Money Vastu Tips: ఆర్ధిక ఇబ్బందులా.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం 11 శుక్రవారాలు ఇలా చేసి చూడండి..
తీవ్రంగా శ్రమిస్తారు. అయితే ఎంతకష్టపడినా ఆర్ధిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే కొన్ని చర్యలు తీసుకుంటే ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చు. జ్యోతిష్యం ప్రకారం డబ్బు మీ చేతిలో ఉండకపోవచ్చు లేదా డబ్బు చేతికి వచ్చిన వెంటనే ఖర్చు అవుతుంది.
చాలా మంది జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. కొందరు ఆస్తులు అంతస్థులతో సంతోషంగా ఉంటే.. మరికొందరు అప్పుల బారిన పడి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అప్పులు ఎలా చెల్లించాలనేదే ఆందోళన చెందుతూ ఉంటారు. ప్రతి వ్యక్తి జీవితంలో అన్ని రకాల సుఖాలు పొందాలని కోరుకుంటాడు. తమపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఆశీస్సులు కొనసాగాలని అందరూ కోరుకుంటారు. తీవ్రంగా శ్రమిస్తారు. అయితే ఎంతకష్టపడినా ఆర్ధిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
అయితే కొన్ని చర్యలు తీసుకుంటే ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చు. జ్యోతిష్యం ప్రకారం డబ్బు మీ చేతిలో ఉండకపోవచ్చు లేదా డబ్బు చేతికి వచ్చిన వెంటనే ఖర్చు అవుతుంది. ఇలా ఆర్ధిక ఇబ్బందులు కొనసాగుతూ ఉంటే.. వాస్తు శాస్త్రంలో పరిష్కారం సూచించబడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మట్టి కలశాలతో లక్ష్మి అనుగ్రహం కోసం కొని పరిహారాలు చేయవచ్చు.
మట్టి కలశ పరిహారాలు జీవితంలో కొన్ని సానుకూల మార్పులను తీసుకురాగలదు. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పరిహారం మీ ఇంటి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఈ నివారణ కోసం ఒక చిన్న మట్టి కుండ తీసుకొని అందులో 1 రూపాయి చొప్పున 5 నాణేలు వేయండి. అనంతరం ఈ కలశంలో బియ్యం, గోధుమలు, బార్లీ వంటి ఏదైనా ధాన్యాన్ని తీసుకొని పూర్తిగా నింపండి. తర్వాత ఒక ఎర్రటి క్లాత్ ను తీసుకొని, కలశంపైన కట్టండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కలశాన్ని లక్ష్మీ దేవి విగ్రహం లేదా చిత్రపటం దగ్గర ఉంచి పూజించండి. రోజంతా ఈ కలశం లక్ష్మీదేవి దగ్గర ఉంచండి. మర్నాడు మళ్ళీ లక్ష్మిదేవిని పూజించిన తర్వాత అక్కడ నుంచి ఆ కలశాన్ని తీసుకుని భద్రంగా, అల్మారాలో లేదా డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో ఉంచండి. ఈ పరిష్కారం చేయడం ద్వారా ఆర్ధిక ఇబ్బందులు తొలగి అదృష్టం సొంతం అవుతుంది.
కొబ్బరికాయతో పరిహారం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొబ్బరికాయ లక్ష్మి వాసం ని భావిస్తారు. కొబ్బరికాయను ఉంచిన ఇంట్లో లక్ష్మీ దేవి నివసిస్తుందని చెబుతారు. ఇందుకోసం కొబ్బరికాయను తీసుకుని ఎర్రటి గుడ్డలో చుట్టాలి. తరువాత ఈ కొబ్బరికాయను లక్ష్మీ దేవి దగ్గర ఉంచి పూజించాలి. ఈ కొబ్బరికాయను సురక్షితమైన లేదా డబ్బు ఉంచే ప్లేస్ లో ఉంచండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం చిరస్థాయిగా నిలిచి సుఖ సంతోషాలు లభిస్తాయి.
లక్ష్మీదేవి ఎలా పూజించాలంటే శుక్రవారం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి ప్రార్థన చేయండి. ఆర్థిక సంక్షోభం లేదా డబ్బు నష్టంతో ఇబ్బందులు పడుతుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. అమ్మవారిని పూజించడంతో పాటు పసుపు కలిపిన బియ్యంతో పూజ చేయాలి. అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత లక్ష్మిదేవికి పూజతో పాటు గులాబీ పువ్వులు, దండను సమర్పించండి. ఈ పరిహారాన్ని 11 శుక్రవారాలు చేయటం వలన సంపద లభిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).