AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips For Morning: బ్రహ్మ ముహర్తంలో నిద్రలేచి 2 పనులు చేసి చూడండి.. ఆరోగ్యం, అదృష్టం మీ సొంతం

శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి  ఇంటిలోని పూజ గదిలో పూజ చేయాలి. బ్రహ్మ ముహర్త సమయంలో దేవతలను పూజించడం వల్ల మానసిక, శారీరక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు భగవంతుని దయతో అన్ని రంగాల్లో విజయంతో పాటు ధనలాభం కలుగుతుంది.

Astro Tips For Morning: బ్రహ్మ ముహర్తంలో నిద్రలేచి 2 పనులు చేసి చూడండి.. ఆరోగ్యం, అదృష్టం మీ సొంతం
Brahma Muhurta
Surya Kala
|

Updated on: Jul 29, 2023 | 7:42 AM

Share

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఉదయం ఏ విధంగా గడిస్తే.. ఆ రోజు అంతా అదే విధంగా ఉంటుందని.. కనుక ఉదయం చేసే పని రోజువారీ దినచర్యపై తీవ్ర ప్రభావం చూపుతుందని నమ్ముతారు. అందుకే తెల్లవారుజామున లేవాలని.. మొట్ట మొదట రోజుని దేవుడి నామస్మరణతో ప్రారంభించాలని సూచిస్తారు.  ఇలా చేయడం వల్ల జీవితంపై సానుకూల ప్రభావం ఉంటుంది. దీంతో జీవితంలోని ఒక్కో సమస్య క్రమంగా దూరమవుతుంది. అంతేకాదు దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుంది. తెల్లవారు జామున బ్రహ్మ ముహర్తంలో చేయాల్సిన రెండు పనుల గురించి తెలుసుకుందాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజూ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.  ఎందుకంటే దేవుడు కూడా బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటాడు. కనుక తెల్లవారుజామున 4 నుండి 5.30 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు.

బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ఏమి చేయాలంటే..   హిందూ పురాణాల ప్రకారం ఉదయం నిద్రలేచిన తర్వాత చేయాల్సిన మొదటి పని అరచేతులను చూడటం. కరాగ్రే వసతు లక్ష్మీ, కరామధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కర దర్శనం! అనే మంత్రాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల దేవతల ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. అంతేకాదు సంపదకు దేవత అయిన లక్ష్మి దేవి,  విద్యా దేవత సరస్వతిల ఆశీర్వాదాలు లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

బ్రహ్మ ముహూర్తంలో పూజ  శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి  ఇంటిలోని పూజ గదిలో పూజ చేయాలి. బ్రహ్మ ముహర్త సమయంలో దేవతలను పూజించడం వల్ల మానసిక, శారీరక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు భగవంతుని దయతో అన్ని రంగాల్లో విజయంతో పాటు ధనలాభం కలుగుతుంది. పూజతో పాటు నవగ్రహ శాంతి మంత్రం  జపించాలి. ఇలా చేయడం వలన జీవితంలో వచ్చే అతి పెద్ద ఇబ్బందులను సులభంగా అధిగమిస్తారు. దీంతో పాటు జాతకంలో నవగ్రహ శాంతి ఉంటుంది. ఈ మంత్రంతో పాటు గాయత్రీ మంత్రం ఓం భూర్ భువః స్వాః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని కూడా జపించాలి. ఇలా చేయడం వల్ల పని చేసే సామర్థ్యం అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు.

బ్రహ్మ ముహూర్తపు సమయం ఏమిటి? తెల్లవారుజామున 4 గంటల నుండి 5.30 గంటల మధ్య కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Follow Us
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు