Bathukamma: పూల పండుగ షురూ.. ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలో ఆడిపాడుతున్న ఆడపడుచులు

పూలకున్న రంగులన్నీ తెలంగాణ పల్లెలలై పరుచుకునే సంబరమే బతుకమ్మ వేడుక.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ సంబరాలు నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలకు తెలంగాణ ఆడపడుచులంతా సిద్ధమయ్యారు. 

Bathukamma: పూల పండుగ షురూ..  ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలో ఆడిపాడుతున్న ఆడపడుచులు
Bathukamma Festival
Follow us
Surya Kala

|

Updated on: Sep 25, 2022 | 3:23 PM

Bathukamma: పూలను కొలిచే పుణ్యమైన బతుకు పండుగ ప్రారంభమైంది. వికసించిన పూలన్నీ అందంగా సింగారించుకుని.. తొమ్మిదొద్దులు సంబురంగా ఆడబిడ్డల ఆటపాటలతో కనువిందు చేసే వేడుకలు సిద్దమయ్యాయి. పుడమి తల్లి పచ్చగా మెరిసే క్షణాల్లో తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా భావిస్తున్న పూల పండుగ బతుకమ్మ.. నేటి నుండి ప్రారంభమైంది. తెలంగాణ పూల సింగిడి బతుకమ్మ సంబరాలు ఆరంభమయ్యాయి. పూలతో దేవుడిని కొలిచే ఇలలో.. ఆ పూలనే దేవతగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మను తెలంగాణ వ్యాప్తంగా ఆడబిడ్డలు షురూ చేశారు. గత రెండేళ్లు కోవిడ్ తో భయం భయంగా ఉత్సవాలు జరుపుకున్న అతివలు ఈసారి రెట్టింపు ఉత్సాహంతో బతుకమ్మ ఉత్సవాలు జరుపు కుంటున్నారు..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బతుకమ్మ పండగ సంబరాలు మొదలయ్యాయి.  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు అద్దం పట్టే బతుకమ్మ సంబరాలకు ఆదిలాబాద్ అడవులక్షేత్రం వేదికైంది. ప్రతి ఏటా పెత్తర అమవాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగుతాయి. ఆడపడుచులు తీరొక్క పూలతో, నూటొక్క పిండి వంటలతో గౌరీదేవిని పూజించడం ఆనవాయితీ. ఈ ఏడాది సైతం తొలి రోజులో భాగంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో పాలుపంచుకున్నారు ఆదిలాబాద్ ఆడబిడ్డలు.

ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలకు ఓరుగల్లు ఆడపడుచులంతా సిద్ధమయ్యారు. తీరొక్కపూల తో బతుకమ్మను తయారు చేసి అబురాన్నంటే విదంగా సంబరాలు జరుపుకుంటున్నారు. చూడమూచ్చటైన అలంకరణతో కొత్త వస్త్రాలు ధరించి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పాటలు స్తుతిస్తూ బతుకమ్మను సిద్ధం చేస్తున్నారు. సృష్టిలో ఎక్కడైనా పూలతో దైవాన్ని పూజిస్తాం.. కానీ పూలనే దైవంగా భావించి గోపురంలా పేర్చి ఆరదించడమే ఈ బతుకమ్మ ప్రత్యేకత..

ఇవి కూడా చదవండి

బతుకమ్మను పేర్చడానికి గునుగు పూలు,, తంగేడు పూలు, కట్లపూలు, బంతి, చామంతి, సీత జడ పూలు, ఇలా తీరొక్క పువ్వులతో బతుకమ్మలను సిద్ధం చేస్తున్నారు.. పూల వరసలు పేర్చిన అనంతరం గౌరమ్మను సిద్ధంచేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెలంగాణ లో మాత్రమే కనిపించే ఈ ఆచార సాంప్రదాయాలను ముత్తైదులంతా బతుకమ్మ విశిష్టతను చిన్నారులకు వివరించడం ఆకట్టుకుంటోంది.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటు తున్నాయి.. కోవిడ్ ఎఫెక్ట్ తో గత రెండేళ్లు బతుకమ్మ సంబరాలు నిరాడంబరంగా జరుపుకున్న మహిళలు ఈసారి నూతన ఉత్సాహంతో వేడుకలు జరుపుకుంటున్నారు.. వరంగల్ ఆడపడుచుల్లో బతుకమ్మ ఉత్సాహం ఉరకలేస్తుంది… చిన్ననాటి క్లాస్ మేట్స్, గృహిణిలు, స్నేహితురాళ్లు సామూహికంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటూ ఫుల్ జోష్ వేడుకలు నిర్వహించుకుంటు న్నారు…

ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలకు ఓరుగల్లు మహిళలు ఎలా సన్నద్ధమవుతుమన్నారు. అడుపడుచులు ఫుల్ జోష్ తో బతుకమ్మ సంబరాలకు సిద్ధమైపోయారు.. మరోవైపు ఉత్సవాల నిర్వహణకు అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.. మొదటి రోజు హనుమకొండ లోని వేయి స్తంభాల దేవాలయంలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు.. చెరువులు, కుంటల దగ్గర బతుకమ్మ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..