Astro Tips: సుఖ సంపదల కోసం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారంనాడు ఏ విధంగా పూజించాలంటే..

Astro tips: శుక్రవారంరోజున లక్ష్మీ దేవిని పూజిస్తారు. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు కొందరు భక్తులు శుక్రవారం రోజున ప్రత్యేక పూజలు చేయడమే కాదు.. ఉపవాసం ఉంటారు

Astro Tips: సుఖ సంపదల కోసం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారంనాడు ఏ విధంగా పూజించాలంటే..
Jyotish Tips
Follow us

|

Updated on: Jun 10, 2022 | 9:16 PM

Astro Tips: సనాతన హిందూ ధర్మంలో సంపదల దేవతగా లక్ష్మీ దేవిని పూజిస్తారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు అనేక పూజలు, వ్రతాలు చేస్తారు. అయితే లక్ష్మీదేవి  పూజలు మాత్రమే కాదు దానం చేయడం కూడా ఎంతో ప్రీతికరమైనదనేది. నిజానికి, హిందూమతంలో దాతృత్వానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. హిందూ మతంలో.. ప్రతి రోజు ఒకొక్క దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడింది. సోమవారం శివుడు, మంగళవారం హనుమంతుడు,  బుధవారం శ్రీ గణేషుడి ఇలా వారంలో ఏడు రోజులు ఒకొక్క దేవుళ్ళను పూజిస్తారు. శుక్రవారంరోజున లక్ష్మీ దేవిని పూజిస్తారు. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు కొందరు భక్తులు శుక్రవారం రోజున ప్రత్యేక పూజలు చేయడమే కాదు.. ఉపవాసం ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న చోట జీవితంలో డబ్బులకు కొరత ఉండదని.. ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడవని నమ్మకం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్రవారం రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది.  తల్లి అనుగ్రహం సదా మీ వెంట ఉంటుంది. కనుక ఈరోజు శుక్రవారం నాడు చేయవలసిన కొన్ని ప్రభావవంతమైన జ్యోతిష్య పరిహారాల గురించి ఈరోజు తెలుసుకుందాం..

శుక్రవారం చేయాల్సిన పరిహారాలు:  1. మీరు లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే..  రోజున ఉపవాసం ఉండి.. పూజ చేసే సమయంలో గులాబీ రంగు దుస్తులను ధరించండి. మీరు కూర్చున్న లేదా పూజ చేసే సమయంలో కూర్చునే ఆసనం రంగు కూడా గులాబీ రంగులో ఉండే విధంగా చూసుకోండి. అనేకాదు పింక్ కలర్ క్లాత్‌పై మాత్రమే లక్ష్మీదేవి విగ్రహాన్ని,  శ్రీ యంత్ర చిత్రాన్ని ఏర్పాటు చేసుకోండి.

ఇవి కూడా చదవండి

2. ఎక్కడ పరిశుభ్రత కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు. అటువంటి ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. అయితే శుక్రవారం మాత్రం పొరపాటున కూడా ఇంటిలో బూజులు దులపడం వంటి పనులు చేయకండి.

3.లక్ష్మిదేవికి తామరపువ్వు , శంఖం చాలా ప్రీతికరమైనదని శాస్త్రాలలో చెప్పబడింది. శుక్రవారం పూజ చేసేటప్పుడు  తామరపూలను ఉంచి శంఖాన్ని ఊదండి. వీలైతే ఈ రోజున గుడికి వెళ్లి లక్ష్మీదేవిని పూజించండి

4.లక్ష్మిదేవిని ప్రసన్నం చేసుకోవడానికి దానం చేయవచ్చు. హిందూమతంలో దానధర్మాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఎవరికైనా పసుపు బట్టలు దానం చేయండి. లేదా లక్ష్మి దేవికి లడ్డులను నైవేద్యంగా సమర్పించి.. అనంతరం ఆ లడ్డులను పేదవారికి, ఆకలిగా ఉన్నవారికి దానంగా ఇవ్వండి.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!