AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surya Gochar 2023: త్వరలో సింహరాశిలో సూర్యుని సంచారం ..ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే..

ప్రస్తుతం సూర్యుడు కర్కాటకరాశిలో  ఉన్నాడు. అయితే సూర్యుడు తన గమనాన్ని మార్చుకుని ఆగష్టు 17న తన సొంత రాశి అయిన సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఏడాది  తర్వాత సూర్యుడు సింహరాశిలో ప్రవేశించబోతున్నాడు. సూర్యుని ఈ సంచారము వలన కొన్ని రాశుల వారు ధనప్రాప్తితో పాటు సమాజంలో గౌరవాన్ని పొందుతారు.

Surya Gochar 2023: త్వరలో సింహరాశిలో సూర్యుని సంచారం ..ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే..
Surya Gochar 2023
Surya Kala
|

Updated on: Jul 29, 2023 | 11:33 AM

Share

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం నవ గ్రహాలకు రాజు సూర్యుడు ప్రతి నెలా తన గమనాన్ని మార్చుకుంటాడు. ఒక రాశి నుంచి మరొక రాశిలో అడుగు పెడతాడు. ఇలా సూర్యుని మార్పును సంక్రాంతి అంటారు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే.. ఆ పేరుతో సంక్రాంతిగా పిలుస్తారు. ప్రస్తుతం సూర్యుడు కర్కాటకరాశిలో  ఉన్నాడు. అయితే సూర్యుడు తన గమనాన్ని మార్చుకుని ఆగష్టు 17న తన సొంత రాశి అయిన సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఏడాది  తర్వాత సూర్యుడు సింహరాశిలో ప్రవేశించబోతున్నాడు. సూర్యుని ఈ సంచారము వలన కొన్ని రాశుల వారు ధనప్రాప్తితో పాటు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. సూర్యుని సంచారం వల్ల ఏ రాశుల వారికి విశేష ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం.

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు ఆగష్టు 17, 2023 మధ్యాహ్నం 1.23 గంటలకు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు.

మిథున రాశి:

ఇవి కూడా చదవండి

ఈ రాశిలో సూర్యుడు మూడవ ఇంట్లో ఉండనున్నాడు. అటువంటి పరిస్థితిలో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు. ఉద్యోగస్తులు తమ పనితో ప్రశంసలను అందుకుంటారు. అంతేకాదు ప్రమోషన్‌ కూడా వచ్చే అవకాశాలున్నాయి. చాలాకాలంగా ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. కుటుంబం లేదా స్నేహితులతో యాత్రకు వెళ్లే అవకాశం ఉంది.

కర్కాటక రాశి ఈ రాశిలో సూర్యుడు రెండో ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. ఈ ఇల్లు పొదుపు, వాక్కు, కుటుంబానికి చెందిన ఇల్లుగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ రాశికి చెందిన వ్యక్తులకు అకస్మాత్తుగా ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులు సంతోషంగా గడుపుతారు. కుటుంబం సభ్యుల సహక సహకారాలు లభిస్తాయి.  అయితే మీ ప్రసంగం , ప్రవర్తనపై కొంచెం నియంత్రణ ఉంచండి, ఎందుకంటే ఇది మీ సంబంధాన్ని పాడుచేయడానికి కారణం కావచ్చు.

సింహరాశి  

ఈ రాశిలో సూర్యుడు లగ్న గృహంలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు సింహ రాశికి అధిపతి. అటువంటి పరిస్థితిలో, ఈ రాశికి చెందిన వ్యక్తుల మంచి ఆరోగ్యం, శక్తిని పొందుతారు. విశ్వాసాన్ని పొందవచ్చు. మీ పని తీరుతో విజయాన్ని పొందవచ్చు. అనేక కొత్త బంగారు అవకాశాలు కూడా లభిస్తాయి. వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు అందరి హృదయాలను గెలుచుకోవచ్చు.

తుల రాశి సూర్యుడు తులారాశిలోని పదకొండవ ఇంట్లోకి ప్రవేశించనున్నాడు. ఈ ఇల్లు కోరిక, డబ్బు లాభం, తండ్రి, ఇతర కుటుంబ సభ్యులకు సంబంధించినదిగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో, సింహరాశిలో సూర్యుని ప్రవేశం ఈ రాశికి చెందిన వ్యక్తులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చాలాకాలంగా ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. కుటుంబం, పిల్లలతో సరదాగా గడుపుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)