AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venus Transit: సింహరాశిలో శుక్రుడు తిరోగమనం.. ఈ 4 రాశుల వారికి ధన నష్టం.. ఆరోగ్య సమస్యలు..

శుక్రుడు తిరోగమనం.. అస్తమయం వలన కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. అంతేకాదు ఇబ్బందులు పెరుగుతాయి. అంతేకాదు వీరు ధన నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. వైవాహిక జీవితంలో, ప్రేమ జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఏర్పడతాయి. శుక్రుడు తిరోగమన  సమయంలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు జ్యోతిష్కులు.

Venus Transit: సింహరాశిలో శుక్రుడు తిరోగమనం.. ఈ 4 రాశుల వారికి ధన నష్టం.. ఆరోగ్య సమస్యలు..
Venus Transit
Surya Kala
|

Updated on: Jul 29, 2023 | 8:38 AM

Share

నవగ్రహాల్లో ఒకటి శుక్రుడు. ఇతను రాక్షసులకు గురువు కూడా శుక్రుడు భౌతిక ఆనందానికి కారకుడుగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలో శుక్రుడు బలమైన స్థానంలో ఉంటాడో వారు భౌతిక ఆనందం, విలాసం, కీర్తి మొదలైనవి పొందుతారు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రుడు ఆగస్టు 7న కర్కాటక రాశిలో తిరోగమన స్థితిలో ఉండనున్నాడు. ఈ స్థితిలో శుక్రుడు 2 అక్టోబర్ 2023 వరకు ఉండనున్నాడు. ఈ నేపథ్యంలో ఆగస్టు 8న నుంచి కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. శుక్రుడు తిరోగమనం.. అస్తమయం వలన కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. అంతేకాదు ఇబ్బందులు పెరుగుతాయి. అంతేకాదు వీరు ధన నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. వైవాహిక జీవితంలో, ప్రేమ జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఏర్పడతాయి. శుక్రుడు తిరోగమన  సమయంలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు జ్యోతిష్కులు. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

కన్య రాశి ఈ రాశిలోనే శుక్రుడు తిరోగమనంలో ఉన్నాడు.. అంతేకాదు పదకొండవ ఇంట్లో అస్తమించనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సోదరుడు, సోదరి మధ్య సంబంధంలో వివాదాలు ఏర్పడవచ్చు. ఈ రాశిలో రెండవ, తొమ్మిదవ ఇంటికి శుక్రుడు అధిపతి. అటువంటి పరిస్థితిలో ఈ రాశి వారు ధన నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. వైవాహిక జీవితంలో కూడా కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. అంతేకాదు పిల్లల గురించి కూడా ఆందోళన చెందుతారు.

తుల రాశి ఈ రాశిలో శుక్రుడు పదవ ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాశి వ్యక్తులు  ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఉద్యోగస్తుల జీవితంలో కొన్ని హెచ్చు తగ్గులు ఉండవచ్చు. సమాజంలో గౌరవం లోపించవచ్చు.

ఇవి కూడా చదవండి

ధనుస్సు రాశి ఈ రాశి వారి జాతకంలో శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో అస్తమించి..  తిరోగమనం చేయనున్నాడు. ఈ భావన ఆకస్మిక సంఘటనలతో ముడిపడి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ రాశికి చెందిన వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సమస్యలు అకస్మాత్తుగా తలెత్తుతాయి. కొన్ని విషయాల వల్ల కుటుంబంతో సంబంధాలు చెడిపోవచ్చు. మాట్లాడే విషయంలో కొంచెం నియంత్రణ అవసరం.

కుంభ రాశి ఈ రాశిలో శుక్రుడు తిరోగమనంలో ఉన్నాడు.. ఆరవ ఇంట్లో అస్తమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రుడి తిరోగమనం అనారోగ్య కారకంగా, శత్రువుగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో, ఈ రాశికి చెందిన  వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ శత్రువు మీపై ఆధిపత్యం చెలాయిస్తాడు. వీరు ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)