Astro Tips: బుధవారం నాడు ఈ పరిహారం చేయండి.. చేపట్టిన ప్రతి పని సక్సెస్ అవుతుంది..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధ గ్రహం తెలివితేటలు, కమ్యూనికేషన్, నిర్ణయం తీసుకునే సామర్థ్యానికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. బుధుడుని శుభ గ్రహంగా పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో అశుభ పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రతికూల ఫలితాలకు కూడా కారణమవుతాడు.

Astro Tips: బుధవారం నాడు ఈ పరిహారం చేయండి.. చేపట్టిన ప్రతి పని సక్సెస్ అవుతుంది..!
Mercury Astro Tips
Follow us
Shiva Prajapati

|

Updated on: May 16, 2023 | 3:21 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధ గ్రహం తెలివితేటలు, కమ్యూనికేషన్, నిర్ణయం తీసుకునే సామర్థ్యానికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. బుధుడుని శుభ గ్రహంగా పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో అశుభ పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రతికూల ఫలితాలకు కూడా కారణమవుతాడు. జాతకంలో బుధుని స్థానం చెడుగా ఉంటే చర్మ సంబంధిత రుగ్మతలు, చదువులో ఏకాగ్రత లోపిస్తుంది. బుధవారం కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం ద్వారా.. బుధుడి శుభాశిస్సులు పొందుతారు. ఈ చర్యలు ఉద్యోగం, వ్యాపారంలో కూడా విజయాన్ని అందిస్తాయి. మరి ఆ పరిహారాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బుధవారం చేయాల్సిన పనులు..

1. బుధవారం ఉపవాసం ఉండటం వల్ల వ్యాపార, ఉద్యోగాలలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఉపవాసం పాటించడం ద్వారా.. జ్ఞానాన్ని పొందే వరం లభిస్తుంది. ఉపవాసం చేయడం వల్ల బుధ గ్రహానికి శాంతి కలుగుతుంది. తద్వారా సంపద, విద్య, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.

2. దుర్గామాత, గణేషుడిని పూజించాలి. జీని బుధవారం కుంకుమతో పూజించాలి. ఇలా చేయడం వల్ల దుర్గామాత, గణేశుడి అనుగ్రహం లభిస్తుంది. గణపతి దయవల్ల మీరు చేపట్టే ఏ పనికి ఆటంకం కలగదు.

ఇవి కూడా చదవండి

3. బుధవారం నాడు కొంత డబ్బును దాచిపెట్టండి. దీని వల్ల ఇంటికి శుభాలు కలుగుతాయి. సంప్రదింపులు, కొత్త నిర్ణయాలు, రచనలకు బుధవారం ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున గణేశుడిని అలాగే విష్ణువును కూడా పూజించడం వల్ల మీరు చేపట్టే పనుల్లో పురోగతి కనిపిస్తుంది.

4. ఈ రోజున ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజించడం వల్ల అన్ని కార్యాలు నెరవేరుతాయి. ఈ రోజున ఉప్పు వేయకుండా పప్పుతో చేసిన వంటకాన్ని తినాలి. ఇలా చేయడం వల్ల బుధుడు సంతోషిస్తాడు.

5. బుధవారం ఆహారం తీసుకునే ముందు కొన్ని తులసి ఆకులను గంగాజలంతో కలిపి తీసుకోవాలి. ఆ తరువాత బుధ గ్రహానికి సంబంధించిన ఆకుపచ్చ గడ్డి, పెసర్లు, కంచు పాత్రలు, నీలం పువ్వులు, ఆకుపచ్చ-నీలం దుస్తులు, ఏనుగు దంతాలతో చేసిన వస్తువులను దానం చేయాలి. ఇది కొత్త ఆదాయ వనరులను సృష్టిస్తుంది.

6. తమ జాతకంలో బుధ గ్రహం బలహీనంగా ఉన్న వారు, బుధుడిని శాంతింపజేయడానికి పచ్చ రాయిని ధరించొచ్చు. అయితే, ఈ రాయిని ధరించే ముందు.. జ్యోతిష్యుడి సలహా తీసుకోవడం తప్పనిసరి. బుధుడి ఆధిపత్యం కలిగిన బుధగ్రహానికి భంగం కలిగిన వారు బుధ శాంతి కోసం పచ్చ రాయిని ధరించాలి. అయితే దీనికి ముందు జ్యోతిష్యుని సలహా తీసుకోండి. మెర్క్యురీ ఆధిపత్యంలో ఉన్న మిథున రాశి, కన్య రాశి వారికి పచ్చ రాయి చాలా శుభప్రదం.

7. బుధవారం రోజు శ్రీ మహావిష్ణువు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. శుభ ఫలితాలను పొందడానికి బుధ బీజ్ మంత్రం ‘ఓం బ్రాం బ్రీం బ్రోం సః బుధాయ నమః’ ‘|| ఓం బం బుధాయ నమః ||’ మంత్రాలను జపించాలి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలు కేవలం మత గ్రంధాలు, విశ్వాసాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..