Good Luck Mantra: జీవితంలో కష్టాలు తొలగిపోవాలంటే పూజ మంత్రమే కాదు ఈ మంత్రాలు పఠించడం బెస్ట్ రెమిడీస్

సనాతన ధర్మం ప్రకారం మనిషి మంత్రాలను పఠించడం లేదా వాటిని వినడం ద్వారా శక్తిని పొందుతాడు. ఈ మంత్రాలు చాలా అద్భుతాలని నిరూపించబడ్డాయి. మంత్రాలను హృదయపూర్వకంగా జపిస్తే జీవితంలోని డబ్బు కష్టాలు, అనారోగ్యం, ఇంటిలో ఏర్పడే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఏ మంత్రాలను ఎలా జపించాలో.. ఏఏ మంత్రాలను జపించాలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం..  

Good Luck Mantra: జీవితంలో కష్టాలు తొలగిపోవాలంటే పూజ మంత్రమే కాదు ఈ మంత్రాలు పఠించడం బెస్ట్ రెమిడీస్
Mantras In Hindu Dharma
Follow us
Surya Kala

|

Updated on: May 28, 2023 | 11:52 AM

హిందూ మతంలో ఆరాధన అనేది మన జీవితంలో ఏర్పడే సమస్యలను అధిగమించడానికి.. భగవంతుడిని చేరుకోవడానికి ఒక మార్గంగా పరిగణించబడుతుంది. దైవాన్ని కొలుస్తూ మనస్ఫూర్తిగా చేసే పూజలు నియమ నిష్టలతో చేస్తే ఎటువంటి సమస్యలు అయినా తొలగి పోతాయని విశ్వాసం. అదే సమయంలో కొన్ని మంత్రాలు పఠించడం వలన కూడా భగవంతుని అనుగ్రహం పొందడానికి మంచి మార్గం అని పురాణాలు పేర్కొన్నాయి. సనాతన ధర్మం ప్రకారం మనిషి మంత్రాలను పఠించడం లేదా వాటిని వినడం ద్వారా శక్తిని పొందుతాడు. ఈ మంత్రాలు చాలా అద్భుతాలని నిరూపించబడ్డాయి. మంత్రాలను హృదయపూర్వకంగా జపిస్తే జీవితంలోని డబ్బు కష్టాలు, అనారోగ్యం, ఇంటిలో ఏర్పడే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఏ మంత్రాలను ఎలా జపించాలో.. ఏఏ మంత్రాలను జపించాలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం..

ఓం శ్రీ హనుమతే నమః

ఎవరి జీవితమైనా సమస్యలతో చుట్టుముట్టి ఇబ్బందులు పడుతుంటే.. వాటి నుంచి బయటపడటానికి మార్గం కనిపించకుంటే.. హనుమంతు మంత్రం మంచి ఫలితాలను ఇస్తుంది. ఓం శ్రీ హనుమతే నమః అనే  మంత్రాన్ని పఠించడం ద్వారా హనుమంతుడు అన్ని కష్టాలను తొలగిస్తాడు. తన భక్తులపై అనుగ్రహాన్ని కురిపిస్తాడు.

ఇవి కూడా చదవండి

శ్రీ గణేశాయ నమః

ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తున్నట్లయితే.. ముందుగా శ్రీ గణేశాయ నమః గణపతి మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వల్ల పనిలో విజయం లభిస్తుంది. శుభం కలుగుతుంది. హిందూ మతంలో..శుభకార్యాల్లో, పెళ్లిళ్లలో విఘ్నలు కలగకుండా జరగాలంటూ.. గణపతిని మొదటిగా పూజిస్తారు. అందుకే ఏ పనినైనా మొదలు పెట్టే ముందు శ్రీ గణేశాయ నమః మంత్రంతో ప్రారంభించండి. పనిలో విజయం దక్కుతుంది.

ఓం యక్షరాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నో కుబేరః ప్రచోదయాత్

సంపదల దేవుడైన కుబేరుని ప్రసన్నం చేసుకోవడానికి ఓం యక్షరాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నో కుబేరః ప్రచోదయాత్ మంత్రాన్ని జపించండి. ఇలా జపించడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోయి కుబేరుడి అనుగ్రహం కురుస్తుంది. ఈ కుబేరుడి మంత్రాన్ని పఠించడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. సంపదతో సంతోషంగా ఉంటారు.

మహామృత్యుంజయ మంత్రం 

ఎవరైనా తమ ప్రాణాలకు ముప్పు అని భావిస్తే జీవితంలో ఏదైనా సంక్షోభం ఎదురైతే.. శివునిని కీర్తించే ఈ మంత్రం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. “ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్” అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజూ పఠించడం వల్ల కష్టాల మేఘాలు తొలగిపోతాయి.

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

విష్ణువును లోక రక్షకుడు అంటారు. ఎవరికైనా ఏవైనా కోరికలు నెరవేరకపోతే ప్రతిరోజూ విష్ణువుని కీర్తిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం జపించడం వల్ల అదృష్టం కలుగుతుంది. అన్ని కోరికలు నెరవేరుతాయి.

ఓం ఋణముక్తేశ్వర మహాదేవాయ నమః

ఎవరైనా అప్పుల భారంలో కూరుకుపోయి.. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా బయటపడలేకపోతే, ఓం ఋణముక్తేశ్వర మహాదేవాయ నమః మంత్రాన్ని జపించండి. దీనితో పాటు, మంగళవారం నాడు రుణ విముక్తి మూలాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల అప్పులు తీరడంతోపాటు డబ్బు కొరత కూడా తీరిపోతుంది.

ఓం ఘృణి సూర్యాయ నమః

ఎవరి జాతకంలోనైనా సూర్యుడు బలహీనంగా ఉన్నా లేదా సూర్య దోషం ఉన్నా సూర్య భగవానుడి ప్రసన్నం చేసుకోవడానికి  ఓం ఘృణి సూర్యాయ నమః మంత్రం పఠించండి. ఇలా చేయడం వల్ల అన్ని కష్టాలు తీరి శుభాలు కలుగుతాయి. ప్రతిరోజూ సూర్యునికి అర్ఘ్యన్ని సమర్పించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).