శనాలు.. మరో రెండు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన లేఖలు అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అనుమతి ఇచ్చారని బీఆర్‌ నాయుడు వెల్లడించారు. ప్రతి సిపార్స్ లేఖతో ఆరుగురు భక్తుల వరకు దర్శనానికి సిఫారసు చేయవచ్చు. ఈ నిర్ణయంపై తెలంగాణ ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, టీటీడీ చైర్మన్‌కు తెలంగాణ స్పీకర్‌ ప్రసాద్‌ ధన్యవాదాలు తెలిపారు. గతంలో చంద్రబాబు, టీటీడీ చైర్మన్‌కు వినతి పత్రం ఇచ్చామని… వాటికి ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు స్పీకర్‌. మరోవైపు టీడీపీ నిర్ణయాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్వాగతించారు. ఏపీ ప్రజా ప్రతినిధులతో సమానంగా తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలు అనుమతించాలని కోరారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!